For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, టీఎన్నాఆర్
  Director: వెంకటేష్ మహా

  టాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్ చిత్రాల హవా ఇటీవల కాలంలో స్పష్టంగా కనిపిస్తున్నది. బడ్జెట్ కంటే విభిన్నమైన కథ, కథనాలు, పాత్రలు గతేడాది పలు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈ చిత్రానికి కేరాఫ్ కంచరపాలెం సినిమాను అందించిన వెంకటేష్ మహా దర్శకుడు. తొలి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రేక్షకుల్లో ఆసక్తిని, అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో జూలై 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం ఎలా ఉందంటే..

  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కథ ఏమిటంటే

  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కథ ఏమిటంటే

  అరకు గ్రామంలోని ఫోటోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్ (సత్యదేవ్), ఎముకలు విరిగితే కట్లుకట్టే నాటు వైద్యు బాబ్జీ (నరేష్), గ్రామ పంచాయితీ మెంబర్ నాంచారయ్య (టీఎన్ఆర్) లాంటి వ్యక్తులు కలిసి మెలిసి జీవిస్తుంటారు. చిన్నప్పటి స్నేహితురాలు స్వాతి (హరి చందన కొప్పిశెట్టి)తో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల స్వాతి మరొకరిని పెళ్లి చేసుకొంటుంది. ఆ క్రమంలో ఓ గొడవలో జోగినాథ్ (రవీంద్ర విజయ్) అనే వీధి రౌడీ చేతిలో ఉమామహేశ్వర్ చావుదెబ్బలు తింటాడు. ఆ అవమానంతో మళ్లీ జోగినాథ్‌ను చితక కొట్టేవరకు చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ తర్వాత జోగినాథ్ చెల్లెలు జ్యోతి (రూప)తో ప్రేమలో పడుతాడు.

  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కథలో ట్విస్టులు

  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కథలో ట్విస్టులు

  స్వాతితో ఉమామహేశ్వర్ రావు ప్రేమ ఎందుకు విఫలమైంది? జోగినాథ్ చేతిలో చావుదెబ్బలు తిన్న ఉమామహేశ్వర్ చివరకు ప్రతీకారం తీర్చుకొన్నారా? జోగినాథ్ చెల్లెలు ప్రేమలో పడిన ఉమామహేశ్వర్‌కు ఏమైనా అడ్డంకులు ఎదరయ్యాయా? ఈ కథలో బాబ్జీ, నాంచారయ్య, సుహాస్ పాత్రలు ఎంత వరకు ఉపయోగపడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్ర కథ.

  మూవీ అనాలిసిస్

  మూవీ అనాలిసిస్

  కేరాఫ్ కంచరపాలెం మాదిరిగానే గ్రామంలో ఉండే బంధాలు, అనుబంధాలను మరోసారి గుర్తు చేసేలా సినిమాను రూపొందించారు దర్శకుడు వెంకటేష్ మహా. చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల కథగా సాగదీసినట్టు చెప్పడం ఈ సినిమాకు మైనస్. కాకపోతే కథలో భావోద్వేగమైన అంశాలు ఉండటం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. కథ కంటే తెర మీద కథనమే ఆకట్టుకొనేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు హృదయాన్ని తట్టిలేపితే.. మరికొన్ని సన్నివేశాలు పేలవంగా ప్రేక్షకుడిని అసహనానికి గురిచేస్తాయి. ఓవరాల్‌గా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ సినిమా. కాకపోతే సినిమా నిడివి, అనవసరమైన సన్నివేశాలు ఆ ఫ్యాక్టర్‌ను మింగేసిందని చెప్పవచ్చు. కేరాఫ్ కంచరపాలెం క్లైమాక్స్‌లో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో లేకపోవడం కొంత నిరాశను కలిగిస్తుంది.

  సత్యదేవ్ ఇతర నటీనటులు గురించి

  సత్యదేవ్ ఇతర నటీనటులు గురించి

  ఇక నటీనటులు ప్రతిభ గురించి చెప్పాల్సి వస్తే, సత్యదేవ్ గొప్ప పెర్ఫార్మర్ అనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. పలు రకాల ఎమోషన్స్‌ ఉన్న పాత్రను సత్యదేవ్ అవలీలగా పోషించారనేది ఆయనను తెర మీద చూస్తే స్పష్టమవుతుంది. తండ్రి పాత్రతో కలిసి నటించిన సన్నివేశాల్లో సత్యదేవ్ నటన హైలెట్. ఇక వీకే నరేష్ బాబ్జి పాత్రలో ఆకట్టుకొన్నారు. తండ్రిగా, శ్రేయోభిలాషిగా, వైద్యుడిగా పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో నరేష్ జీవించాడనే చెప్పవచ్చు. ఇక నటుడిగా టీఎన్నాఆర్‌లో కొత్త కోణం కనిపిస్తుంది. గతంలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కనిపించిన టీఎన్నాఆర్‌కు సరైన పాత్ర లభించింది. సుహాస్ కామెడీ, ఎమోషన్స్ కలిసి ఉన్న పాత్రలో మెప్పించాడు. నరేష్‌తో కలిసి ఉన్న సీన్‌‌లోని నటన సుహాస్‌ను గుర్తుంచుకునేలా చేస్తుంది.

