twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినర సోదర వీర కుమార మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Vinara Sodara Veera Kumara Review And Rating | Filmibeat Telugu

    Rating:2.5/5

    కంటెంట్, క్వాలిటీతో రూపొందే చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో విలువైన జీవితాన్ని ప్రేమ కోసం త్యాగం చేసుకోవద్దు అనే బేసిక్ పాయింట్‌తో వచ్చిన చిత్రం వినర సోదర వీరకుమార. శుభలేఖ+లు ఫేమ్ శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెన్సేషన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రిలీజ్‌కు ముందే టీజర్లు, ట్రైలర్లతో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చిత్ర యూనిట్‌కు ఇది ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     వినర సోదర.. స్టోరీ

    వినర సోదర.. స్టోరీ

    ఓ గ్రామంలో రమణ (శ్రీనివాస్ సాయి) అనే యువకుడు ఆటో డ్రైవర్. అదే గ్రామంలో కాలేజీ స్టూడెంట్ సులోచన (ప్రియాంక జైన్)‌తో ప్రేమలో పడుతాడు. తన బావ (సందేశ్)‌తో పెళ్లి చేయాలనే కుటుంబ నిర్ణయం కారణంగా రమణ ప్రేమను ఆమె అంగీకరించదు. ఎలాగైనా ప్రేమను దక్కించుకోవాలనే ప్రయత్నంలో సులోచన బావ చేతిలో దారుణంగా చావుదెబ్బలు తింటాడు. కథ ఇలా సాగుతుండగా.. ఆత్మహత్య చేసుకొన్న స్నేహితుడు సూర్యకు ఉన్న కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి బయలుదేరుతాడు. రకరకాల సంఘర్షణ మధ్య రమణ కూడా ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసుకోవాలనే పరిస్థితిని ఎదుర్కొంటాడు.

     కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    తన స్నేహితుడు అప్పగించిన బాధ్యతలను, కోరికలను తీర్చడానికి రమణ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? చివరకి సులోచన ప్రేమను గెలుచుకొన్నాడా? సులోచన ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఈ కథలో కీలకమైన సూరీ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు? రమణను సూరి ఎలాంటి సహాయాన్ని కోరాడు? అర్ధాంతరంగా ఓ మనిషి జీవితం చాలిస్తే దాని ప్రభావం కుటుంబంపై ఏ మేరకు ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానమే వినర సోదర వీరకుమార.

     దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    తల్లిదండ్రుల త్యాగాలను మరిచి ప్రేమ కోసం యువతీ యువకులు జీవితాన్ని అర్ధాన్ని ముగించడం సరికాదు అనే దర్శకుడు సతీష్ చంద్ర బేసిక్ పాయింట్‌ సినిమాకు ఎసెట్. ఆ పాయింట్‌ను విస్తరించే క్రమంలో రకరకాల డీవియేషన్స్ కనిపిస్తాయి. కథనం కొంత కన్‌ఫ్యూజన్‌కు గురిచేసింది. కథను వివరంగా, ప్రతీ నటీనటుడి కోణంలో భావోద్వేగంగా చెప్పాలనే ప్రయత్నం సినిమా వేగం నెమ్మదించడానికి కారణమైనట్టు కనిపిస్తుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా వేగం పెరగడం, ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో సినిమా భావోద్వేగంగా మారుతుంది. దర్శకుడు టిపికల్ స్క్రీన్ ప్లే‌పైఎక్కువగా దృష్టిపెట్టడం వల్ల కథలో ఉండే అసలు విషయం మరుగున పడినట్టు అనిపిస్తుంది. సూరి క్యారెక్టర్‌ను కథలో జొప్పించిన విధానం బాగుంది. అయితే దానిని మరింత ఎమోషనల్‌గా మార్చడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదనే అభిప్రాయం కలుగుతుంది. కాకపోతే చివరకు ఫరీదా క్యారెక్టర్‌ను కథలోకి లాక్కొని రావడం వల్ల మంచి పాయింట్‌తో ఉన్న సినిమాను ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.

     హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్

    హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్

    వినరా సోదర వీరకుమార సినిమాకు హీరో, హీరోయిన్లు శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ ప్రధానంగా బలం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రీనివాస్ సాయి రమణ పాత్రలో ఒదిగిపోయాడు. రకరకాల వేరియేషన్స్ చూపించి ఆకట్టుకొన్నాడు. సినిమాను తన భుజాలపై మోశాడనే చెప్పవచ్చు. శ్రీనివాస్ సాయి ఫెర్ఫార్మెన్స్‌కు తగినట్టుగానే ప్రియాంక జైన్ తన ప్రతిభను చాటుకొన్నది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. మంచి పాత్ర లభిస్తే అందం, అభినయంతో ఆకట్టుకొనే ప్రతిభ ఉందని సులోచన పాత్ర ద్వారా తెలియజెప్పింది. శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యువతకు గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి.

