Telusu Kada First Review: తెలుసు కదా మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం తెలుసు కదా. రొమాంటిక్, మ్యూజికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి డైరెక్టర్‌గా మారారు.

రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి రూపొందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలీ ఎడిటింగ్, ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ 2025 సంవత్సరం రోజున రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేశారు. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా రన్ టైమ్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

Telusu Kada Review by Censor Board

తెలుసు కదా సినిమా కథ విషయానికి వస్తే.. ఇద్దరి మధ్య జరిగే ప్రేమ కథ. లవ్ స్టోరీలో క్లిష్టమైన సమస్య ఉంటుంది. ఈ కథను క్యారెక్టర్లే నడిపిస్తాయి. ఇద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ అయినప్పటికీ.. మూడో వ్యక్తి పాత్ర ఏమిటనేది ఈ కథలో ట్విస్ట్. మొత్తంగా వినోదం, రొమాన్స్, కామెడీ అంశాలతో సాగే నిన్ను కోరి మూవీ లాంటి సినిమా. ప్రతీ క్యారెక్టర్ మధ్య ఎమోషనల్ కంటెంట్ ఉండేలా ఈ సినిమాను రూపొందించాం అని చిత్ర యూనిట్ చెప్పింది.

తెలుసు కదా సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మూవీలో కొన్ని మార్పులు, చేర్పులపై సలహా ఇచ్చారు. క్లీన్ కామెడీ, సెన్సిబుల్ రొమాన్స్ ఎలిమెంట్స్‌ను నీరజ కోన చక్కగా డీల్ చేశారనే విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ సినిమాలోని హర్ష కామెడీ, జొన్నలగడ్డ సిద్దూ డైలాగ్ టైమింగ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు వ్యక్తం చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక మూవీలోని అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత ఈ సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్‌కు రావడానికి వెసలుబాటు కలిగేలా చేసింది. ఈ సినిమా బ్యూటీవుల్ ఎంటర్‌టైనర్. బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమాను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసేలా రూపొందించాం అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.

రొమాంటిక్ లవ్ స్టోరీని సాగదీయకుండా ఎడిటర్ నవీన్ నూలీ తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమాను ప్రెష్‌గా, ల్యాగ్ లేకుండా 2 గంటల 16 నిమిషాల నిడివి అంటే.. 136 నిమిషాల రన్ టైమ్‌ను సెట్ చేశారు. దీపావళీ పండుగ కానుకగా రిలీజ అవుతున్న ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర విశేషాలు, వార్తల కోసం ఫిల్మీబీట్‌‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X