twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Valliddari Madhya Review ఢిఫరెంట్ పాయింట్‌తో లవ్ స్టోరి.. లోపం ఎక్కడంటే?

    |

    Rating: 2.5/5

    విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్, నిహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది, సుప్రజ, కృష్ణ కాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు
    నిర్మాత: అర్జున్ దాస్యన్
    కథ, దర్శకత్వం: వీఎన్ ఆదిత్య
    స్క్రీన్ ప్లే: సత్యానంద్
    మాటలు: వెంకట్ డి పతి
    సంగీతం: మధు స్రవంతి
    పాటలు: సిరాశ్రీ
    కెమెరా: రాకేష్ కోలంచి
    ఆర్ట్: జెకే మూర్తి
    ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
    లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూరపనేని కిషోర్

    వాళ్లిద్దరి మధ్య కథ ఏమిటంటే?

    వాళ్లిద్దరి మధ్య కథ ఏమిటంటే?

    బీటెక్ గ్రాడ్యుయేట్ వరుణ్ ఒక కారణంగా ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంతంగా అన్వయ అనే కంపెనీ ప్రారంభించి బిజినెస్ మొదలుపెడుతాడు. అమెరికాలో ఉండే అన్వయ అనే అమ్మాయి (నేహా కృష్ణ) తల్లిదండ్రులు వరుణ్‌కు క్లయింట్స్‌గా ఉంటారు. అయితే అన్వయ ఇంటికి వెళ్లిన వరుణ్ తొలి చూపులోనే ఆమెను చూసి ప్రేమిస్తాడు. అయితే అమెరికాలో బ్రేకప్ కావడంతో అన్వయ ఇండియాకు వచ్చిందని వరుణ్‌కు తెలుస్తుంది. అయినా అన్వయను ప్రేమిస్తుంటాడు. అయితే అయితే ఇక వాళ్లిద్దరు పెళ్లి చేసుకొంటారనే సందర్భంలో వారిద్దరి మధ్య అపార్ధాలు చోటుచేసుకొంటాయి.

    వాళ్లిద్దరి మధ్య మూవీలో ట్విస్టులు

    వాళ్లిద్దరి మధ్య మూవీలో ట్విస్టులు


    ఉద్యోగం చేయకుండా ఎందుకు వరుణ్ వ్యాపారం చేయాలనుకొంటాడు. తన తండ్రితో వరుణ్‌కు ఎందుకు విభేదాలు ఉంటాయి? అమెరికాలో నేహాకు ఎందుకు బ్రేకప్ అవుతుంది? పెళ్లి చేసుకొందామని అనుకొంటున్న సమయంలో నేహా, వరుణ్ మధ్య అపార్ధాలు చోటుచేసుకొంటాయి? నేహా, వరుణ్ మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఏమిటి? నేహా, వరుణ్ మధ్య అపార్ధాలను ఎవరు తొలగించారు? అనే ప్రశ్నలకు సమాధానమే వాళ్లిద్దరి మధ్య సినిమా కథ.

    వాళ్లిద్దరి మధ్య దర్శకుడు ఎలా హ్యాండిల్ చేశారంటే?

    వాళ్లిద్దరి మధ్య దర్శకుడు ఎలా హ్యాండిల్ చేశారంటే?


    మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి భారీ విజయాలను అందుకొన్న వీఎన్ ఆదిత్య ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయారు. చాలా గ్యాప్ తర్వాత వీఎన్ ఆదిత్య ప్రేమికుల మధ్య ఇగో అనే అంశంతో.. ఆత్మల బ్యాక్ డ్రాప్‌తో ఒక డిఫరెంట్ పాయింట్‌తో లవ్ స్టోరిని అటెంప్ట్ చేసింది. అయితే చాలా సెన్సిటివ్ పాయింట్‌ను ఎమోషనల్‌గా క్యారీ చేయడానికి సరైనా హీరో, హీరోయిన్లు లేకపోవడం ప్రధానంగా ప్రతికూలమైన పాయింట్. వీఎన్ ఆదిత్య రాసుకొన్ని ఒక కొత్త పాయింట్‌ ప్రేక్షకులను కన్విన్స్ చేయడానికి మంచి హీరో, హీరోయిన్ ఉండి ఉంటే.. కథ అందరికీ రీచ్ అయి ఉండేదనిపిస్తుంది.

    నటీనటులు గురించి..

    నటీనటులు గురించి..


    ఇక వరుణ్‌గా విరాజ్ అశ్విన్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. కానీ ఆ కథను, తన పాత్రను మరో లెవెల్‌కు తీసుకెళ్లలేకపోయాడనిపిస్తుంది. కీలక సన్నివేశాల్లో మెరుగైన నటనను ప్రదర్శించాడు. ఇక నేహా కూడా కొన్ని సీన్లలో ఒకే అనిపించింది. నేహా తండ్రిగా శ్రీనివాస్ వడ్లమాని కామెడీ పెద్దగా వర్కవుట్ అయిందనిపించదు. ఇక విరాజ్ అశ్విన్ తండ్రిగా వెంకట్ సిదారెడ్డి ఆ పాత్రకు బ్యాడ్ ఛాయిస్. మంచి ఎమోషన్ పండించాల్సిన పాత్రను తేలిపోయేలా చేశాడనిపిస్తుంది. అందుకు అనుభవరాహిత్యమే కారణమనిపిస్తుంది. మిగితా పాత్రల్లో కనిపించినవారు ఒకే అనిపించారు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాకేష్ కోలంచి కెమెరా పనితనం బాగుంది. కథ, కథనాలకు తగినట్టుగా ఫీల్ గుడ్‌గా ఉండేలా సీన్లను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. మధు స్రవంతి మ్యూజిక్ ఒకే అనిపిస్తుంది. కథ, కథనాల్లో బలం లేకపోవడం వల్ల సిరాశ్రీ అందించిన సాహిత్యం కూడా ఎలివేట్ కాలేకపోయింది. మిగితా విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. అర్జున్ దాస్యన్ నిర్మాతగా పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. వీలైనంత సమయం చిక్కితే.. ఒకే స్ట్రెచ్‌లో సినిమా చూస్తే ఓ ఫీల్ కలిగించే అంశాలు ఉన్నాయని చెప్పవచ్చు. కథ డిఫరెంట్ పాయింట్ అయినప్పటికీ.. ఎగ్జిక్యూషన్‌లో ప్రాబ్లెం వల్ల సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మారలేకపోయిందనిపిస్తుంది.

    English summary
    Popular Director VN Aditya's Valliddari Madhya movie is streaming on AHA OTT. Viraj Ashwin and Neha Krishna are in lead role. Here is the Telugu filmibeat Exclusive Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X