For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జీవన 'వేదం' (రివ్యూ)

  By Srikanya
  |
  Vedam
  Rating
  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  చిత్రం: వేదం
  బ్యానర్: ఆర్కా మీడియా వర్క్స్
  నటీనటులు: అల్లు అర్జున్, మంచు మనోజ్, అనూష్క, నాగయ్య, మనోజ్ బాజపేయి,
  దీక్షాసేధ్, లేఖా వాషింగ్ టన్, సియా, సత్యం రాజేష్, పోసాని, క్రిష్(గెస్ట్) తదితరులు.
  సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి
  కెమెరా: వి.యస్ జ్ఞాన శేఖర్
  ఎడిటింగ్: శర్వన్
  ఫైట్స్: రామ్-లక్ష్మణ్
  ఆర్ట్: రాజీవ్ నాయర్
  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాధాకృష్ణ(క్రిష్)
  నిర్మాత: ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ
  విడుదల తేది:4 జూన్,2010

  జీవితాన్ని ఉన్నదున్నట్లుగా దగ్గరగా చూస్తే కొన్ని సార్లు గొప్పగా, మరికొన్ని సార్లు సాదాసీదాగా, చాలా సార్లు బోర్ గా కనపడటం కామన్. అదే 'గమ్యం'తో అవార్డులు, అవకాశాలు పొందిన క్రిష్ తాజా చిత్రం 'వేదం'కీ జరిగింది. సమాజంలో నిత్యం కనిపించే కొన్ని సామాన్య పాత్రలు ఎంపిక చేసుకుని వాటి లక్ష్యాలు, భయాలు, అనుమానాలు ఏ మొహమాటం లేకుండా తెరకెక్కించిన ఈ చిత్రం ఓ వర్గానికి బాగా నచ్చితే మరికొందరికి మామూలుగా అనిపిస్తుంది. అయితే సినిమా ఎలా ఉన్నా అల్లు అర్జున్ లాంటి స్టార్ ఇలాంటి మామూలు మనిషి పాత్రలకు ఒప్పుకోవటం ఆహ్వానించదగ్గ శుభపరిణామం.

  స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.

  ఐదు కథలు..ఒక క్లైమాక్స్ స్క్రీన్ ప్లే స్కీమ్ తో ఆస్కార్ చిత్రం క్రాష్ ని అనుకరిస్తూ వచ్చిన వేదం వాస్తవంగా చెప్పాలంటే గమ్యం అంత గొప్పగా ఉండదు. అయితే మూస కొట్టుడుగా అదే కథని తిప్పి తిప్పి చెబుతున్న తెలుగు పరిశ్రమకు మాత్రం ఓ మంచి ప్రయోగమే. ఇక అల్లు అర్జున్ నటించడానగానే చూడ్డానికి వచ్చే అభిమానులుకు హీరోయిజం లేని అతని క్యారెక్టర్ ఎక్కకపోవచ్చు. అయితే కథలో ఒకడుగా ఇమిడిపోయిన అతన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం. అలాగే టెర్రరిజం కేవలం క్లైమాక్స్ కోసం ఎత్తుకోవటం విసుగొస్తుంది. అలాగే హిందువులను ఏదో ఒకటి అంటే గాని సినిమా హిట్టుకాదు అని నిర్ణయానికి వచ్చి కొన్ని సన్నివేశాలు తీసారా అన్నట్లు అనుమానం వస్తుంది. వేశ్యగా అనూష్క అదరకొట్టింది...అవార్డులు వస్తాయేమో చూడాలి.అయితే ఆమె వేశ్యా వృత్తి మానయ్యటానకి రీజన్ ఏంటో అర్ధం కాదు. ఇక మనోజ్ క్యారెక్టర్ కథకి గానీ, అతనికి గానీ ఉపయోగపడేటట్లు లేదు. ఇక కిడ్నీలు అమ్ముకునే సీన్స్ ద్వారా మన దేశ పరిస్ధితి ఇదని చెప్పదల్చుకున్నారో ...మరేమిటో దర్శకుడే తేల్చాలి.

  ఇక దర్శకుడుగా క్రిష్ కొన్ని చోట్ల మంచి మార్కులే వేయించుకుంటాడు. అలాగే కెమెరా తెరపై సహజమైన వాతావరణం ఏర్పాటు చేసేలా పనిచేసింది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండే బాగుండేది. కీరవాణి పాటలు రాసి సంగీతం అందించిన ఈ చిత్రంలో రెండు పాటలు, ముఖ్యంగా అనూష్క పరిచయం చేసేటప్పుడు చదివిన తత్వం హైలెట్ గా నిలిచాయి.అల్లు అర్జున్ సరసన చేసిన దీక్షా సేధ్ మంచి భవిష్యత్ ఉండే వాతావరణం కనపడుతోంది. అలాగే క్రిష్ డైలాగ్ రైటర్ గా మంచి మార్కులే వేయించుకున్నాడు. అయితే కథా, కథన రచయితగా మరింత శ్రమించి ఉండాల్సింది.

  ఏదైమైనా ఓ కొత్త తరహా జెనర్ సినిమాగా ఈ చిత్రాన్ని చూసి రావచ్చు. అయితే రెగ్యులర్ గా అల్లు అర్జున్ సినిమాల్లో ఉండే డాన్స్ లు, ఫైట్స్ ఆశిస్తే మాత్రం నిరాశ ఎదురవుతుంది. అలాగే ఎ, మల్టిప్లెక్స్ వర్గానికి ఈ చిత్రం పట్టే అవకాసం ఉంది.దర్శక,నిర్మాతల టార్గెట్ కూడా అదే అయితే ఏ ఇబ్బందీ లేదు. అనూష్క ఉంది కాబట్టి మహిళలు కూడా ఓ లుక్కసే అవకాశం ఉంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X