బ్యాంకాక్ వెళుతున్న వెంకీ, వరుణ్ తేజ్!
టాలీవుడ్ మల్టీస్టార్ చిత్రాల సందడి ఎక్కువ కాబోతోంది. వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ గా మారుతున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తుంన్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. ఈ చిత్రానికి వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకుడు. తాజగా ఈ చిత్రం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర యూనిట్ కీలకమైన షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు.
క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొనివుంది. బ్యాంకాక్ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి చిత్రాలలో వినోదం ప్రధానాంశంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని కూడా అదేవిధంగా తెరకెక్కిస్తూనే ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా చూస్తున్నారు.

వెంకటేష్ సరసన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











