For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thank You Brother! రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, అర్చన అనంత్
  Director: రమేష్ రాపర్తి

  దర్శకత్వం: రమేష్ రాపర్తి
  నిర్మాత: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి
  మ్యూజిక్ డైరెక్టర్: గుణ బాలసుబ్రమణ్యం
  ఎడిటర్స్: ఉదయ్, వెంకట్
  సినిమాటోగ్రఫి: సురేష్ రగుతు
  బ్యానర్: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2021-05-07

  థ్యాంక్యూ బ్రదర్ కథ ఏమిటంటే..

  థ్యాంక్యూ బ్రదర్ కథ ఏమిటంటే..

  భర్త సూర్య (ఆదర్శ్ బాలకృష్ణ)ను కోల్పోయిన ప్రియ (అనసూయ) ప్రెగ్నెంట్. అనుకోని పరిస్థితుల్లో భర్త మరణించడంతో కుటుంబ భారమంతా తనపై పడుతుంది. అత్త (అన్నపూర్ణ)తో కలిసి టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంటుంది. భర్త కంపెనీ ఇచ్చే పరిహారం కోసం వెళ్లిన ప్రియా.. లిఫ్టులో అభి (విరాజ్ అశ్విన్) అనే యువకుడిని కలుస్తుంది. అభి అనేక అవలక్షణాలు ఉన్న యువకుడి ప్రవర్తనను కలిసిన మొదటిసారే అసహ్యించుకొంటుంది. అలాంటి వ్యక్తితో లిఫ్టులో ఇరుక్కుపోతుంది. ఆ పరిస్థితుల్లో ప్రియాకు పురిటి నొప్పులు మొదలవుతాయి.

  థ్యాంక్యూ బ్రదర్‌లో ట్విస్టులు

  థ్యాంక్యూ బ్రదర్‌లో ట్విస్టులు

  అల్లరి చిల్లరిగా తిరిగే అభి వల్ల తల్లిదండ్రులు భాను, ప్రేమ్ (అర్చన అనంత్, అనీష్ కురువిల్లా) ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తల్లిదండ్రులను విభేదించి వచ్చిన అభికి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రియ భర్త సూర్య ఏ పరిస్థితుల్లో మరణించాడు? ప్రమాద వశాత్తు లిఫ్టులో ఇరుక్కొన్న ప్రియాకు పురిటి నొప్పులతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది. లిఫ్టులో ప్రియ డెలివరీకి అభి ఎలాంటి సాహసం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే థ్యాంక్యూ బ్రదర్ సినిమా కథ.

  థ్యాంక్యూ బ్రదర్ అనాలిసిస్

  థ్యాంక్యూ బ్రదర్ అనాలిసిస్

  ఎలాంటి బాధ్యతలు తెలియని, అల్లరి చిల్లరిగా తిరిగే అభి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడంతో థ్యాంక్యూ బ్రదర్ సినిమా మొదలవుతుంది. అలాగే ప్రెగ్నెంట్ ప్రియ కష్టాలు, సమస్యలతో కథ సమాంతరంగా సాగుతుంది. ఎమోషనల్ సంఘటనలతోపాటు కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు రమేష్ చెప్పే కథ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ఒక సాదా సీదా పాయింట్‌ను బలమైన కథగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే ఫీలింగ్ కథనంతో స్పష్టమవుతుంది. ఇక సెకండాఫ్‌లో అభి క్యారెక్టర్‌ను పాజిటివ్‌గా మలిచిన తీరు, ప్రియ డెలివరీ అంశం సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చిందని చెప్పవచ్చు.

  దర్శకుడి ప్రతిభ గురించి

  దర్శకుడి ప్రతిభ గురించి

  ఎమోషనల్ పాయింట్‌తో సున్నితమైన పాయింట్‌ను చక్కగా, బలంగా చెప్పడంలో దర్శకుడు రమేష్ రాపర్తి తన మార్కును చాటారు. తొలి చిత్ర దర్శకుడైనప్పటికీ కథ, కథనాలను పరుగులు పెట్టించడంలో ఎలాంటి తడబాటు కనిపించదు. పరిమిత బడ్జెట్ కూడిన స్టోరి ఐడియాను ఎంచుకోవడమే దర్శకుడు సక్సెస్ చిరునామా అని చెప్పవచ్చు. చిన్న నటులు, కొత్త నటులతో ఫెర్ఫార్మెన్స్‌ను చక్కగా రాబట్టుకొన్నారని చెప్పవచ్చు. అనసూయ క్యారెక్టర్‌ను కొంచెం పెంచి ఉంటే కథలో మరింతగా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్ పెరిగి ఉండేవి. నిడివి కూడా సరిగ్గా సరిపోయి ఉండేదని అనిపిస్తుంది.

