For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ori Devuda Movie Review: భార్యగా బెస్ట్ ఫ్రెండ్ వస్తే.. దేవుడిగా వెంకటేష్ అలా, విశ్వక్ సేన్ నటన మాత్రం..

  |

  రేటింగ్: 2.75/5

  టైటిల్: టైటిల్ ఓరి దేవుడా..!
  నటీనటులు: విశ్వక్ సేన్, వెంకటేష్, మిథిలా పాల్కర్, వెంకటేష్ కాకుమాను, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ తదితరులు
  దర్శకత్వం: అశ్వథ్ మారిముత్తు
  సంభాషణలు: తరుణ్ భాస్కర్
  సంగీతం: లియోన్ జేమ్స్
  సినిమాటోగ్రఫీ: విధు అయన్న
  ఎడిటింగ్: విజయ్
  నిర్మాతలు: పెరల్ వి పొట్లూరి-పరమ్ వి పొట్లూరి
  ప్రొడక్షన్ బ్యానర్: పీవీపీ సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
  విడుదల తేది: అక్టోబర్ 21, 2022

  ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాల హవా కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ తదితర చిత్రాలు రీమేక్ సినిమాలే. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చిన మరో రీమేక్ చిత్రం 'ఓరి దేవుడా..!'. 2020లో తమిళంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన 'ఓ మై కడువలే ' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. ఈ మూవీలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో నటించారు. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వథ్ మారిముత్తునే ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. ఎట్టకేలకు ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

   కథ:

  కథ:


  అర్జున్ (విశ్వక్ సేన్), అను పాల్ రాజ్ (మిథిలా పాల్కర్), మణి (వెంకటేష్ కాకుమాను) ముగ్గురు చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్. కానీ అను చిన్నప్పటినుంచి అర్జున్ ని ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తుంది. అనును పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాడు అర్జున్. కట్ చేస్తే వీళ్లిద్దరు డివోర్స్ తీసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతారు. బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న అర్జున్ విడాకులు ఎందుకు కావాలనుకున్నాడు? బెస్ట్ ఫ్రెండ్ భార్యగా వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? నిజానికి అవి సమస్యలా? అర్జున్ లైఫ్ లోకి వచ్చిన మీరా ఎవరు? తనవల్ల అర్జున్ తెలుసుకుందేంటి? అనుకి అర్జున్ విడాకులు ఇచ్చాడా? తన తలరాతను అలా రాసిన దేవుడిని నిందించిన అర్జున్ తెలుసుకుందేంటి? అనేదే సినిమా కథ.

  విశ్లేషణ:

  విశ్లేషణ:


  ప్రతి మనిషికి ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితులో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయంతో ఆ మనిషి కష్టాలు ఎదుర్కోవచ్చు. సమస్యలు తలెత్తొచ్చు. అవకాశం వస్తే ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆ నిర్ణయాన్ని మారుద్దామనుకునే ప్రతిసారి అనుకునే వాళ్లు అనేకమందే ఉంటారు. అలాంటి కథతో వచ్చిందే ఈ ఓరి దేవుడా. కొద్దిగా ఇలాంటి కథను దేవుడు చేసిన మనుషులు సినిమాలో చూపించారు. అలాగే ముందుగా పెళ్లి కావడం, తర్వాత మరో అమ్మాయిని ఇష్టపడటం.. చివరిగా తను చేసిన తప్పు తెలుసుకోవడం వంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఇదివరకు కూడా చాలానే వచ్చాయి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరికి దేవుడి తలరాత అనే కాన్సెప్ట్ ను యాడ్ చేసి చూపించారు. నిజానికి ఇది తమిళ సినిమా అయినా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కథ. కానీ, ఈ కథను కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారా అనేదే సవాలు.

