»   » నాలుగు జీవితాలూ - ఒక తపన ఉడ్తా పంజాబ్ (రివ్యూ)

నాలుగు జీవితాలూ - ఒక తపన ఉడ్తా పంజాబ్ (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ ప్రపంచం మొత్తం లో ఉన్న సమస్య... మాఫియా లాగా ఇదీ యూనివర్సల్ సబ్జెక్ట్ కానీ అనుకున్నట్టు గా తెరకెక్కించాలంటే లీగల్ గా కూడా సమస్యలని ఎదుర్కోక తప్పదు. నటీనటులతోనూ, టెక్నీషియన్ల తోనూ దర్శకుడు నిరంతరం ప్రతీసీన్ నీ ఒక యుద్దం లా అనుకుని పని చేయాలి..అదే సాహసం చేసాడు అభిషేక్ చౌబే... పాక్ తరహా ముస్లిం దేశాలనుంచి వచ్చే డ్రగ్స్ మాఫియా మొదటి టార్గెట్ అయిన పంజాబ్ లోని చీకటి కోణాల మీద సెర్చ్ లైట్ వేసాడు... అనుకున్నట్టే సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు... చిట్ట చివరికి థియేటర్ లోకి వచ్చింది "ఉడ్తా పంజాబ్" మరి ఈ సినిమా ఎంత వరకూ విశయాన్ని చేరుకుందీ అంటే....

కథ ఏంటి?
నలుగురు మనుషులూ...నాలుగు కథలూ కలిస్తే "ఉడ్తా పంజాబ్" నిజానికి ఒకరికీ ఒకరికీ ఏ సంబందమూ లేదు... ఎవరికి వారుగా ఉన్న వీళ్ళ జీవితాలలో చోటు చేసుకున్న సంఘటనలే ఈ సినిమా...

            పంజాబ్ యూత్ యూత్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న పాప్ సింగర్ టామీ(షాహిద్ కపూర్) డ్రగ్స్ కి బానిస అయిపోతాడు చివరికి ఆ మత్తులో ఉంటే తప్ప పాట పాడ లేని స్థికి చేరుకుంటాడు. ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన పింకీ (ఆలియా భట్), అనుకోని పరిస్థితుల్లో బీహార్ నుంచి పంజాబ్ కు కూలీగా వలసవెళ్లి మాదకద్రవ్యాల వలలో పడిపోతుంది. డ్రగ్స్ మాఫియా నుంచి లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ సర్తాజ్(దిల్జిత్).. చివరికి ఆ డ్రగ్స్ వల్లే తన సోదరుణ్ణి కోల్పోతాడు.

Udta Punjab movie review

డాక్టర్ ప్రీత్ (కరీనా కపూర్) డ్రగ్స్ బారినపడి సర్వం కోల్పోయి రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో చేరిన వారికి సపర్యలు చేస్తూ, మాదకద్రవ్యాల సరఫరాపై తనదైన శైలిలో పోరాడుతుంది. వీరి జీవితాల్లోని ప్రతి అంకం డ్రగ్స్ తో ముడిపడి ఉన్నదే. డ్రగ్స్ మత్తులో చిక్కుకున్న టామీ సింగ్, అదే మాదకద్రవ్యాల కారణం గా చిక్కుల్లో పడ్డ పింకీ తమ ని తాము ఉన్న పరిస్తితుల్లోంచి బయట పడేసుకుంటారా? సర్తాజ్ లాంటి అవినీతి పోలీస్ ఆఫీసర్ తన లాంతి వారి వల్ల ఈ దేశం ఎంత నష్ట పోయిందీ అన్న విశయాని గ్రహించాడా? మాదక ద్రవ్యల వలలో ఉన్న అమాయకులని రక్షించాలన్న డాక్టర్ ప్రీత్ ప్రయత్నం ఎంత వరకూ ఫలించిందీ.... అన్న విశయాలు తెలియాలీ అంటేసినిమా చూడాల్సిందే...