  అనసూయ భరద్వాజ్ పెర్ఫార్మెన్స్

  అనసూయ భరద్వాజ్ పెర్ఫార్మెన్స్

  ఇక ప్రియ పాత్రలో అనసూయ ఒదిగిపోయారు. భర్తతో కొన్ని సీన్లే ఉన్నప్పటికీ సినిమాకు అదనపు గ్లామర్‌ను పండించారు. కుటుంబ బాధ్యతను ఎత్తుకొనే మహిళగా, అత్త ప్రేమగా చూసుకొనే కోడలిగా పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక సెకండాఫ్‌లో లిఫ్టులో డెలీవరి సమయంలో సహజమైన నటనను ప్రదర్శించారు. మరోసారి తన ప్రతిభను చాటుకోవడానికి లభించిన పాత్రలో ఉత్తమ నటనతో ఆకట్టుకొన్నారు. గెస్ట్ రోల్ అయినప్పటికీ ఆదర్శ్ బాలకృష్ణ ఆకట్టుకొన్నారు.

  విరాజ్ అశ్విన్.. ఇతర నటీనటుల గురించి

  విరాజ్ అశ్విన్.. ఇతర నటీనటుల గురించి

  థ్యాంక్యూ బ్రదర్ చిత్రంలో ఆకట్టుకొనే మరో పాత్ర విరాజ్ అశ్విన్. బాడ్ బాయ్‌ క్యారెక్టర్‌తో మొదలై గుడ్ బాయ్‌గా మారేంత వరకు పలు రకాల ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించారు. సెకండాఫ్‌లో సినిమాను మరో లెవెల్‌కు చేరుకోవడానికి తన వంతు పాత్రను పోషించారు. ఇక అభి తల్లిదండ్రులుగా కార్తీకదీపం ఫేమ్ అర్చన అనంత్ భానుగా, ప్రేమ్ పాత్రలో అనీష్ కురువిల్లా తన పాత్రల మేరకు నటించినప్పటికీ.. కథకు కావాల్సిన ఎమోషనల్ కంటెంట్‌‌ను అందించారు. అన్నపూర్ణ, వైవా హర్ష ఒకే అనిపించారు.

  టెక్నికల్ విభాగాల పనితీరు...

  టెక్నికల్ విభాగాల పనితీరు...

  టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే... సంగీతాన్ని అందించిన గుణ బాలసుబ్రమణ్యం ముందుగా చెప్పుకోవాలి. సింపుల్‌గా ఉన్న సీన్లను కూడా తన రీరికార్డింగ్‌తో మరింత మెరుగుపరిచేలా చేశారు. ఎమోషనల్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి బాగుంది. కమర్షియల్ సీన్లను బాగా ఎలివేట్ చేశారు. అలాగే అనసూయ గ్లామర్‌ను, ఎమోషనల్ పాయింట్స్‌ను చక్కగా కెమెరాలో బంధించారు. లిఫ్టులో సీన్లను బాగా డీల్ చేశారు. భావోద్వేగమైన కథను అద్బుతంగా ప్రేక్షకులకు అందించడంలో మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి ఉన్నతమైన ప్రొడక్షన్ వాల్యూస్ పాటించారు.

  Balakrishna మద్యం బ్రాండ్ పై Naga Babu సెటైర్లు !
  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  చివరగా.. కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల అంటే పట్టించుకోని ఒ యువకుడు.. కుటుంబ కష్టాలను భుజాన వేసుకొని పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చే బాధ్యతయుతమైన మహిళ కథనే థ్యాంక్యూ బ్రదర్. యూత్‌కు నచ్చే కమర్షియల్ అంశాలతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యే భావోద్వేగమైన కథగా ఈ సినిమా రూపొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నివర్గాలను ఆకట్టుకొనే విధంగా తెరకెక్కిన ఫీల్‌గుడ్ చిత్రం అని చెప్పవచ్చు. నటీనటులు, సాంకేతిక విభాగాల పనితీరే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

  English summary
  Actor and Anchor Anasuya Bharadwaj's latest movie Thank You Brother. Anasuya Played pregnant lady in this Cinema. This movie hits on Aha OTT on May 7th of 2021. Viraj Ashwin, Mounika Reddy, Archana Ananth, Anish Kuruvilla are in the lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X