Don't Miss!
- News
పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సర్కారు వారి పాట ప్రమోషన్స్ కోసం రెండు భారీ ఈవెంట్లు.. మరొకటి ఎందుకంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత ఊహించని విధంగా వెండితెరకు చాలా ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక మొత్తానికి ఏడాదిన్నర అనంతరం సర్కారు వారి పాట తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇటీవల మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు హీరోయిన్ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దర్శకుడు పరశురామ్ అయితే ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. తప్పకుండా సినిమా అయితే మహేష్ బాబు స్థాయిని పెంచే విధంగానే ఉంటుంది అని అంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించినట్లు గా దర్శకుడు వివరణ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక అతిపెద్ద ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన ప్రతిసారీ కూడా విడుదలకు ముందు ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈ సినిమా కోసం మాత్రం రెండు విభిన్నమైన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సినిమాకోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇక ఆ తర్వాత సినిమాకు సంబంధించిన మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి తమన్ కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు సమాచారం. అందుకోసం నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ డేట్స్ కూడా రాబోతున్నాయి.
ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. తప్పకుండా సినిమాను వీలైనంత ఎక్కువగా జనాల్లోకి తీసుకువెళ్లాలి చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే రేపో మాపో ఆ హాలిడేస్ ముగించుకొని స్వదేశానికి రానున్న మహేష్ బాబు వచ్చిన వెంటనే ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో తనదైన శైలిలో ప్రమోషన్స్ మొదలు పెట్టబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
చిత్ర యూనిట్ సభ్యులు అందరితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నట్లు సమాచారం. కీర్తి సురేష్ కూడా ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధమైంది. చూస్తుంటే సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే విధంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.