ఎలా తీశారు?
మాఫియా, డ్రగ్స్, యుద్దం... ఇలాంటి సినిమాలకి ప్రాణం రియలిస్టిక్ గా ఉండే వాతావరణం. ఏమాత్రం సినిమాటిక్ గా అనిపించకూడాదు. ప్రతీ పాత్రా అసలు వ్యక్తేమో అన్నంత గా లీనమైపోవాలి... ఒక్క మాటలో రెగ్యులర్ మూవీ లా ఉండకూడదు. తాను చూసిన మిగతా సినిమాలకూ ఈ సినిమాకూ ఉన్న తేడా 10 నిమిషాల లోపే ప్రేక్షకుడికి అర్థమైపోవాలి... ఖచ్చితంగా అక్కడే కాన్సంట్రేట్ చేసాడు దర్శకుడుఅభిషేక్ చౌబే. సుదీప్ శర్మ రాసిన స్క్రిప్త్ కి ఏమాత్రం తగ్గకుండా తన ఊహల్లోని మనుషులనూ...సంఘటనలనూ తెర మీదికి దింపాడు.

'ఉడ్తా పంజాబ్' రెగ్యులర్ మూవీ కాదనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమా మొత్తాన్ని డాక్యుమెంటరీలా తీశాడు. అయితే ఎంచుకున్న విషయం కాంటెంపరరీ సమస్య కావడంతో సీన్లన్నీ రియలిస్టిక్ గా, వాస్తవ ప్రతిబింబాలుగా కనిపిస్తాయి.వాటి ఎఫెక్ట్ ఎంత ఉందో ఈ సినిమా విశయం లో రేగిన వివాదాలే నిదర్శనం.

Udta Punjab movie review

నటీనటులు అందరిలోకి ఆలియా భట్ అద్భుతంగా అమరింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పింకీ పాత్రలో ఆమె నటనను మెచ్చుకోనివారుండరు. రాక్ స్టార్ గా, డ్రగ్స్ బానిసగా షాహిద్ సైతం అదరగొట్టినా ఎక్కువ మార్కులు పడేది ఆలియాకే. దల్జిత్, కరీనాలు పాత్రల్లో జీవించారు.

సబ్ టైటిల్స్ లేకపోతే సినిమా సగం పంజాబీ లోనే నడుస్తున్నట్టుగా ఉంటుంది. మన దేశం లో నిజంగా నే ఫ్యామిలీతో కలిసి చూడలేం.., మరీ ఎక్కువ బూతులతో ఉన్న డైలాగులవల్ల... అయితే నిజానికి మన సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు అవన్నీ అక్కడ మరీ బూతుల్లా అనిపించవు... నిజంగా ఒక డ్రగ్ ఎడిక్ట్ అలా కాకుంటే ఎలా మాట్లాడతాడు? అలాంటి ప్రాంతాలను ఇంకెలా చూపిస్తాం? ఆ విషయం అర్థమైతే సెన్సార్ బోర్డు చర్య ఎంత మాత్రమూ సబబు అనిపించదు... మొత్తానికి ఉడ్తా పంజాబ్ నిజంగానే ఒక ఆజాద్ పంచీ ఆశని గురించి చెప్పే కథ.... యూనిట్ మొత్తం మరో అద్బుతాన్ని మనకిచ్చారనే అనుకోవాలి...

టైటిల్: ఉడ్తా పంజాబ్
జానర్: క్రైమ్ థ్రిల్లర్
డైరెక్టర్: అభిషేక్ చౌబే
ప్రొడ్యూసర్: శోభా కపూర్, ఏక్తా కపూర్, అనురాగ్ కాశ్యప్
డైలాగ్స్: సందీప్ శర్మ
స్క్రీన్ ప్లే: సందీప్ శర్మ, అభిషేక్ చౌబే
నటీనటులు: షాహిద్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, దల్జీత్ దోసాంగ్ తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రవర్కార్
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
నిడివి: 2గంటల 19 నిమిషాలు
విడుదల: జూన్ 17, 2016

English summary
Udta Punjab might not be a perfect film, but it is an important film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu