»   » ఆడేసుకున్నారు మనతో... ('ఆటాడుకుందాం రా' రివ్యూ )

ఆడేసుకున్నారు మనతో... ('ఆటాడుకుందాం రా' రివ్యూ )

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  1.5/5

  ఎన్నారై హీరో వచ్చి ఎప్పుడు కలుపుతాడా , కలిసిపోదాం అన్నట్లు ఎదురూచూసే విడిపోయిన రెండు కుటుంబాలు...అలాగే ఈ ఎన్నారై హీరో కోసం ఎప్పుడొస్తాడా ప్రేమలో పడిపోదాం అన్నట్లు ఎదురూచూసే ఓ హీరోయిన్...అంతేనా.. ఈ హీరో చేతిలో పడి తన్నులు తిని, బఫూన్ అవటానికి ఓ విలన్. అఫ్ కోర్స్ ఆ విలనే...ఆ రెండు కుటుంబాల మధ్య విభేధాలకు కారణం అనుకోండి.

  ఇక ఈ స్టోరీ లైన్ మధ్యలో బ్రహ్మానందం లేకపోతే ధర్టి ఇయిర్స్ పృధ్వీ, పోసాని ఇలా ఎవరో ఒక కమిడయన్... విలన్ ని వెర్రి వెధవను చేయటానికి పనికివస్తూ...తమకు తెలియకుండానే హీరో చేతిలో బకరా అవుతారు. ఇదీ అనాదికాలంగా వస్తున్న తెలుగు సినిమా స్కీమ్. అలాంటి ఈ సరి కొత్త కథలోకి ఒక్కో యంగ్ హీరో వచ్చి నటించిపోతూంటారు. ఇప్పుడు అలాగే యంగ్ హీరో సుశాంత్ కూడా వచ్చాడు. అదే ఈ సినిమా. ఈ సినిమా బాగుందా అంటే ..అది జ్ఞాపకశక్తి మీద, సినిమాల పట్ల ..మీ ఉదాశీనత శాతం మీద ఆధారపడి ఉంటుంది.


  ఆనంద్ ప్రసాద్ (ఆనంద్), విజయరామ్ (మురళి శర్మ) క్లోజ్ ఫ్రెండ్స్,బిజినెస్ పార్టనర్స్. కానీ వారి ప్రత్యర్ది విలన్ అయిన శాంతారామ్,సోమరాజు (పోసాని)కు వీరి స్నేహం చూసి కన్ను కుట్టడంతో విడిపోయేలా చేస్తారు. విజయ్ రామ్ తన ఆస్దిని ,స్నేహాన్ని పోగొట్టుకుంటాడు. సంవత్సరాల తర్వాత కార్తీక్(సుశాంత్) సీన్ లోకి వస్తాడు.


  కార్తీక్ ఓ ఎన్నారై, ఆనంద్ కొడుకు. అతను విడిపోయిన ఈ స్నేహితులిద్దరినీ కలపాలనుకుంటాడు. అందుకోసం రకరకాల ప్లాన్స్ వేస్తాడు. విలన్స్ ని పట్టిస్తాడు. ఇంతకీ హీరో వేసిన ఆ ఎత్తులేమిటి...ఈ కథలోకి హీరోయిన్ శృతి(సోనమ్ బజ్వా) ఎలా వచ్చింది. బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


  నాగార్జున మేనల్లుడు తొలి నుంచి సొంత బ్యానర్ లో కథలు చేస్తూ ఒక్క సరైన హిట్ కొట్టుకుంటూ గెంటుకొస్తున్నాడు. అయితే ఈ సారి అలా కాదు..పెద్ద హిట్ కొట్టాలని గ్యాప్ తీసుకుని మరీ ఆటాడుకుందాం రా అంటూ మనల్ని పిలిచి, చాలా చోట్ల కామెడీతో నిజంగానే మన బుర్రతో ఆటాడేసాడు...వేటాడేసాడు. రొటీన్ కథ తీసుకుని, అంతకన్నా రొటీన్ సీన్లు పేర్చుకుంటూ వచ్చేసారు.


