For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంకొ గెటప్ అంతే... (విక్రమ్ 'ఇంకొక్కడు' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  విక్రమ్ తో సినిమా చేయాలనిఉందా, డేట్స్ కావాలా అయితే ఓ వెరైటి గెటప్ తో వెళ్లి కలవండి..వెంటనే ఓకే చేసేస్తాడు..కథ, క్యారక్టరైజేషన్ వంటివి అక్కర్లేదు అని ఆయనపై ఓ జోక్ ఉంది. అది నిజంగానే నిజం అవుతోంది. కేవలం వెరైటీ గెపట్ లను చూసుకుని విక్రమ్ మరేమీ పట్టించుకోకుండా పరమ బోర్ సినిమాలను అందిస్తూ తను గెటప్ కోసం కష్టపడుతూ, మనకి సినిమా చూసేటప్పుడు కష్టానికి గురి చేస్తున్నాడు.

  ఎన్ని ఫ్లాఫులు వచ్చినా చలించకుండా మరో ప్లాఫ్ కు రెడీ అయినట్లు చేసిన ఈ చిత్రం కథ,కమామీషు చూద్దాం. విక్రమ్ ఇప్పటికైనా మేల్కొని కాస్త మంచి కథలు ఎంచుకోవాలని ప్రార్దిద్దాం.

  జేమ్స్ బాండ్ సినిమాలను గుర్తు చేసే ఈ సినిమాలో లవ్ (విక్రమ్) ఓ కెమెకిల్ సైంటిస్ట్. అతను 'స్పీడ్'అనే ఓ డ్రగ్‌ను కనిపెట్టి,దాన్ని టెర్రరిస్ట్ లకు అమ్మేసే ఆలోచనలో ఉంటాడు. ఇంతకీ స్పీడ్ ఏం చేస్తుందయ్యా అంటే...దాన్ని తీసుకుంటే ఓ ఐదు నిముషాల పాటు మనిషికి అదిరిపోయే శక్తి వస్తుంది.

  ఆ డ్రగ్ తీసుకున్న ఓ 70 సంవత్సరాల ముసలాడు...ఇండియన్ ఎంబసీ మీద దాడి చేసి, ఓ ఇరవై మంది ఇండియన్ పోలీసులను చంపేస్తాడు. ముసలాడిలో సైతం అనంతమైన శక్తి వచ్చే.. అంత పరవ్ ఫుల్ డ్రగ్ టెర్రరిస్ట్ ల చేతికి వెళితే ఇంకేమైనా ఉందా... అందుకే ఆ డ్రగ్ ని ఆపాలని ఇండియన్ ఇంటిలిజెన్స్ సంస్ద రంగంలోకి దిగుతుంది.

  వాళ్లు లవ్‌ను పట్టుకునేందుకు ఇండియన్ ఇంటిలిజెన్స్ సంస్థ అఖిల్ (విక్రమ్) అనే ఓ సస్పెండ్ అయిన అధికారిని పిలుస్తారు. ఎందుకంటే అఖిల్‌కి మాత్రమే లవ్‌కి సంబంధించిన చాలా విషయాలు తెలుసని వాళ్లకు తెలుసు. దాంతో ఇంటిలిజెన్స్ సంస్థ లవ్‌ని పట్టుకునేందుకు అఖిల్‌కి అన్ని అధికారాలూ ఇస్తుంది.

  గతంలో ఆ సైంటిస్ట్ విలన్ ..లవ్ కారణంగానే తన భార్య మీరా (నయనతార) ను పొగొట్టుకున్న అఖిల్, లవ్ ను నాశనం చేయాలనే నిర్ణయించుకుంటాడు. మరో రా ఆఫీసర్ ఆరుషి(నిత్యామీనన్)తో కలిసి మలేషియాలో అడుగుపెట్టిన అఖిల్ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.అసలు అఖిల్‌కి, లవ్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు లవ్ కథను ఎలా ముగించాడు,అతన్ని పట్టుకునేందుకు ఏం చేసాడు అన్నదే మిగతా కథ.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ...ప్లస్ లు, మైనస్ లతో

  హోం వర్క్ లేదు

  హోం వర్క్ లేదు

  ఇలాంటి సినిమా కథలకు ఎంత హోం వర్క్ చేసి తెరకెక్కిస్తే అంత ఫలితం ఉంటుంది. అయితే ఈ సినిమాలో అలాంటిదేమీ కనపడదు. చాలా సీన్స్ లాజిక్ లెస్ గా ముఖ్యంగా నయనతార తో వచ్చే సీన్స్ దారుణంగా ఉంటాయి. ఇన్విస్టిగేషన్ అంటే ఇలా ఉంటుందా..ఇన్విస్టిగేషన్ ఆఫీసర్స్ ఇలా ఉంటారా అనే డౌట్ వస్తుంది. దాంతో బిలివ్ బులిటీ మిస్సైంది.

