twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడియోను మించి వీడియో.. సామజవరగమన కోసం అక్కడి లొకేషన్లలో షూట్

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో అనే చిత్రం ఇప్పటికే ఓ రేంజ్‌లో పాపులర్ అయింది. ఈ మూవీలో నుంచి విడుదలైన సామజవరగమన నిను చూసి ఆగగలనా.. అనే ఈ పాట తెలుగునాట ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో.. చేస్తూనే ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. సోషల్ మీడియాలో కొంగొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తన మాయలో పడేసింది ఈ పాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంగ్ అంతగా వైరల్ అయింది.

    తమన్ బాణీ.. సిరివెన్నెల సాహిత్యం

    తమన్ బాణీ.. సిరివెన్నెల సాహిత్యం

    తమన్ అందించిన బాణీ ప్రత్యేకంగా నిలిచినా.. దానికి ఓ రూపం.. ప్రాణం పోసింది మాత్రం సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమే. సిరివెన్నెల సాహిత్యం అందర్నీ ఆకట్టుకోగా పొద్దికైన పదాలతో అందంగా కూర్చిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే అందరి నోటా వినబడింది.

    రికార్డుల మీద రికార్డులు..

    రికార్డుల మీద రికార్డులు..

    ఆ సమయంలో సైరా ఊపు నడుస్తోన్నా.. సామజవరగమన పాట అందర్నీ తనవైపుకు లాక్కుంది. త్రివిక్రమ్, బన్నీ కలిస్తే సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ కనిపిస్తూనే ఉంటుంది. వారిద్దరి సినిమాలంటే.. మ్యూజిక్ కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చూస్తేనే అది తెలుస్తుంది. అత్యధిక లైకులు సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డులకెక్కింది.. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన లిరికల్ వీడియోగానూ ట్రెండ్ క్రియేట్ చేసింది.

    మ్యూజిక్‌తోనే సెన్సేషన్..

    మ్యూజిక్‌తోనే సెన్సేషన్..

    బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. గ్యాప్ ఇవ్వల.. వచ్చింది అని తన మ్యానరిజంలో బన్నీ చెప్పిన చిన్న టీజర్‌కే సోషల్ మీడియా షేక్ కాగా.. సామజవరగమన, రాములో రాముల పాటలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. సామజవరగమన పాటను ఇప్పటికే 70 మిలియన్ల మంది వీక్షించగా.. 8.95లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటికీ ఇదే రికార్డు. రాములో రాముల పాటను 32 మిలియన్ల మంది చూడగా.. 5.30లక్షల మంది లైక్ కొట్టారు.

    ఆడియోను మించి వీడియో..

    ఆడియోను మించి వీడియో..

    ఆడియో పరంగా ఇంతటి సన్సేషన్ సృష్టించిన ఈ సామజవరగమనను వీడియో పరంగా మరో లెవెల్‌లో ఉండేలా చిత్రీకరించనున్నారట. ఈ మేరకు పారిస్‌లోని అందమైన లొకేషన్లలో ఈ పాటను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ వీడియోను సాంగ్‌ను తెరపై చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందేనని టాక్. సాంగ్ షూట్ కోసం బన్నీ, పూజా హెగ్డేలు ప్యారిస్‌కు చెక్కేశారు. పూజా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సంగతులన్నీ చెప్పేసింది.

    సంక్రాంతి బరిలో హోరాహోరీగా

    సంక్రాంతి బరిలో హోరాహోరీగా

    వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రెండు పెద్ద సినిమాలు దిగబోతోన్నాయి. సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ జనవరి 12పై కర్చీప్ వేసేశారు. అయితే త్రివిక్రమ్, అనిల్ రావిపూడిలపై నమ్మకం ఉన్న ఫ్యాన్స్.. ఈ రెండు చిత్రాలు గ్యారెంటీగా హిట్ అవుతాయని భవిష్యత్తును చెబుతున్నారు. మరి ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌పై ఏవిధంగా దాడి చేస్తాయో చూడాలి.

    English summary
    Ala Vaikunthapurramuloo Team In Paris To Shoot Samaja Varagamana Song. Pooja Hegde Reveals About This Song Shoot. This MOvie Is Directed By Trivikram. And Going To Release On 12th January 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X