సినిమాటోగ్రాఫర్ పొరపాటు.. లీకైపోయిన భారీ సినిమా టైటిల్!
ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రపంచం మొత్తం ఏజాయ్ చేసింది. కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్, అద్భుత విన్యాసాలతో సూపర్ హీరోలు అలరించారు.
దీనికి సీక్వెల్ గా మరో చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రాబోతోంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ని మించేలా ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతటి భారీ చిత్ర విశేషాలని చిత్ర యూనిట్ సీక్రెట్ గా ఉంచింది. కానీ సినిమా ట్రోగ్రాఫర్ చేసిన పొరపాటు వలన ఈ చిత్ర టైటిల్ లీకైపోయింది.

ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ ట్రెంట్ ఓపాలోచ్ 'అవెంజర్స్ ఎండ్ గేమ్ అనే పేరుతో ఈ చిత్రానికి సంబంధించి వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. క్షణాల్లో టైటిల్ వైరల్ అయిపోయింది. ఆ తరువాత తేరుకున్న ట్రెంట్ టైటిల్ ని తొలగించాడు. ఆ విధంగా భారీ చిత్ర టైటిల్ అందరికి తెలిసిపోయినట్లయింది.


Click it and Unblock the Notifications