  ముఖ్యంగా ఎంతో హైప్ చేసి, ట్రైలర్స్ లో హైలెట్ చేసిన...బాద్షా సినిమాలో వచ్చిన డ్రీమ్ మిషన్ తరహాలో రెడీ చేసిన బ్రహ్మీ టైమ్ మిషన్ సీన్స్ చూస్తూంటే మనకు టైమ్ మిషన్ ఏదన్నా దొరికితే కాలం నుంచి ముందుకో వెనక్కే పారిపోయి ఈ సినిమానుంచి తప్పించుకుందుము కదా అని అనిపిస్తుంది.


  స్లైడ్ షోలో మిగతా రివ్యూ


  ఎటు నుంచి ఎటు పోతుందో

  సినిమా స్పెషాలిటీ ఏమిటి అంటే చాలా సార్లు మనం ఓ సినిమాకు వస్తే మరో సినిమా షో మధ్యలో వేసేస్తున్నారేమో అని డౌట్ వచ్చేస్తూంటుంది. అంతలా కథని రెడీ చేసారు.


  స్క్రీన్ ప్లే ప్లాబ్లం

  సినిమాలో కామెడీ బిట్స్, సెంటిమెంట్ సీన్స్ కలవకపోవటం తో వేర్వేరు కథలుగా అన్నట్లు అనిపిస్తూంటాయి. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రధాన సమస్య అని తెలుస్తూనే ఉంటుంది.


  కలిసిరాని మిషన్

  సినిమాలో టైమ్ మిషన్ సీన్స్ ఎంతమాత్రమూ కలిసి రాలేదు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నట్లుగా సినిమాలో సీన్స్ ఫిల్ చేయటానికి తప్ప దేనికి ఉపయోగపడలేదు.


  రొటీన్

  సినిమా ఇంతలా బోర్ కొట్టడానికి కారణం..శ్రీను వైట్ల రెడీ స్కీమ్ ని లక్షో సారి తీయటమే. రాబోయే పదో సీన్ కూడా చెప్పేసాలగ సీన్స్ పేర్చారు.


  బ్రహ్మీ ఫెయిల్

  నిజానికి బ్రహ్మానందం ఈ సినిమాలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పటానికి లేదు. ఎందుకంటే ఆయన్ను వాడుకునే సత్తా దర్శకుల్లో తగ్గిపోతోందనిపిస్తుంది. ఆయన కామెడీ జనరేటర్


  చీటింగ్

  హీరో ...విలన్స్ ని చీట్ చేస్తూంటే అది కామెడీ రప్పించకపోగా కామెడీ సినిమా చూడటానికి వచ్చిన మనని చీట్ చేస్తున్న పీల్ కలుగుతుంది.


  టెక్నికల్ గా

  తొలిసారి అనూప్ రూబెన్స్ ఇంత డల్ మ్యూజిక్ ఇవ్వటం . అలాగే సినిమా చూస్తూంటే బోర్ కొట్టిందో ఏమో ..అసలు ఎడిటింగ్ సరిగా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ని పట్టించుకోలేదు. అయితే ఉన్నంతలో సినిమాటోగ్రఫీ బాగుంది.


  ఎవరెవరు..

  బ్యానర్‌: శ్రీనాగ్‌ కార్పొరేషన్‌
  తారాగణం: సుశాంత్‌, సోనమ్‌ బాజ్వా, మురళి శర్మ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ, ఆనంద్‌, రఘుబాబు, సుధ, రమాప్రభ. ఝాన్సీ తదితరులు
  మాటలు: శ్రీధర్‌ సీపాన
  సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
  కూర్పు: గౌతరరాజు
  ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
  నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఏ. నాగ సుశీల
  కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
  విడుదల తేదీ: ఆగస్టు 19, 2016


  English summary
  Aatadukundam Raa movie which has been directed by G. Nageswara Reddy has Sonam Bajwa as the heroine released today with divide talk. Aatadukundam Raa is a film with beaten to death formula and routine entertainment.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more