twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిణుకుమన్న...( "మిణుగురులు" రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5
    తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు.. తక్కువే...అంత డబ్బు ఖర్చు పెట్టి వెనక్కి వస్తాయో లేదో తెలియని చిత్రాలు చేయటమెందుకని ధైర్యం చేయరు. అయితే అక్కడక్కడా మిణుకుమంటున్నట్లుగా మేం ఉన్నాం అంటూ "మిణుగురులు" లాంటి చిత్రాలు వస్తున్నాయి. కమర్షియల్ కోణంలో కాకుండా ఓ మంచి చిత్రంగా,ఆలోచనలు రేపే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం చూడదగినదే..అభినందించదగినదే. ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్టు ఎన్నుకున్న దర్శకుడు,రాసిన రచయిత,నటించిన పిల్లలు అంతా ధైర్యవంతులే...తెలుగు ప్రయోగాత్మక సినిమాకు మిణుగురులే.

    కథ విషయానికి వస్తే...సినిమా దర్శకుడవుదామను కలలు కనే ఒక టీనేజ్ కుర్రాడు రాజు (దీపక్ సరోజ్)కి ప్రమాదంలో కళ్ళు పోతాయి. రాజుని పెంచలేని తండ్రి ఒక అంధవిద్యార్థుల హాస్టల్ లో వేస్తాడు. హాస్టల్ వార్దన్ నారాయణ(ఆశిష్ విధ్యార్థి) దుర్మార్గంతో సతమతమౌతున్న విధ్యార్థుల సమస్యలు తీర్చడానికి రాజు సినిమాని ఆయుధంగా ఎలా ఎంచుకున్నాడు. కలెక్టర్ కిరణ్మయి (సుహాసిని) సహాయంతో చివరకు వాళ్ళ సమస్య ఎలా తీరింది అనేది తెరమీద చూడాల్సిన సినిమా.

    Telugu Movie Minugurulu Review

    సినిమాని చూడలేని అంధులు సినిమా తీస్తే ఈ ఐడియా లెవెల్ లోనే రచయిత పూర్తి మార్కులు కొట్టేస్తాడు. ఒక అంధవిద్యార్థుల హాస్టల్లో జరుగుతున్న అన్యాయాల్ని పిల్లలు సమిష్టిగా ఎదుర్కొన్ని సాహసోపేతమైన కథకు, కళ్ళుకనిపించని పిల్లలు ఒక సినిమా తియ్యడం ద్వారా ఈ సమస్యను ఎలా అధిగమించారనే ట్రీంట్మెంటును జతచేసి విన్నూత్నంగా చేసిన ప్రయోజనాతనక ప్రయోగం ఇది. అంధవిధ్యార్థులు అనగానే ఇదేదో ఆర్టు ఫిల్మ్ తరహా సినిమా అనుకుంటే పొరబాటే. సినిమా కథనంలోని మలుపులు, ఎడిటింగ్ లోని వేగం, నటీనటుల సహజనటన కలిసి ఒక కమర్షియల్ సినిమా గ్రామర్ని ఆర్టు సినిమా విషయానికి అధ్ధినట్టు ఉండే జనరంజకమైన చిత్రం ఇది.

    సుహాసిని మణిరత్న, ఆశిష్ విద్యార్థి,రఘువీర్ యాదవ్ లాంటి సీనియర్ నటీనటులతోపాటూ దీపక్ సరోజ్, సాయ్ తేజ వంటి టీనేజ్ నటులు నటించిన ఈ చిత్రంలో అందరి నటనా ఆకట్టుకుంటుంది. జోశ్యభట్ల శర్మ సంగీతం వినసొంపుగా ఉంటూనే సినిమా గమనానికి తోడ్పడుతుంది. అమెరికన్ సినెమాటోగ్రఫర్ డేవిడ్ ఫుల్లర్ సినెమాటోగ్రఫీ సినిమాకు సహజత్వాన్ని తెచ్చిపెట్టింది. కిరణ్ గంటి ఎడిటింగ్ సినిమాకు వేగాన్ని అందించింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది వి.బి,ఎన్.చౌదరి అందించిన విభిన్నమైన కథ దానికి కథనం సమకూర్చిన కత్తి మహేష్, అయోధ్యకుమార్ ల కృషి. తెలుగులో ఒక విభిన్నమైన సినిమాని తీసిన దర్శకనిర్మాత అయోధ్యకుమార్ ని ప్రోత్సహిస్తే మరిన్ని ఇలాంటి ప్రయోజనాత్మకమైన ప్రయోగాలు జరిగే అవకాసం ఉంది.

    రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా ఓ విభిన్నమైన చిత్రంగా దీన్ని చూస్తే నచ్చుతుంది. అలాగే విభిన్నమైన చిత్రాలు చూసే ప్రేక్షకులుకు ఇది విందు భోజనమే. అయితే ఇలాంటి సినిమాలకు తెలుగులో ఆదరణ తక్కువగా ఉంటూ వస్తోంది. మరి ఈ చిత్రం ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

    బ్యానర్ :రెస్పెక్ట్ క్రియేషన్స్
    సమర్పణ: దాసరి నారాయణరావు
    నటీనటులు :దీపక్ సరోజ్, సుహాసిని మణిరత్నం, అశిష్ విద్యార్థి, సాయి తేజ
    సినెమాటోగ్రఫి :డేవిడ్ ఫుల్లర్
    ఎడిటింగ్ :కిరణ్ గంటి
    సంగీతం: జోశ్యభట్ల శర్మ
    కథ :ఎన్.వి.బి.చౌదరి
    రచన :ఎన్.వి.బి.చౌదరి-కత్తి మహేష్-అయొధ్యకుమార్
    నిర్మాత-దర్శకుడు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి

    English summary
    Telugu Movie Minugurulu relesed today.A film featuring 40 visually impaired children, 'Minugurulu' is the story of how these children expose the wrongdoings of the warden of an orphanage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X