టాలీవుడ్‌కు మరో కొత్త డైరెక్టర్.. 10 కోట్లతో జాన్ సే అంటూ క్రైమ్ థ్రిల్లర్!
సినిమా నిర్మాణానికి ఎన్నడూలేని విధంగా పుష్కలంగా అవకాశాలు పెరగడంతో పరిశ్రమలోకి కొత్త టాలెంట్ వస్తున్నది. వినూత్న ఆలోచనలు, కాన్సెప్ట్, కంటెంట్‌తో వచ్చే దర్శకులను విశేషంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు లోనవుతున్నారు. అలాంటి కోవలోనే సినిమాపై అభిమానం, ప్రేమ, తపనతో ఎస్ కిరణ్ కుమార్ తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
లవ్, ఎమోషన్స్ కలబోసి క్రైమ్ థ్రిల్లర్‌తో జాన్ సే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ వన్‌గా జాన్ సే సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు అందిస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న జాన్ సే (Jaan Se) చిత్రంలో అంకిత్, తన్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతోపాటు లవ్ స్టొరీ కూడా యూత్ కనెక్ట్ కానున్నది. ఈ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. హీరో అంకిత్ గతంలో జోహార్, తిమ్మరుసు లాంటి చిత్రాల్లో నటించాడు.
హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. నూతన నటీనటులతో కంటెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాను భారీ అంటే కనీసం 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడం సినిమా పరిశ్రమలో చర్చకు దారి తీసింది.
నటీనటులు: అంకిత్, తన్వి, సుమన్, అజయ్, తనికెళ్ళ భరణి, సూర్య, భాస్కర్, రవి వర్మ, అయేషా, రవి శంకర్, లీల, బెనర్జీ, రవి గణేష్, రమణి చౌదరి, వంశీ, అంజలి, కిరణ్ కుమార్, ఏ కే శ్రీదేవి, ప్రశాంత్ సమలం, వేణుగోపాల్, తేజ, సంతోష్, వి జే లక్కీ, శ్రీను, అరుణ్
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: ఎస్ కిరణ్ కుమార్
సంగీత దర్శకుడు: సచిన్ కమల్
ఎడిటర్: ఎం ఆర్ వర్మ
లిరిక్స్: విశ్వనాథ్ కరసాల
డీవోపీ: మోహన్ చారీ
డైలాగ్స్: పీ మదన్
పీఆర్వో: బీఏ రాజు's టీం
పబ్లిసిటీ డిజైన్స్: ఏజెఆర్ట్స్ (అజయ్)


Click it and Unblock the Notifications











