twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సదా టక్కరి-సినిమా సమీక్ష

    By Staff
    |
    Takkari
    Rating
    నటీనటులు-నితిన్, సదా, షాయాజీ షిండే, సనా, రాజేష్,
    మారితి, అలీ, వేణుమాధవ్, రఘుబాబు తదితరులు.
    మాటలు-మరుధూరి రాజా
    సంగీతం-చక్రి
    సాహిత్యం-కందికొండ
    సినిమాటోగ్రఫీ-సంతోష్ ఆర్.ఎస్.బి
    ఎడిటింగ్-గౌతమ్ రాజు
    యాక్షన్-గిల్లి శేఖర్
    కళ-ఎఎస్ ప్రకాష్
    నిర్మాత-పరుచూరి శివరామ ప్రసాద్
    బ్యానర్-యునైటెడ్ మూవీస్
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం-అమ్మ రాజశేఖర్
    విడుదల-నవంబర్ 23, 2007

    గ్యాప్ తరువాత వచ్చిన నితిన్ సినిమా ఇది. ఈ సినిమా లో నితిన్ తిరుపతి పాత్రను పోషించాడు. తిరుపతి ఇష్టం వచ్చినట్టు తిరిగే యువకుడు. ఈయన తిరుగుళ్లు భరించలేక ఆయన తల్లిదండ్రులు(చంద్రమోహన్, సుధ) ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. తిరు(షార్ట్ నేమ్) లో మార్పు రాకపోవడంతో కోపం వచ్చిన ఆయన తండ్రి ఇల్లు విడిచివెళ్లిపొమ్మంటాడు. ఇల్లువదిలిన తిరు ఆ రాత్రి దేవాలయంలో పడుకుంటాడు. పొద్దున లేవగానే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. పేరు ప్రియ(సదా). యధాప్రకారమే మన హీరో ప్రేమలో పడతాడు. ప్రియ పేరుగాంచిన వ్యాపారి గురు (షాయాజీ షిండే) చెల్లెలు. తిరు తన ప్రేమను నేరుగా చెప్పకుండా కొత్తదనం కోసం అన్నట్టుగా కొత్త రూట్లో వెళతాడు. ప్రియ అన్న గురును కలిసి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతాడు. తనతో చెప్పకుండా నేరుగా పెద్దలతో చెప్పడం నచ్చి ప్రియ కూడా ప్రేమలో పడుతుంది. గురు ఒప్పుకున్నాడా...వారి ప్రేమ ఫలించిందా...తిరు తిరిగి ఇంటికి చేరుకున్నాడా అన్న విషయాలు తెరమీద చూడాల్సిందే.

    వరుస పరాజయాలతో విసుగుచెందిన నితిన్ ఏకంగా ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్న తరువాత నటించిన చిత్రం ఈ టక్కరి. 2006 లో తమిళంలో రూపొందిన థిరువిలాయదల్ ఆరంభం సినిమాకు రీమేక్ టక్కరి. సక్సెస్ కోసం తహతహ లాడుతున్న నితిన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టు కనిపించింది. గెటప్ మార్చుకోవడమే కాకుండా డాన్స్ లలో వినూత్నతను కనపరిచాడు. దురదృష్టవశాత్తు టక్కరి ఆయనకు సక్సెస్ ను తెచ్చే సినిమాగా కనిపించడంలేదు. కథలో కొత్త ట్విస్టులు, వినోదాత్మక సన్నివేశాలున్నప్పటికీ ఇవి ప్రేక్షకులను థియేటర్ కు రప్పిస్తాయోలేదో మరి.

    సినిమాలో సదా గ్లామరస్ గా కనపడడమే కొంత అహ్లాదపరిచే అంశం తప్ప ఆకట్టుకునే అంశాలు మరేమీ ఈ సినిమాలో లేవు. షాయాజీ షిండే ఎప్పటిలాగే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రఘుబాబు నవ్వించాడు. మిగతా హాస్యనటులకు సరైన సన్నివేశాలు లేవు. నితిన్, షాయాజీ షిండేల మధ్య సన్నివేశాలు ఈ సినిమాను ఎవరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు. నటనపరంగా చూస్తే నితిన్ ఎంతో మెరుగయ్యాడనిపించే సినిమా ఇది. మొత్తానికి పరవాలేదనిపించే సినిమా.

    (గమనిక: వినోదం అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు,కథన నైపున్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు మా రేటింగ్ కు సంబందం ఉండనవసరం లేదు)

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X