  హీరోయిన్లు ఫెర్ఫార్మెన్స్

  హీరోయిన్లు ఫెర్ఫార్మెన్స్

  ఇక హీరోయిన్లలో స్వాతిగా హరి చందన, జ్యోతిగా రూప తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు. గ్లామర్‌కు దూరంగా ఉంటే స్వాతి పాత్రలో హరి చందన కనిపిస్తే. గ్లామరస్‌తో కమర్షియల్ విలువలకు స్కోప్ ఉన్న జ్యోతి పాత్రలో రూప కనిపించింది. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సన్నివేశాల్లో ఇద్దరు కూడా బాగా నటించారు. కథంతా ఉమామహేశ్వర్ పాత్ర చుట్టు తిరగడంతో ఈ ఇద్దరి పాత్రల నిడివికి కాస్త అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు. కాస్త జ్యోతి పాత్రకు బెటర్ ప్లేస్‌మెంట్ లభించదని చెప్పవచ్చు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అప్పు ప్రభాకర్ ప్రకృతి అందాలను చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. కాంక్రిటీ జంగిల్‌లో జీవించే వారికి కంటికి పల్లె అందాలు తెర మీద అందాలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. సంగీతం కూడా ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. ‘నింగి చుట్టే' పాట మళ్లీ మళ్లీ వినాలనే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ బిజిబల్ స్వరపరిచారు. ఎడిటింగ్‌ విషయంలో రవిరాజ గిరిరాజాకు ఇంకా చేతినిండా పని ఉందనిపిస్తుంది. సౌండ్ డిజైనింగ్ విభాగం గురించి ప్రేక్షకులకు అంతగా అవగాహన లేకపోయినా నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైనింగ్ పనితీరు బాగుంది.

  ఓవరాల్‌గా

  ఓవరాల్‌గా

  గ్రామీణ మట్టివాసన, ఆచార వ్యవహారాలను రుచిచూపిస్తూ, వాస్తవికత ఉట్టిపడేలా రూపొందిన చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. నటీనటుల ప్రతిభ ఈ సినిమాకు బలమైతే, క్లైమాక్స్ చప్పగా, నీరసంగా సాదాసీదాగా ఉండటం ఈ సినిమాకు బలహీనతగా మారిందని చెప్పవచ్చు. ఎలాగూ థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన బాధ లేదు కాబట్టి.. ఇంట్లో తీరికగా.. మనసు ప్రశాంతంగా ఉంటే ఈ సినిమాను వదలకుండా తప్పకుండా చూడాలి. ఎందుకంటే కొన్ని విలువలు మనసులో దాచుకోవడానికి ఉపయోగపడుతాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • యాక్టర్ల పెర్ఫార్మెన్స్
  • సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఇతర అన్ని సాంకేతిక అంశాలు
  • సినిమా బ్యాక్‌డ్రాప్
  • మైనస్ పాయింట్స్

   • కథ, కథనాలు
   • స్లో నేరేషన్
   • Recommended Video

    Satya Dev Launches Kanabadutaledu Movie First Look
    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, సుహాస్, జబర్దస్త్ రాంప్రసాద్, టీఎన్నాఆర్, రవీంద్ర విజయ్ తదితరులు
    రచన, దర్శకత్వం: వెంకటేష్ మహా
    నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
    సినిమాటోగ్రఫి: అప్పు ప్రభాకర్
    సంగీతం: బిజిబల్
    ఎడిటింగ్: రవితేజ గిరిజాల
    సౌండ్ డిజైనింగ్: నాగార్జున తాళ్లపల్లి
    ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
    రిలీజ్ డేట్: 2020-07-30

  English summary
  Uma Maheswara Ugra Roopasya Movie Review: C/o Kanchera Palem movie fame Venkatesh Maha's latest movie is Uma Maheswara Ugra Roopasya. Produced by Vijaya Praveena ParuchuriShobu Yarlagadda, Prasad Devineni. Starring by Satyadev Kancharana, Hari Chandana, Roopa Koduvayur, Naresh, Suhas, Jabardasth Ramprasad, TNR etc. This movie released on Netflix on July 30th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X