twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమ్మకం నిలబెట్టలేదు..(తుంగభద్ర మూవీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    హైదరాబాద్: ఈగ, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడక రామయ్య లాంటి హిట్ చిత్రాలను అందించిన నిర్మాత సాయి కొర్రపాటి తాజాగా తన వారాహి చలనచిత్రం బేనర్లో నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర'. వరుస హిట్ చిత్రాలు రావడంతో ఈ బేనర్‌పై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆ నమ్మకమే పలువురు సినీ ప్రియులను ‘తుంగభద్ర' థియేటర్ల వైపు నడిపించేలా చేసింది.

    శ్రీనివాస కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదిత్, డింపుల్, సత్యరాజ్‌, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, సప్తగిరి, రాజేశ్వరి నాయర్‌, ధన్‌రాజ్‌, నవీన్‌, రవివర్మ, చరణ్‌, శశాంక్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోసించారు. రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవల మధ్య ఓ చిన్న ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ‘తుంగభద్ర' సినిమా ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని మిగిల్చింది, సాయి కొర్రపాటి ప్రేక్షకులు తనపై పెట్టుకున్ననమ్మకాన్ని నిలబెట్టుకునప్నాడా? అనేది రివ్యూలో చూద్దాం..

    కథ విషయానికొస్తే..
    తాడికొండ నియోజకవర్గంలో రామరాజు(సత్యరాజ్), త్రిమూర్తుల(చలపతిరావు) వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పొలిటికల్ ఫ్యాక్షన్ గొడవల్లో రామరాజు చేతిలో త్రిమూర్తులు ప్రాణాలు కోల్పోతాడు. తన తండ్రిని చంపిన రామరాజును చంపి పగ తీర్చుకోవడానికి త్రిమూర్తులు కొడుకులు అదును చూసి దాడి చేస్తారు. ఈ దాడిలో అనుచరులు తమ ప్రాణాలు అడ్డువేసి రామరాజును కాపాడుతారు. చనిపోయిన అనుచరుల్లో ఒకడే హీరో శీను (హీరో అదిత్). తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి రామరాజు అనుచరుడిగా చేరిన శ్రీను....అతని నమ్మకాన్ని గెలచుకుంటాడు. రామరాజు తన నీడకంటే ఎక్కువగా శ్రీనును నమ్ముతాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా శ్రీను... రామరాజు కూతురు గౌరి(డింపుల్) ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసి రామరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు? శ్రీను ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది తర్వాతి కథ.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో....

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే....

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే....

    ముందుగా మనం చెప్పుకోవాలసింది సత్యరాజ్ గురించి. సినిమా మొత్తానకి ఆయన పెర్ఫార్మెన్సే హైలెట్. నాయకుడి పాత్రలో ఆయన అద్భుతమైన పెర్పార్మెన్స్ కనబరిచారు. కొత్త హీరో అదిత్ పెర్ఫార్మెన్స్ గొప్పగా ఏమీ లేక పోయినా ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ డింపుల్ ఓకే.

    సప్తగిరి ఫెయిల్

    సప్తగిరి ఫెయిల్

    పైడితల్లి పాట్రలో కోట శ్రీనివాస్ తన సహజనటనను కనబర్చాడు. జబర్దస్త్ శ్రీను, నవీన్, ధనరాజ్ ఉన్నంతలో అక్కడక్కడా కామెడీ పండించారు. స్టార్ కమెడియన్ సప్తగిరి పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు.

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

    ‘వారాహి చిలన చిత్రం' బ్యానర్ స్టాండర్ట్స్ తగిన విధంగా సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాలో హైలెట్ అయిన అంశాల్లో రాహుల్‌ శ్రీవాత్సవ్‌ సినిమాటోగ్రఫీ ఒకటి. హరిగౌర అందించిన సంగీతం కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది.

    సినిమా ఉద్దేశ్యం

    సినిమా ఉద్దేశ్యం

    ముందుగా సినిమా ఎలా ఉందనే విషయం కంటే....సినిమాను ఏ ఉద్దేశ్యంతో తీసారనే విషయం గురించి ఓ రెండు ముక్కలు మాట్లాడుకుందాం. ఎక్కడో పుట్టిన పార్టీల కోసం ఒకే ఊర్లో పుట్టిన వారు తన్నుచస్తున్నారు. ఈ అంశాన్ని ఎలివేట్ చేస్తూ సినిమాను ప్రధానంగా నడిపించారు. పగలు ప్రతీకారాల పర్వానికి ఒక మంచి నాయకుడు ఎలాంటి ముగింపు ఇచ్చాడు అనే అంశాన్ని హైలెట్ చేస్తూ....ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల్లో మార్పు తేవాలనే ఉద్దేశ్యంతో సినిమాను తెరకెక్కించారు.

    కథ

    కథ

    ఇక సినిమాలో ప్రధానంగా కనిపించన లోపం... కథ. ఇలాంటి తెలుగు తెరకు కొత్తేమీ కాదు.

    స్క్రీన్ ప్లే కూడా..

    స్క్రీన్ ప్లే కూడా..

    చెప్పుకోదగ్గ గొప్పగా ఏమీ లేదు. దర్శకుడు సినిమాలో ఫ్యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ చేయడంలో ఇటు ప్రేమకథను ఆసక్తికరంగా చూపడంలో రెండింటిలోనూ విఫలం అయ్యాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి తర్వాత జరిగేదేమిటో ముందే తెలిసి పోయిన తర్వాత ఆసక్తి ఏముంటుంది?. సప్తగిరి, ధనరాజ్, నవీన్ లాంటి కమెడియన్స్ ఉన్న వారిని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక పోయాడు.

    ఓవరాల్‌గా చెప్పాలంటే.....

    ఓవరాల్‌గా చెప్పాలంటే.....

    హీరో, దర్శకుడి గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేక పోయినా.... కేవలం ‘వారాహి చలన చిత్రం' ఇప్పటి వరకు అందించిన హిట్ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని వెళ్లారు. అయితే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టడంలో వారాహి చలన చిత్రం పూర్తి స్థాయిలో విఫలమైంది. వినోదం కోసం వెళ్లిన సినీ ప్రేమికులు తమకు కావాల్సింది దొరకక బిక్కమొహం వేసుకున్నారు.

    English summary
    Sai Korrapati has got a niche for the film making and is widely known for digging out the talents. After producing super hits like Eega, Legend and Oohalu Gusa Gusalade, he is bringing out a promising film, Tungabhadra with the new comers. Let us see how far it managed to keep up the image of Vaaraahi Chalanachithra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X