Just In
- 5 min ago
Box office: మొత్తానికి హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా.. క్రాక్ తెచ్చిన లాభాలు ఎంతంటే?
- 11 min ago
పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం: ఆకట్టుకుంటోన్న ‘లక్ష్య’ టీజర్
- 49 min ago
లేడి బాస్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్.. అలా మొదలైన ప్రేమ..
- 1 hr ago
స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగశౌర్య: ‘వరుడు కావలెను’ నుంచి సర్ప్రైజింగ్ వీడియో
Don't Miss!
- News
టీడీపీలో దేవినేని ఒంటరయ్యారా ? కొడాలితో పోరులో కలిసిరాని నేతలు- మద్దతు కోసం యత్నాలు
- Automobiles
మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం
- Sports
ISL 2020 21: చివరలో విలియమ్స్ గోల్.. మోహన్ బగాన్‌కు మరో విజయం!!
- Finance
PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు
- Lifestyle
Republic Day 2021 : రిపబ్లిక్ డే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసమే...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ ‘మాస్టర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తమిళ నాట దళపతి విజయ్ అంటే మ్యానియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస బ్లాక్ బస్టర్‌లతో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వస్తున్నాడు. తేరీ, మెర్సెల్, సర్కార్, విజిల్ వంటి బ్లాక్ బస్టర్‌లతో తమిళ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్‌తో విజయ్ మాస్టర్ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. పలుమార్లు వాయిదా పడ్డ మాస్టర్ ఎట్టలకేలకు నేడు (జనవరి 13) సంక్రాంతి బరిలోకి దిగింది. మరి మాస్టర్ ఏ మేరకు పాస్ అయ్యాడో ఓ సారి చూద్దాం.

కథ..
బాల నేరస్థుల (జువైనల్) కాలేజ్, అందులోని కుర్రాళ్లను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుని తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకుంటాడు భవాని (విజయ్ సేతుపతి). అలాంటి కాలేజ్‌కి కొన్ని పరిస్థితుల వల్ల ప్రొఫెసర్ జేడీ (విజయ్) అక్కడికి మాస్టర్‌గా వెళ్తాడు. అక్కడి నేర సామ్రాజ్యాన్ని, మాస్టర్ జేడీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. భవాని, జేడీల కథ ఏంటి అన్నదే మాస్టర్.

కథలో ట్విస్టులు..
ప్రొఫెసర్ జేడీ జువైనల్ కాలేజ్‌కు ఎందుకు వస్తాడు? ప్రొఫెసర్ అయిన జేడీ అలా తాగుబోతు మాస్టర్‌గా ఎందుకు కనిపిస్తున్నాడు? అలాంటి ప్రొఫెసర్ జేడీ కాలేజ్‌కి వచ్చాక పరిస్థితులు, అక్కడి విద్యార్థులు ఎలా మారుతారు? బాల నేరస్థులనే తన సైన్యంగా మలుచుకున్న భవానీకి జేడీకి మధ్య వైరం ఎలా మొదలైంది? అసలు ఈ కథలో చారులత (మాళవిక మోహనన్) పాత్ర ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

ఫస్టాప్ అనాలిసిస్..
మాస్టర్ సినిమా పోటా పోటీగా ఇద్దరు విజయ్‌ల మధ్యే నడిచింది. ఒకరు భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించగా.. మరోకరు అంతకు మించి హీరోయిజాన్ని ప్రదర్శించారు. ఇలా ఫస్టాఫ్ మొత్తం కూడా విజయ్‌ల మధ్య హోరాహోరీగా సీన్‌లతో లాగించేశాడు. ఇంటర్వెల్ ముందు వరకు కూడా సినిమా అలా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్‌కు సినిమాను ఓ రేంజ్‌లొ నిలబెట్టేయడంతో దర్శకుడు అక్కడే పాసైపోయాడు. అలా ఫస్టాప్‌తో అభిమానులకు ఫుల్ మీల్స్ వచ్చినట్టు అనిపిస్తుంది.

సెకండాఫ్ అనాలిసిస్..
సెకండాఫ్‌లోనూ అంతే స్థాయి ఎలివేషన్‌లు, కథనంలో వేగం ఉంటుందని అంతా భావిస్తారు. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్, సాగదీతలా అనిపించే సీన్లతో సెకండాఫ్ కాస్త బోరింగ్‌గా అనిపించవచ్చు. అయితే మాస్, విజయ్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం కూడా బోర్ అనిపించదు. మొత్తానికి మాస్టర్ సెకండాఫ్‌లో కాస్త తడబడ్డట్టు కనిపిస్తోంది. కానీ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్‌తో ప్రతీ సీన్‌ను అంత ఎత్తులో నిలబెట్టేసి అందరినీ ఎంగేజ్ చేసేశాడు.

