Don't Miss!
- News
బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీకి వానగండం; ఈ ప్రాంతాల్లోనే వర్షం పడే ఛాన్స్!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
‘నిశ్శబ్ధం’గా షూటింగ్ ఫినిష్ చేసిన అనుష్క శెట్టి
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నిశ్శబ్ధం'. ఈ మూవీ షూటింగ్ కొన్నిరోజులుగా యూఎస్ఏలో జరుగుతోంది. ఆగస్టు 4తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ మూవీలో సౌత్ స్టార్ మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా కోన వెంకట్ ట్వీట్ చేస్తూ... 'నిశ్శబ్ధం మూవీ షూటింగ్ ఎట్టకేలకు సీటెల్‌లో పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నాం. అనుష్క అభిమానులను తప్పకుండా మెప్పిస్తుంది' అంటూ ట్వీట్ చేశారు.

ఈ చిత్రంలో అనుష్క కళలను ఇష్టపడే వ్యక్తిగా కనిపించబోతోందట. ప్రముఖ నటుడు మాధవన్ వయొలిన్ వాద్యకారుడిగా నటిస్తున్నట్లు సమాచారం. అనుష్క, మాధవన్ మధ్య ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదట. ఇంకా అంజలి, సుబ్బరాజు, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సేన్ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా కోసం అనుష్క స్లిమ్ లుక్‌లోకి మారింది. బరువు తగ్గం కోసమే ఆమె సంవత్సరకాలం సమయం తీసుకుంది. 'బాహుబలి' ప్రాజెక్ట్ తర్వాత అనుష్క సినిమాలు చేయడం తగ్గించేశారు. ఆమె నటించిన చివరి చిత్రం 'భాగమతి' 2018 ప్రారంభంలో విడుదలైంది. నిశ్శబ్ధం 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.