నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' మూవీ షూటింగులో గాయపడ్డారు. చిత్రీకరణ జరుగుతుండగా అతడి ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్నగాయమనే కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
చిత్ర బృందం నుంచి అందిన సమాచారం ప్రకారం.... నాని ముక్కు భాగానికి గాయమైనట్లు తెలుస్తోంది. చిన్న గాయమే కావడంతో సెట్స్‌లోనే ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం నాని మళ్లీ షాట్‌కు రెడీ అయ్యారట.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా 1986-1996 బ్యాక్ డ్రాప్‌తో రూపొందించారు. ఇందులో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్నారు. 36 ఏళ్ల వయసులో ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని ప్రయత్నించే ఓ వ్యక్తి కథ ఇది.
''ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ... ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు'' అంటూ ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది. కెరీర్లో ఇప్పటివరకు చేయని ఒక సరికొత్త పాత్రతో నాని ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సితార ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Tollywood star Nani is currently working with Gowtam Tinnanuri for his upcoming sport based drama Jersery, which is progressing at the brisk pace. According to the latest update, Nani’s nose has been injured on the sets of Jersey.
Story first published: Monday, January 28, 2019, 11:23 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more