    ఉత్తేజ్, ఝాన్సీ పాత్రల గురించి

    ఉత్తేజ్, ఝాన్సీ పాత్రల గురించి

    మిగితా పాత్రల్లో ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్ తదితరులు నటించారు. హీరోకు తలిదండ్రులుగా ఉత్తేజ్, ఝాన్సీ కనిపించారు. కొన్ని సీన్లలో వీరిద్దరి నటన సినిమాకు తోడ్పాటునందించింది. పేదరికంతో బాధపడే తల్లిదండ్రుల పాత్రల్లో వారిద్దరు ఆకట్టుకొన్నారు. వడ్డీ వ్యాపారిగా జెమినీ సురేష్ కనిపించిన రెండు సీన్లలో మెప్పించాడు. మిగితా పాత్రల్లో అంతా కొత్తవారే కావడం వల్ల బలమైన పాత్రలు తేలిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది.

     మాటలు, పాటలు.. మ్యూజిక్

    మాటలు, పాటలు.. మ్యూజిక్

    వినర సోదర వీరకుమార సినిమాకు తెరవెనుక ప్రధాన పాత్ర పోషించిన వారిలో రచయిత ల‌క్ష్మీభూపాల గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. కీలక సన్నివేశాలకు ఆయన రాసిన మాటలు సినిమాకు బలంగా మారాయి. ఈ సినిమాలో సింగిల్ కార్డుతో పాటలకు సాహిత్యం అందించారు. కొన్ని సీన్లలో హృదయాన్ని తాకేలా డైలాగ్స్ ఉన్నాయి. వున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ ఆకట్టుకున్నది.

    సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    రవి వి అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఆకర్షణ ఉప్పాడ బీచ్ అందాలు, గ్రామీణ వాతావరణాన్ని స్క్రీన్‌పై చాలా రిచ్‌గా చూపించడంలో సఫలమయ్యారు. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. లక్ష్మణ్ క్యాదారి నిర్మాతగా లక్ష్మణ్ సినీ విజన్ నిర్మాణ విలువలు ఉత్తమ స్థాయిలో ఉన్నాయి. సినిమా క్వాలిటీ విషయంో నిర్మాత లక్ష్మణ్ రాజీ పడినట్టు కనిపించలేదు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే సినిమా మరింత బెటర్‌గా ఉండేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకొంటున్న యువతకు చక్కటి సందేశం ఇచ్చే చిత్రం వినర సోదర వీరకుమార. ఎన్నో ఆశలు పెట్టుకొన్న తల్లిదండ్రలు తమ పిల్లలు అర్ధాంతరంగా జీవితాన్ని చాలిస్తే వారు అనుభవించే యాతన ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు దర్శకుడు చూపించారు. సినిమా మేకింగ్‌లో అపరిపక్వత అక్కడక్కడా కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది. ప్రయోగాత్మకంగా డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు నచ్చితే సినిమా మంచి విజయాన్ని అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు చేరువైతే కమర్షియల్‌గా సక్సెస్ కూడా లభించడం ఖాయం.

     పాజిటివ్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్

    మూలకథ (బేసిక్ పాయింట్)
    నటీనటుల పెర్ఫార్మెన్స్
    సినిమాటోగ్రఫి
    మ్యూజిక్
    డైలాగ్స్
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    స్క్రీన్ ప్లే
    సినిమా నిడివి

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్
    దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ల
    నిర్మాత: లక్ష్మణ్ క్యాదారి
    మాటలు, పాటలు: ల‌క్ష్మీభూపాల
    సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
    కెమెరా: రవి వి,
    ఎడిటింగ్: మార్తండ్. కె. వెంకటేష్
    డ్యాన్స్: అజయ్ సాయి,
    ఆర్ట్: లక్ష్మీ సింధూజ గ్రంథి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనీల్ మైలాపురం
    బ్యానర్: లక్ష్మణ్ సినీ విజన్స్
    రిలీజ్: 2019-03-22

    English summary
    Vinara Sodara Veera Kumara Movie's trailer released in Hyderabad on 26th. This movie directed by Satish Chandra Nadella, Produced by Lakshman K. Srinivasulu, Priyanka Jain are the lead pair. In this event, Producers Bekkam Venu, Laxman spoke to media about the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X