»   » వీడో 'పోలీస్' భాషా, 'పోలీస్' సింహ నాయుడు ( పోలీస్ 'పోలీసోడు' రివ్యూ)

వీడో 'పోలీస్' భాషా, 'పోలీస్' సింహ నాయుడు ( పోలీస్ 'పోలీసోడు' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

గతంలో ఏదైనా భాషలో సూపర్ హిట్టైన సినిమాని డబ్బింగ్ చేయటమో, లేక రీమేక్ చేయటమో చేసి తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మాతలు...సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే రీమేక్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ కొనటం, అమ్మటం జరుగుతూండటం చేస్తున్నారు.

దాంతో ఫ్లాఫ్ టాక్ వచ్చాక ఏ రైట్స్ అమ్ముకోలేం అనుకునే నిర్మాతకు సేఫ్ కానీ, ప్రేక్షకుడు మాత్రం స్ట్రైయిట్ సినిమా అనే బిల్డప్ తో రిలీజయ్యే ఈ డబ్బింగ్ సినిమాలకు బలైపోవటం జరుగుతోంది.

ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే గతంలో తమిళ సినిమాలు చాలా భాగం అక్కడ ఘన విజయం సాధించాకే ఇక్కడ డబ్ చేసి వదిలేవారు. కానీ తమిళ హీరోలు కార్తి,సూర్య లు తెలుగు మార్కెట్ ని సైతం గ్రాబ్ చేయాలని నిర్ణయించుకి ఇక్కడ దండయాత్ర మొదలెట్టాక... అక్కడ, ఇక్కడా ఒకే రోజు విడుదల చేస్తున్నారు.

Vijay's Police (Polisodu) telugu movie review

వాళ్లేనా ..నాకేం తక్కువ అని విజయ్ సైతం తన తమిళ చిత్రరాజాలను స్టైయిట్ గా ఇక్కడ సైతం విడుదల చేసి, గత కొంత కాలంగా రెండు చోట్లా ఫ్లాఫులే సంపాదిస్తూ వస్తున్నాడు. ఈ రోజు ఈ పోలీసోడు చిత్రం సైతం తమిళ టాక్ వచ్చేలోగా తెలుగు లో డబ్ చేసి వదిలేసారు. ఇక్కడ అంతంత మాత్రంగా ఉంది. విజయ్ స్టైలిష్ యాక్షన్ తప్ప మిగతా కథ,కథనం పరమ రొటీన్. రొటీన్ గా హిట్ కొట్టాలంటే రొటీన్ కథనే ఎంచుకోవాలనుకున్నాడేమో విజయ్...'పులి' పంజా కు బలైన తర్వాత.

రజనీకాంత్ భాషా లేదా బాలయ్య సమరసింహా రెడ్డి అదీ కాకపోతే నరసింహనాయుడు తరహా చిత్రాలు తెగ చూసి తయారు చేసుకున్నట్లున్న ఈ కథలో సినిమా ఓపెన్ చేసేసరికి జోసెఫ్ (విజయ్) ...తన కుమార్తె నివేదత (నైనిత)తో హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. నివేదత స్కూల్ టీచర్ ..యామి (ఎమి జాక్సన్)...నివి కు దగ్గరవ్వాలని చూస్తుంది.

ఈ లోగా ఓ రోజు ఓ రౌడీ బ్యాచ్ తో యామీ గొడవపడటం..మన హీరో జోసెఫ్ ...పోలీస్ స్టేషన్ కు వెళ్లటం జరుగుతంది. అక్కడకు వెళ్లాక..అతను జోసెఫ్ కాదు..విజయ్ అని అక్కడివాళ్లు గుర్తిస్తారు. తాము చంపేసామని భావిస్తున్న విజయ్ మళ్లీ రావటం ఏంటని ఆశ్చర్యపోతారు. అంతేనా అతనిపై ఎటాక్ చేయటానికి ప్రయత్నిస్తాడు.

Vijay's Police (Polisodu) telugu movie review

మనకీ అహా..మళ్లీ ఇదే కధా అని అనిపిస్తూంటే దర్శకుడు ఇక సస్పెన్స్ ఎందుకని ..హీరో ప్లాష్ బ్యాక్ అందులో విలన్ తో ఫైట్ కు కారణం, హీరోయిన్ మైత్రి (సమంత) చనిపోవటం వంటి విషయాలు రివీల్ చేసేస్తాడు. ఇంకేమంది...మీరు ఊహించిందే...క్లైమాక్స్..మీరు ఇప్పటికి ఊహించకపోతే ఖచ్చితంగా మీరు ధియోటర్ కు వెళ్లి మిగతా కథని చూడాల్సిందే.

స్టైల్ తప్ప చెప్పుకోదగిన విషయం లేని ఈ సినిమా తెలుగు వాళ్లకు పరమ రొటీన్ గా అనిపించటం లో వింతేం లేదు. ఇలాంటి కథలు, సీన్స్ లు బోల్డు గతంలో చూసేసామని తెలుగు ప్రేక్షకుడు అనుకుంటాడు ఖచ్చితంగా. అయితే విజయ్ , నైనిక(మీనా కూతరు) మధ్య వచ్చే సీన్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తాయి. దర్శకుడు మ్యాటర్ అంతా అక్కడ కనిపిస్తుంది.

అమీ జాక్సన్ విషయానికి వస్తే..ఆమె ఫస్టాఫ్ లో కథలో కాస్సేపు స్త్రీ పాత్ర ఉండాలి కాబట్టి అన్నట్లు ఉంటుంది కానీ హీరో కు ఆమెకు మధ్య రొమాంటిక్ ఏంగిల్ ఏమీ లేదు. ఇక దర్శకుడు అట్లీ..హీరోలని స్టైలిష్ గా చూపెడితే సినిమాలు పెద్ద హీరోలు పిలిచి మరీ సినిమాలు ఇస్తాడని విషయం దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఫ్రేమ్ చెక్కినట్లు కనపడుతోంది. ఆ స్టైలిష్ మేకింగ్ కాస్త కథ కూడా ఉంటే బాగుండేది అని అత్యంత సాధారణ ప్రేక్షకుడుకి కూడా అనిపిస్తుంది.

Vijay's Police (Polisodu) telugu movie review

టెక్నికల్ గా చెప్పాలంటే ఎడిటింగ్ తెలుగు వెర్షన్ అయినా హీరో వీర బిల్డప్ షాట్స్ కాస్త తగ్గించి ఉంటే నిడివి తగ్గి బాగుండేది అనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. జి.విప్రకాష్ ..పాటలు ఎలా ఉన్నా..రీరికార్డింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

ఫైనల్ గా పాత కథనే పాత గా చెప్పిన ఈ సినిమా హీరోని స్టైలిష్ గా ఎలా చూపెట్టవచ్చు అనే ఏకైక విషయం తెలుసుకోవటానికి ఓ లుక్కేయవచ్చు.

English summary
Tamil superstar, Vijay’s Theri has been dubbed into Telugu as Police. Directed by Atlee released today with average talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu