Just In
Don't Miss!
- News
జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మెరిసిన నల్లజాతి యువ కవయిత్రి అమండా గోర్మాన్
- Finance
డిసెంబర్ నెలలో గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే
- Sports
IPL 2021: తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్రైజర్స్ హైదరాబాద్!
- Automobiles
భారత్లో కొత్త వోల్వో ఎస్60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు
- Lifestyle
Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 ట్విట్టర్ లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన హీరోలు.. మెగా హీరోల ముందు అతడు
2020 కరోనా ఒక కొత్త గుణపాఠం నేర్పడంతో పాటు భవిష్యత్తుపై ఒక అవగాహన కూడా కల్పించింది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని అయితే ఎన్నో మలుపులు తిప్పింది. ఇక మరచిపోలేని చేదు అనుభవాలను కూడా మిగిల్చింది. అయితే ఈ ఏడాది ఇంటర్నెట్ ప్రపంచానికి మాత్రం గతంలో ఎప్పుడు లేనంత వాల్యూ పెరిగింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలకు ఫాలోవర్స్ అమితంగా పెరిగారనే చెప్పాలి. ఇక ఈ ఏడాది సౌత్ ఇండియా ట్విట్టర్ రికార్డులలో మన హీరోలు గట్టిగానే సత్తా చాటారు. ఎక్కువమంది ట్వీట్ చేయబడిన చేసిన టాప్ 10 స్టార్స్ లిస్టు వచ్చేసింది.

2020 ట్విట్టర్ హీరోస్..
ట్విట్టర్ ను దాదాపు మన స్టార్ హీరోలందరు ఫాలో అవుతున్నారు. సెలబ్రెటీలకు మరో ఆయుధంగా మారిన ట్విట్టర్ లోనే ఏ విషయన్నైనా కుండా బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. ఈ ఏడాది లాక్ డౌన్ కారణంగా అభిమానులకు సినిమాల పరంగా దూరంగా ఉన్న స్టార్స్ సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. ఇక 2020లో సౌత్ హీరోలలో ఎక్కువగా ట్వీట్ చేయబడిన మెగా హీరోలు ఎక్కువగా నిలవడం విషెస్.

నెంబర్ వన్ స్థానంలో మహేష్
నెంబర్ వన్ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న ట్వీట్ చేసినా కూడా అభిమానులు ఆయన పేరును ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేస్తారు. ఈ సారి మహేష్ పుట్టినరోజుతోనే కాకుండా ఇతర సినీ స్టార్స్ కు కూడా బర్త్ డే విషెస్ అంధించడంతో ఆయన పేరు మారుమ్రోగింది.

రెండవ స్థానంలో పవర్ స్టార్
ఇక రెండవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు. రాజకోయల్లో బిజీగా మారింది తరువాత నేషనల్ పాలిటిక్స్ లలో కూడా పవన్ ప్రస్తావన ఉండడంతో ఈ ఏడాది అతని పేరు కూడా చర్చనీయాంశంగా మారింది. వివిధ అంశాలపై స్పందించడంతో పవన్ కళ్యాణ్ పేరు బాగా ట్రెండ్ అయ్యింది. పైగా ఆ మధ్య వరుసగా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కారణంగా కూడా పవన్ పేరును వైరల్ చేశారు ఫ్యాన్స్.

తక్కువ ట్వీట్స్ వేసినా.. టాప్ 3లో విజయ్
ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సోషల్ మీడియాలో తక్కువగా ట్వీట్స్ వేస్తున్నప్పటికి టాప్ 3లో ఆయన పేరు నిలిచింది. ఎక్కువగా మాస్టర్ హడావిడితో పాటు అభిమానులతో విజయ్ దిగిన సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ మధ్య ఐటి రెయిడ్స్ ద్వారా కూడా విజయ్ పేరు ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

RRR హీరోలు కూడా..
ఇక జూనియర్ ఎన్టీఆర్ RRR టీజర్ తోనే ఈ ఏడాది ఎక్కువగా ట్విట్టర్ లో ట్వీట్ చేయబడ్డాడు. తారక్ నాలుగవ స్థానంలో ఉండగా మరో కోలీవుడ్ హీరో సూర్య 5వ స్థానంలో నిలిచాడు. మరో హీరో అల్లు అర్జున్, రామ్ చరణ్ 6, 7 స్థానాల్లో ట్విట్టర్ అత్యధిక ట్వీట్స్ చేయబడిన నటులలో స్థానం సంపాదించుకున్నారు. 8వ స్థానంలో ధనుష్ నిలిచాడు.

టాప్ 10లో మెగాస్టార్ చిరంజీవి
ఇక ఫైనల్ గా 9వ స్థానంలో మోహన్ లాల్ నిలువగా 10వ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. మెగాస్టార్ ఈ మధ్యనే ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయన ప్రతి సెలబ్రెటీ పుట్టినరోజున శుభాకాంక్షలు అందిస్తు హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సరదాగా ట్వీట్స్ వేస్తున్నారు కూడా. అందుకే మెగాస్టార్ పేరు ట్విట్టర్ టాప్ 10లో నిలిచింది.