twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేజ్ ఐ లవ్ యు మూవీ రివ్యూ: తొలిప్రేమ-2

    By Rajababu
    |

    Recommended Video

    Tej I Love U Movie Review

    Rating:
    2.5/5
    Star Cast: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్,
    Director: కరుణాకరన్

    టాలీవుడ్‌లో మెగా మేనల్లుడిగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్ ఆరంభించి వరుస విజయాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఇటీవల కాలంలో తేజ్‌కు విన్నర్, ఇంటిలిజెంట్ చిత్రాలు నిరాశను కలిగించాయి. దాంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ డైరెక్షన్‌లో, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌‌తో జతకట్టి తేజ్ ఐ లవ్ యు చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తేజ్ సిద్ధమయ్యారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూలై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవడానికి తేజ్ తేజ్ ఐ లవ్ యు చిత్ర కథలోకి వెళ్లాల్సిందే.

    తేజ్.. ఐ లవ్ యు కథ

    తేజ్.. ఐ లవ్ యు కథ

    తేజ్ (సాయిధరమ్ తేజ్) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతుంటాడు. చిన్నతనంలో ఓ కారణంగా జైలుశిక్ష అనుభవిస్తాడు. పెదనాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఫ్యామిలీకి దూరమవుతాడు. ఈ క్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడుతాడు. కానీ తేజ్‌ను వెతుక్కుంటూ నందిని లండన్‌ నుంచి ఇండియాకు వస్తుంది. తేజ్‌ పరిచయం ప్రేమగా మారుతుంది. తేజ్, నందిని ఇద్దరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నందిని యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మరిచిపోతుంది.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    తేజ్ ఎందుకు జైలుశిక్ష అనుభవించాడు? తేజ్ ఫ్యామిలికి ఎందుకు దూరమయ్యాడు? తేజ్‌ను ఎందుకు వెతుక్కొంటూ వచ్చింది? గతాన్ని మరిచిపోయిన నందినికి తేజ్ తన ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏం చేశాడు? మరిచిపోయిన గతాన్ని నందిని గుర్తు తెచ్చుకొందా? చివరకు నందిని, తేజ్ ఒక్కటయ్యేందుకు ఎలాంటి అడ్డంకులను అధిగమించారు అనే ప్రశ్నలకు సమాధానమే తేజ్ ఐ లవ్ యూ చిత్రం కథ.

    తేజ్.. ఐ లవ్ యు ఫస్టాఫ్

    తేజ్.. ఐ లవ్ యు ఫస్టాఫ్

    కాలేజీలో ఫ్రెండ్స్‌తో కలిసి తేజ్ ఎంజాయ్ చేసే అంశాలతో కథ ప్రారంభమవుతుంది. తేజ్ పుట్టిన రోజు, ఇంట్లో పెళ్లి వేడుక లాంటి సన్నివేశాలతో ఫస్టాఫ్‌లో కథ చాలా రొటీన్ సాగుతుంది. ఫ్యామిలీకి దూరమయ్యే సీన్‌తో కొంత ఎమోషన్ పాయింట్ టచ్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య టిట్ ఫర్ టాట్, ఫృథ్వీ కామెడీ లాంటి అంశాలతో సరదాగా గడిచిపోతుంది. అనుపమ పరమేశ్వరన్‌కు యాక్సిడెంట్ కావడం గతాన్ని మరిచిపోవడం లాంటి సీన్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

    తేజ్.. ఐ లవ్ యు సెకండాఫ్

    తేజ్.. ఐ లవ్ యు సెకండాఫ్

    తేజ్ ఐ లవ్ యు రెండో భాగంలో లాజిక్కులు లేకుండా కథ ముందుకు సాగిపోతుంది. గతాన్ని మరిచిన అనుపమకు వాటిని గుర్తు తేవడం, మధ్యలో నందిని తండ్రికి సంబంధించిన విలన్ మార్కు ఎపిసోడ్స్ కొంత గందరగోళంగా ఉాంటాయి. సినిమా రెండో భాగంలోని చివరి అర్ధగంటలో కథలో అసలు బలం ఏంటో తెలుస్తుంది. ఫీల్ గుడ్ అంశాలతో సినిమా మరో మెట్టు ఎక్కినట్టు అనిపిస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ సీన్ ఉద్వేగానికి గురిచేస్తుంది. ఆ తర్వాత ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా ఆశించిన ప్రేక్షకులకు నిరాశ కలుగుతుంది. అవే రొటీన్ సీన్లతో క్లైమాక్స్ చేరుకొంటుంది. ఇక హీరో, హీరోయిన్లు కలిసే చివరి సీన్‌లో ఏలాంటి భావోద్వేగం లేకుండా చప్పగా ముగుస్తుంది. ఇదంతా చూసిన తర్వాత తొలిప్రేమకు మరో వెర్షన్‌లా ఉన్నట్టుందే అనే ఫీలింగ్ కలగడం చాలా సహజమైన అంశం.

