For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Toofaan movie review: భాగ్ మిల్కా భాగ్ హిస్టరీ రిపీట్ అయిందా? ఫర్హాన్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!

  |

  Rating:
  2.5/5
  Star Cast: ఫర్హాన్ అఖ్తర్, మృణాల్ థాకూర్, పరేష్ రావెల్, రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా, విజయ్ రాజ్
  Director: రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా

  భారతీయ సినిమా చరిత్రలో స్పోర్ట్స్ డ్రామాలు పుష్కలంగా వచ్చి విజయవంతం అయ్యాయి. క్రీడా నేపథ్యంతో ఇటీవల కాలంలో వచ్చిన భాగ్ మిల్కా భాగ్, దంగల్, సుల్తాన్ లాంటి సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అనుభూతిని పంచాయి. తాజాగా బాక్సింగ్ క్రీడా నేపథ్యంతో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్, దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం తుఫాన్. అయితే ఇప్పటి వరకు వచ్చిన స్పోర్ట్స్, ఎమోషనల్‌ డ్రామాగా వచ్చిన చిత్రాలకు విభిన్నంగా ఈ మూవీ ఉందా అనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం...

  తుఫాన్ కథ ఏమిటంటే..

  తుఫాన్ కథ ఏమిటంటే..

  అజ్జూ అలియాస్ అజీజ్ ఆలీ (ఫర్హాన్ అఖ్తర్) ఓ గ్యాంగ్‌స్టర్. అయితే ఓ కారణంగా బాక్సర్ కావాలని కోచ్ నానా ప్రభు (పరేశ్ రావెల్)ను కలుస్తాడు. అయితే అజ్జూపై గౌరవం లేని నానా ఆయన కోరికను తిరస్కరిస్తాడు. ఈ క్రమంలో డాక్టర్ అనన్య ప్రభుతో ప్రేమలో పడుతాడు. చివరకు నానా అభిమానాన్ని సంపాదించుకొని బాక్సింగ్‌లో శిక్షణ పొందుతాడు.

  తుఫాన్ కథలో ట్విస్టులు

  తుఫాన్ కథలో ట్విస్టులు

  గ్యాంగ్‌స్టర్‌ అయిన అజ్జూ భాయ్ బాక్సర్‌గా ఎందుకు మారుతాడు? బాక్సర్‌గా అనేక ఛాంపియన్‌గా ఎదిగిన అజీజ్ అలీపై ఐదేళ్ల బ్యాన్ ఎందుకు విధిస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదురించి అనన్యను ప్రేమ వివాహం చేసుకొంటాడు. ప్రెగ్నెంట్ అయిన అనన్య ఎలా మరణిస్తుంది? ప్రపంచంలోనే ఉత్తమ బాక్సర్‌గా అజీజ్‌ ఎదగాలన్న అనన్య కల నిజమైందా? ఐదేళ్ల గ్యాప్ తర్వాత వయసు మీరిన అజీజ్ ఛాంపియన్‌గా అవతరించాడా? అజీజ్ ఆలీ తుఫాన్ అనే పేరును సార్థకం ఎలా చేసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే తూఫాన్ సినిమా కథ.

  తుఫాన్ ఎలా ఉందంటే..

  తుఫాన్ ఎలా ఉందంటే..


  ఎదురులేని గ్యాంగ్‌స్టర్‌గా అజ్జూ జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఊహించని పరిణామంతో బాక్సర్‌గా మారాలనుకొనే పాయింట్‌తో అసలు కథలోకి వెళ్తుంది. బాక్సర్ ఎదిగే క్రమంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలతో సినిమా నిధానంగా సాగిపోతుంది. ఇక ప్రేమ వివాహం కారణంగా తన బాక్సింగ్ గురువుతో విభేదాలు రావడం, అలాగే నేషనల్ చాంఫియన్ అయ్యే క్రమంలో నిషేధపు వేటు పడటం కథలో ట్విస్టులుగా మారుతాయి.

  సాదాసీదా కథనంతో

  సాదాసీదా కథనంతో


  ఇక సెకాండాఫ్‌లో భార్య అనన్య పాండే అనూహ్య పరిస్థితుల్లో మరణించడంతో కథ ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే మరణానికి ముందు మళ్లీ బాక్సింగ్ ప్రొఫెషన్‌ను మళ్లీ ప్రారంభించమని అడుగుతుంది. తన భార్య కోరిక మేరకు మళ్లీ బాక్సింగ్ ప్రొఫెషన్ ప్రారంభించే అంశం సినిమాను రొటీన్‌గా మార్చుతుంది. కథ పరమ రొటీన్‌గా, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా సెకండాఫ్ సాగడంతో సాదాసీదా సినిమాను చూస్తన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. చివర్లో టాప్ బాక్సర్‌తో తలపడే పోరు కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండటం కొంత ఉపశమనంగా అనిపిస్తుంది.

  దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా

  దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా

  రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తుఫాన్ కథను నడిపించడంలో తడబాటుకు గురయ్యారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. సినిమాలో బలమైన సన్నివేశాలు, ట్విస్టులు లేకపోవడం కథ అతి సాధారణంగా అనిపిస్తుంది.

  ఫర్హాన్ అఖ్తర్ ఫెర్ఫార్మెన్స్

  ఫర్హాన్ అఖ్తర్ ఫెర్ఫార్మెన్స్

  తుఫాన్ లాంటి పేలవమైన స్క్రిప్టును కూడా ఫర్హాన్ అఖ్తర్ తన శక్తిమేరకు మరో రేంజ్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ఎమోషన్ సీన్లలో తన ప్రతిభకు పదునుపెట్టాడు. బాక్సింగ్‌ కోసం నటుడిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు మరింత ఆకట్టుకొంటుంది. ఇక అనన్య ప్రభు పాత్రలో ఫర్యాలేదనిపించింది. ఇక పరేష్ రావల్ నానా పాత్రలో ఒదిగిపోయాడు. కొంత మేరకు భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నాడు.

  టెక్నికల్ విభాగాల పనితీరు

  టెక్నికల్ విభాగాల పనితీరు

  ఇక సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని పాటలు ఎమోషనల్‌గా సాగుతాయి. కానీ సన్నివేశాలు బలంగా లేకపోవడంతో ఆ పాటలకు న్యాయం జరుగలేదనిపిస్తుంది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా బోలెడ్ పని ఉందని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ జయ్ ఓజా బాక్సింగ్ క్రీడకు సంబంధించిన సీన్లు బాగా చిత్రీకరించారు.

  తుఫాన్ తుది తీర్పు

  తుఫాన్ తుది తీర్పు


  ఓవరాల్‌గా తుఫాన్ చిత్రం గురించి చెప్పుకొంటే.. ఎలాంటి ఎమోషన్స్ పండని స్పోర్ట్స్ డ్రామాగా అభివర్ణించవచ్చు. కొత్తదనం ఆశించే ప్రేక్షకుల అంచనాలకు దిగువన ఈ చిత్రం ఉందని చెప్పవచ్చు. కథ, కథనాల పరంగా కొంత జాగ్రత్త పడి ఉంటే వెండి తెర మరో అద్బుతమైన స్పోర్ట్స్ డ్రామాగా తుఫాన్ మారే అవకాశం ఉండేది. క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలను ఆదరించే వారికి తుఫాన్ నచ్చవచ్చు. అయితే రాకేష్, ఫర్హాన్ కాంబినేషన్‌లో వచ్చిన భాగ్ మిల్కా భాగ్ రేంజ్‌లో లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించిందని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  ఫర్హాన్ అఖ్తర్ ఫెర్ఫార్మెన్స్
  బాక్సింగ్ సన్నివేశాల చిత్రీకరణ
  సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్
  డైరెక్షన్
  కథ, కథనాలు
  స్లో నేరేషన్

  Farhan Aktha - Definitely Will Act If The Opportunity Arises To Act In Tollywood | Filmibeat Telugu
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: ఫర్హాన్ అఖ్తర్, మృణాల్ థాకూర్, పరేష్ రావెల్, రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా, విజయ్ రాజ్, సుప్రియా పాఠక్ తదితరులు
  దర్శకత్వం: రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా
  నిర్మాతలు: రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్, రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా
  రచన: అంజుమ్ రాజబలి, విజయ్ మౌర్య
  సినిమాటోగ్రఫి: జయ్ ఓజా
  మ్యూజిక్: శంకర్ ఎహసాన్ లాయ్, డబ్ శర్మ, శామ్యూల్ ఆకాంక్ష, డేనియల్ లోజింక్సి
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఓటీటీ రిలీజ్ డేట్: 2021-07-16
  నిడివి: 161 నిమిషాలు

  English summary
  Bollywood actor Farhan Akthar's latest movie Toofaan which is directed by Rakeysh Omprakash Mehra. This movie is hit the OTT screen on July 16th. In this occassion, Filmibeat Telugu brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X