  ప్రతి పాత్రకు ఉన్న ప్రాధాన్యత

  ప్రతి పాత్రకు ఉన్న ప్రాధాన్యత

  ఈ సవాలు స్వీకరించిన డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు ఈ కథను తెలుగు నేటివిటీకి తగినట్లు అందంగా మలిచారు. ప్రతి పాత్రకు ఉన్న ప్రాధాన్యత, ఎమోషన్ ను చాలా బాగా చూపించారు. ఒక మనిషి విలువ ముందుగా మనకు దగ్గరగా ఉన్నప్పుడు, చాలా ఈజీగా వచ్చినప్పుడు తెలియదని, మరో కోణంలో వారి జీవితాన్ని చూసినప్పుడు, సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆ విషయం అర్థమవుతుందనే మెసేజ్ ను ఇచ్చారు. ఏం జరిగినా నా తలరాత ఇలా రాశాడు అని దేవుడని తిట్టుకుంటాం. కానీ దానికి కారణం మనమే అని, మనకు జరిగింది మనకోసం అని సంతోషించకుండా, దాని విలువ అర్థం చేసుకోకుండా మరొకరిని (దేవుడు, ఇతర మనుషులు, బంధాలు) నిందిస్తామని ఈ సినిమా ద్వారా చెప్పారు. మనకు లైఫ్ లో సెకండ్ ఛాన్స్ వస్తే జీవితాన్ని సరిదిద్దుకోగలం అనే భావన కన్నా పక్కన ఉన్నవాళ్ల విలువ, మన జీవితంలో జరిగేది మనమంచికే అని భావించాలనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఊహించేలా సీన్లు, క్లైమాక్స్ ఉండటంతో కొంతవరకు నిరాశపర్చవచ్చు

   ఎవరెలా చేశారంటే..

  ఎవరెలా చేశారంటే..


  కథకు తగినట్లు ప్రతి ఒక్కరి పాత్ర అద్భుతంగా చక్కగా కుదిరింది. నటీనటులు వారి పాత్రల్లో చాలా అందంగా ఒదిగిపోయారు. విశ్వక్ సేన్ ఎనర్జీ, ఎమోషనల్ సీన్లలో మంచి నటన కనబర్చాడు. మిథిలా పాల్కర్, ఆశా భట్ పాత్రలకు మంచి స్కోప్ ఉంది. వారు తమ పాత్రల్లో చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలిష్ లాయర్ గెటప్ లో కామెడీ చేసే దేవుడిలా బాగా నవ్వించారు. ఇంతకుముందు గోపాల గోపాల మూవీలో ఆయన మనిషి పాత్ర చేయగా పవన్ కల్యాణ్ దేవుడి పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వెంకటేష్ దేవుడిగా చేసి ఆకట్టుకున్నారు. అయితే లాయర్ గానే ఎక్కువ కనిపించడంతో దేవుడి అనే భావన ఎక్కువగా కలగదు. ఇక మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, వెంకేటష్ కాకుమాను, నాగినీడు తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

  ఫైనల్ గా చెప్పాలంటే..

  ఫైనల్ గా చెప్పాలంటే..


  మనం చేసిన తప్పులకు దేవుడిని నిందిస్తాం. ఆ తప్పుని సరిదిద్దుకోమ్మని దేవుడే వచ్చి వరమిస్తే అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ కథ. బెస్ట్ ఫ్రెండ్ భార్యగా వస్తే ఎలా ఉంటుందని, భార్య భర్తల మధ్య గొడవలకు పరిష్కారం విడాకులు కాదని, లైఫ్ లో సెకండ్ ఛాన్స్ రాదు, మనకు దక్కినదాన్నే సంతోషంగా భావించి జీవించాలని చెప్పేదే ఈ సినిమా. ఇది చెప్పిన మీకు అర్థం కాదు. అర్థం కావాలంటే ఓరి దేవుడా సినిమా చూడాల్సిందే.

  English summary
  Vishwak Sen Venkatesh Mithila Palkar Starrer Ori Devuda Movie Review And Rating In Telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X