నటీనటులు..
మాస్టర్ సినిమా ప్రధానంగా సాగేది విజయ్ విజయ్ సేతుపతి మధ్యే. తెరపై ఎంత మంది వచ్చిపోతున్నా కూడా విజయ్ తన హీరోయిజంతో, విజయ్ సేతుపతి తన విలనిజంతో కట్టిపడేస్తారు. మాస్‌ను పీక్స్‌లో చూపించడం, అది కూడా దళపతికి పెట్టిన ఎలివేషన్స్ సీన్స్ అన్నీ కూడా విజయ్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. విజయ్ తనకు అలవాటైన నటనతో జేడీ పాత్రలో సులభంగా నటించేశాడు. ఇక విజయ్ సేతుపతికి ఇలాంటి డిఫరెంట్ పాత్రలు చేయడమంటే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. ఈ సినిమా ఇంతలా నిలబడటానికి విజయ్ సేతుపతి నటన ప్రధాన కారణం. ఇక హీరోయిన్‌కు అంత ప్రాధాన్యం లేకపోయినా కనిపించిన ప్రతీసారి అందంతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడి ప్రతిభ
మాస్టర్ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ ఎంచుకున్న పాయింట్ మనకు కొత్తేమీ కాదు. అలాంటి పాయింట్‌తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి మాస్టర్, జోష్ సినిమాలు చాయలు కనిపిస్తుంటాయి ఇందులో. ఖైదీతో సీటు అంచున కూర్చోబెట్టి సినిమాను చూపించిన లోకేష్ మాస్టర్‌తో కచ్చితంగా నిరాశపరిచాడు. ఖైదీ తరువాత లోకేష్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో కొత్తదనాన్ని ఆశిస్తే మాత్రం భంగ పడటం గ్యారెంటీ. విజయ్ లాంటి స్టార్ హీరోతో ప్రయోగం ఎందుకని మంచి మాస్ మసాలా కమర్షియల్ మీటర్‌లోనే సినిమాను లాగించాడు. అది విజయ్ అభిమానులకు ఎలాగూ నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులను లోకేష్ నిరాశపరిచాడనే చెప్పవచ్చు. అయితే మాస్‌ను ఆకాశమంత ఎత్తులో హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించడంలో లోకేష్ సక్సెస్ అయ్యాడు.

సాంకేతిక విభాగాల పనితీరు
సాంకేతిక విభాగాల విషయంలో ముందుగా అనిరుధ్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఆయన అందించిన సంగీతం ఒకెత్తు అయితే నేపథ్య సంగీతం మరో ఎత్తు. సాధారణ సన్నివేశాన్ని కూడా బ్యాక్ గ్రౌండ్‌తో అంత ఎత్తున నిలబెట్టేశాడు. సినిమాటోగ్రఫర్ సత్యన్ సూర్యన్ పనితనం యాక్షన్ సీన్‌లో బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు పడి నిడివిని తగ్గిస్తే ఇంకా మంచి ఫలితం వచ్చేదేమో. ఇక సినిమాను నిర్మించిన గ్జావియర్ బ్రిట్టో ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది.

ప్లస్ పాయింట్స్
విజయ్, విజయ్ సేతుపతి
సంగీతం,నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
నిడివి
కథలో కొత్తదనం లేకపోవడం

ఫైనల్‌గా..
ఇక చివరగా ఈ మాస్టర్ తన విద్యార్థులను (అభిమానులు) మాత్రమే మెప్పించేలా ఉన్నాడు. కానీ మాస్టర్ మీదున్న అంచనాలు సంక్రాంతి బరిలోకి దిగడంతో రికార్డులు బద్దలయ్యేలానే వాతావరణం కనిపిస్తోంది. విజయ్ మరోసారి తన ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్‌లాంటి సినిమాను ఇచ్చాడని చెప్పవచ్చు.

నటీనటులు
విజయ్, విజయ్ సేతుపతి, మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
నిర్మాత : గ్జావియర్ బ్రిట్టో
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫి : సత్యన్ సూర్యన్
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
రిలీజ్ డేట్ : 2021-01-13
రేటింగ్ : 2.5