  అంతకు మించి

  అంతకు మించి

  సినిమా కథలో కేవలం స్పీడ్ అనే డ్రగ్ విషయం తప్ప కొత్తదనం కొంచెం కూడా లేదు. చాలా ప్రెడిక్టుబుల్ గా కథ,కథనం సాగుతాయి. జేమ్స్ బాండ్ సినిమాలు చూసి రాసుకున్న కథలాగ ఉన్న ఈ సినిమాలో సీరియగా తెరపై నడిచే సీన్స్ మనకు కామెడీగా అనిపించి నవ్వు తెప్పిస్తూంటాయి. అది దర్శకుడు తప్పిదమే.

  సైన్స్ పిక్షన్ అనేది తప్ప

  సైన్స్ పిక్షన్ అనేది తప్ప

  ఈ సినిమాకు సైన్స్ ఫిక్షన్ అనే జానర్ ఫిక్స్ చేసారు కానీ ఇలాంటి కథలు మనం బోలెడు చూసి ఉన్నాం. హీరో,హీరోయిన్ కలిసి ఇన్విస్టిగేషన్, విలన్ ..హీరోయిన్ ని చంపేయటం, హీరో రెచ్చిపోయి..విలన్ ని తుదముట్టించటం, ఎప్పటి కథ ఇది అనిపిస్తుంది. ఇలాంటి కథకు కేవలం ఓ స్పీడ్ అనే డ్రగ్ విషయం కలిసి మాయ చేద్దామనుకున్నారు కానీ తేలిపోయింది

  వృధా

  వృధా

  తొలిసారి జాతీయ ఉత్తమనటుడు విక్రమ్ ...డ్యూయిల్ రోల్ లో కనిపించాడు. కానీ ఆయన శ్రమ అంతా వృధా అయినట్లు మనకి అనిపిస్తుంది.చిత్రంలో రా ఏజెంట్ అఖిలన్ గా, సైంటిస్ట్, నెగటివ్ షేడ్స్ ఉన్న లవ్ పాత్రలో విక్రమ్ నటను అదరగొట్టాడు. ముఖ్యంగా లవ్ పాత్రలో ట్రాన్స్ జెండర్ పాత్రగా అనిపించే లవ్ పాత్రలో విక్రమ్ హావభావాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. విక్రమ్ నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

  విలన్ గానే

  విలన్ గానే

  నిజానికి ఈ సినిమాలో రెండు పాత్రల మధ్య వైరుద్యాన్ని ప్రదర్శించటంలో విక్రమ్ తన నటనా పరిణితిని కనిపింప చేసాడు. అయితే రా ఏంజెంట్ గా కన్నా..ట్రాన్స్ జెంటర్ గానే విక్రమ్ అదరకొట్టాడు. ఆ పాత్ర అతనికి కొత్త కావటంతో అందులోకి పరకాయప్రవేశం చేసాడనే చెప్పాలి. విక్రమ్ లుక్స్, విలన్ క్యారేక్టరైజేషన్ లాంటి అంశాలు మాత్రం ఆకట్టుకుంటాయి.

  అయ్యో...సెకండాఫ్

  అయ్యో...సెకండాఫ్

  ఇక ఈ సినిమా సెకండాఫ్‌లో హీరో, విలన్ ఒకసారి ఎదురుపడ్డాక సినిమా ఫ్లాట్ అయ్యిపోయింది. అక్కడ నుంచి వీరిద్దరి మధ్యాకథ తిరుగుతుంది. పోనీ అదేమన్నా ఆసక్తిగా సాగుతుందా అంటే పరమ బోర్ కొట్టించే వ్యవహారం. దానికి తోడు ఆ బోర్ టైమ్ లోనే దాన్ని పెంచటానికా అన్నట్లు రెండు పాటలు రావడం కూడా విసుగు తెప్పించింది.

  హుక్ చేసాడు

  హుక్ చేసాడు

  ఇక విలన్ కనిపెట్టిన స్పీడ్ డ్రగ్ ఎలా పనిచేస్తుందో మొదటి సీన్ లోనే చెప్పేయడం మనను బాగా ఆకట్టుకుంది. భలే స్పీడుగా కథలోకి వెళ్లిపోయాడే అనుకుంటాం. అంటే స్రీన్ ప్లే బాషలో చెప్పాలంటే మొదటి సీన్ లోనే హుక్ చేసాడు దర్శకుడు. అయితే ఆ తర్వాతే తడబాటు మొదలయ్యి...సినిమా గ్రాఫ్ తో పాటు అదీ పరాకాష్టకు చేరింది.

  టెక్నికల్ గా..

  టెక్నికల్ గా..

  ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. , ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా చూపించడంలో సినిమాటోగ్రఫర్ విజయవంతం అయ్యాడు. భాను శ్రీనివాసన్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. మరింతగా సినిమా ని ట్రిమ్ చేసినా బాగుండును అనే ఫీల్ వస్తుంది.

  అంత సీన్ లేదు

  అంత సీన్ లేదు

  నిత్యామీనన్ అభిమానులు అయితే మీరు ఈ సినిమాలో ఆమె పాత్ర ని తెగ ఊహించుకుని వెళితే నిరాశపడతారు. ఎందుకంటే నిత్యా మీనన్ పాత్ర చాలా చిన్నది కావడంతో పాటు ఆమెకు పెద్దగా నటించే ఆస్కారం కూడా లేకపోవడం మైనస్‌గానే చెప్పుకోవాలి.

  లవ్ ట్రాక్, కామెడీ

  లవ్ ట్రాక్, కామెడీ

  సినిమాలో విక్రమ్, నయనతార మద్య వచ్చే లవ్ ట్రాక్ చాలా తక్కువగా ఉంది. సినిమా అంతా విలన్, హీరో చుట్టూ తిరగటం అంటే విక్రమ్ చుట్టూ తిరగటమే సరిపోయింది. ఇక తంబిరామయ్య కామెడీ తెలుగు వారికయితే నవ్వించదు. మరి తమిళం వారికి ఏమన్నా కనెక్టు అవుతుందేమో చూడాలి.

  ఎందుకు

  ఎందుకు

  ఫైట్స్, ఛేజ్ లతో సినిమా ఎక్కువ భాగం నడుస్తుంది. దర్శకుడు పాత్ర వారిని ఎంచుకోవటంలోనే కనపడుతుంది. అంతే తప్ప దర్శకుడుగా ఎలివేట్ చేసే సీన్స్ తక్కువే. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా భీకరంగా ఉంది. పాటల్లో హెలేనా పాట ఒకటే మనకు గుర్తు ఉంటుంది.

  ఎవరెవరు..

  ఎవరెవరు..

  బ్యానర్ ఎన్.కె.ఆర్.ఫిలింస్

  నటీనటులు : విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్, తంభి రామయ్య, బాలు, కరుణాకరన్, రిత్వుక తదితరులు.

  సంగీతం: హారీష్ జైరాజ్

  సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్,

  మాటలు: శశాంక్ వెన్నెలకంటి

  ఎడిటింగ్: భాను శ్రీనివాసన్

  నిర్మాత : శింబు తమీన్స్

  తెలుగు నిర్మాత : నీలం కృష్ణారెడ్డి

  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆనంద్ శంకర్

  విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2016

  ఫైనల్ గా విక్రమ్... ఇప్పటికైనా ..జబర్దస్త్ వంటి టీవీషోల్లో సైతం గెటప్ లు వేసే గెటప్ శ్రీను వంటివారు వచ్చేసారనే విషయం తెలుసుకోవాలి. గెటప్ ల మీద పెట్టే ఇంట్రస్ట్ లో సగమైనా కథలపైనే పెడితే ఇంతకన్నా వెయ్యి రెట్ల మంచి అవుట్ పుట్ వస్తుంది.

  English summary
  Inkokkadu ( Iru Mugan ) is a desperate attempt from Director Anand Shankar. He tried something new, but failed badly in execution. Vikram’s performance and background score makes it a one-time watch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X