    కరుణాకరన్ దర్శకత్వం

    కరుణాకరన్ దర్శకత్వం

    దర్శకుడు కరుణాకరన్ ఇంకా తొలిప్రేమ హాయంలోనే ఉన్నట్టు కనిపించింది. తనకు తెలిసిన ఫార్ములానే మళ్లీ ప్రేక్షకులపై రుద్దేందుకు ప్రయత్నించారు. సక్సెస్ ఫార్మాలాను కనీసం జాగ్రత్తగా పట్టాలెక్కించిన బాగుండేదేమో. తొలిభాగంలో నాసిరకమైన సీన్లతో విసుగు పుట్టించడమే కాకుండా సహనానికి పరీక్ష పెట్టాడనిపిస్తుంది. కథలో ఎయోషనల్ పాయింట్స్ దట్టించి ఉంటే తొలిప్రేమ లాంటి విజయం దక్కడానికి ఆస్కారం ఉండేది.

    లవర్ బాయ్‌గా సాయిధరమ్ తేజ్

    లవర్ బాయ్‌గా సాయిధరమ్ తేజ్

    ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్‌కు మాస్ హీరో ఫాలోయింగ్ ఉంది. కమర్షియల్ చిత్రాలు అంతగా సక్సెస్‌ను అందించకపోవడంతో కాస్త రూట్ మార్చి లవర్ బాయ్‌గా మారాడు. లవర్ బాయ్‌ తగినట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌లో కొంత మార్పు కనిపించినట్టయితే తేజ్ పాత్ర అదనపు ఆకర్షణగా మారేది. ఎప్పటిలానే హ్యుమర్, ఫన్, ఎమోషనల్ అంశాలతో ఆకట్టుకొన్నాడు. కథలో, సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల తేజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడనిపిస్తుంది. అంతేకాకుండా ఫిజిక్‌ పరంగా కొంత లావైనట్టు తెర మీద స్పష్టంగా కనిపించింది.

    అనుపమ గ్లామర్.. ఫెర్ఫార్మెన్స్

    అనుపమ గ్లామర్.. ఫెర్ఫార్మెన్స్

    అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ తారనే కాకుండా ఫెర్ఫార్మర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నందిని పాత్రలోని పలు రకాల షేడ్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకొన్నది. వాస్తవానికి నందిని పాత్ర లాజిక్కులకు దూరంగా ఉండటం వల్ల ప్రేక్షకులకు చేరువ కావడం కష్టమైందని చెప్పవచ్చు. తన పాత్ర పరిధి మేరకు అనుపమ ఫర్వాలేదనిపించింది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    తేజ్.. ఐ లవ్ యు చిత్రంలో భారీగానే నటీనటులు ఉన్నారు. వైవా హర్ష, జోష్ రవి హీరో ఫ్రెండ్స్‌గా కనిపిస్తారు. వైవా హర్ష యాక్టింగ్ కాస్త ఓవర్ అయినట్టు కనిపిస్తుంది. తేజ్ కుటుంబ సభ్యులుగా జయప్రకాశ్, పవిత్రా లోకేష్, సురేఖ వాణి, పృథ్వీ నటించారు.

    సురేఖవాణి, పృథ్వీ కామెడీ

    సురేఖవాణి, పృథ్వీ కామెడీ

    పృథ్వీ, సురేఖవాణి కామెడీ పండించేందుకు ప్రయత్నించారు. జయప్రకాశ్, పవిత్ర లోకేష్ యాక్టింగ్ ఒకే. ఈ చిత్రంలో చాలా క్యారెక్టర్లు ఉన్నప్పటికీ.. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా బలంగా కనిపించదు. పాత్రధారులు, కామెడీ ఆకట్టుకొనేలా లేకపోవడం కొంత మైనస్ అనిచెప్పవచ్చు.

    గోపి సందర్ సంగీతం

    గోపి సందర్ సంగీతం

    తేజ్ ఐ లవ్ యు చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించారు. ‘చందమామ' పాట తప్పితే పెద్దగా ఆకట్టుకునే పాటలు లేకపోవడం ప్రధాన లోపం. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీకి కావాల్సిన సాంగ్స్ లేకపోవడం నిరాశే. కాకపోతే సెకండాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్‌ను కలిగిస్తుంది.

    ఆండ్రూ సినిమాటోగ్రఫీ

    ఆండ్రూ సినిమాటోగ్రఫీ

    ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ కొంతలో కొంత ఉపశమనం కలిగే అంశంగా మారింది. పల్లెటూరు వాతావరణం, అర్భన్ లుక్‌‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ సహకారంతో తెర మీద ఫ్యామిలీ వాతావరణాన్ని హోమ్లీ మలిచాడని చెప్పవచ్చు. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్‌కు ఇంకా కొంత పని మిగిలే ఉందని చెప్పవచ్చు. ఇంకా కొన్ని సీన్లకు కత్తెర పదను చూపించాల్సిన అవసరం ఉంది.

    కథ, రచనా సహకారం

    కథ, రచనా సహకారం

    ఈ చిత్రానికి డార్లింగ్ స్వామితో కలిసి కరుణాకరన్ రచనా సహకారం అందించారు. అక్కడక్కడ డైలాగ్స్ పేలాయి. కానీ ఫీల్ గుడ్ లవ్ స్టోరికి కావాల్సిన పూర్తిస్థాయి సరంజామా దట్టించలేదనే చెప్పవచ్చు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే మంచి ఫలితం దక్కడానికి స్కోప్ ఉండేది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించారు. 40 ఏళ్లలో ఆయన రూపొందించిన చిత్రాలు టాలీవుడ్‌లో అణిముత్యాలుగా నిలిచాయి. చిరంజీవితో రూపొందించిన చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అలాగే తేజ్ ఐ లవ్ యూ విషయానికి వస్తే నిర్మాణ విలువలకు ఏ మాత్రం కొదువలేదు. సాంకేతిక నిపుణుల, నటీనటుల ఎంపిక సూపర్‌గా ఉంది. కానీ కథే నాసిరకంగా ఉండటమనేది కొట్టొచ్చినట్టు కనిపించే అంశం.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    తేజ్ ఐ లవ్ యు ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ లవ్ స్టోరి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలే ప్రధాన కారణం. కరుణాకరన్ సినిమాలు సాధారణంగా చాలా నెమ్మదిగా ప్రేక్షకులకు ఎక్కిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలాంటి విషయమే మళ్లీ జరిగితే తేజ్ ఐ లవ్ యు మరోసారి మ్యాజిక్ చేయవచ్చు. వారాంతంలో ఎలాంటి అనుమానాలు లేకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా చూసే క్లీన్ చిత్రమని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణను బట్టే ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్
    సినిమాటోగ్రఫీ
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    నెగిటివ్ పాయింట్స్
    పేలవమైన కథ, డైరెక్షన్
    భావోద్వేగాలు పండించే అంశాలు లేకపోవడం
    మ్యూజిక్
    కామెడీ

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్ర లోకేష్, సురేఖ వాణి, పృథ్వీ తదితరులు
    దర్శకత్వం: కరుణాకరన్
    రచనా సహకారం: కరుణాకరన్, డార్లింగ్ సామి
    నిర్మాత: కేఎస్ రామారావు
    సంగీతం: గోపి సుందర్
    సినిమాటోగ్రఫీ: ఐ అండ్రూ
    ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్
    బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
    రిలీజ్ డేట్: జూలై 6, 2018

    English summary
    Supreme Hero Sai Dharam Tej's latest film with Anupama Parameswaran as heroine is 'Tej' with caption 'I Love U'. A.Karunakaran is Directing this film while Creative Producer K.S.Rama Rao, Vallabha are bankrolling this film under Creative Commercials Movie Makers. 'Tej' is another romantic entertainer from Director A.Karunakaran who earlier delivered Superhit Romantic Movies like 'Tholi Prema', 'Ullasamga Utsahamga', 'Darling'. 'Tej I Love U' is being made as a breezy love story which is filled with feel good moments throughout the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X