Just In
- 4 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 28 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Finance
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 ఉత్తమ ఓటీటీ చిత్రాల జాబితా విడుదల: తెలుగు నుంచి కేవలం ఒకే ఒక్క సినిమాకు చోటు
2020లో చిత్ర పరిశ్రమకు కలిగిన నష్టం అంతా ఇంతా కాదు. కరోనా వైరస్ ప్రభావం వల్ల షూటింగ్‌లు నిలిచిపోవడంతో, చాలా సినిమాల విడుదల వాయిదా పడిపోయింది. కానీ, సినీ ప్రియులకు మాత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా, ఆల్ట్ బాలాజీ, ZEE5 సహా ఎన్నో ఓటీటీ సంస్థలు మజాను పంచాయి. థియేటర్లు మూతపడిన సమయంలో లాక్‌డౌన్‌కు ముందే పూర్తయిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. ఇలా ఈ ఏడాది నేరుగా ఓటీటీలో విడుదలై భారీ విజయాలను అందుకున్న చిత్రాల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమా చోటు దక్కించుకుంది. ఆ వివరాలు మీకోసం.!

సుశాంత్ సినిమాకు మొదటి స్థానం
చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి.. చిన్న వయసులోనే సినీ వినీలాకాశం నుంచి మాయమైపోయాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అతడు నటించిన చివరి చిత్రం ‘దిల్ బెచరా'. కరోనా నేపథ్యంలో ఈ సినిమా డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. అక్కడ భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. 2020లో ఎక్కువ మంది వీక్షించిన ఓటీటీ చిత్రాల లిస్టు తొలి స్థానంలో నిలిచింది.

రెండో స్థానంలో సూర్య హిట్ మూవీ
సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం ‘సూరారై పొట్రు' (ఆకాశమే నీ హద్దురా). ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీ తాజాగా విడుదల చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉంది.

టాప్-5లో నాలుగు వాళ్ల సినిమాలే
అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘లూడో' (నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల) మూడో స్థానంలో ఉంది. అలాగే, రాఘవ లారెన్స్ - అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ' (కాంచన రీమేక్) నాలుగో స్థానాన్ని అందుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ అయిందీ చిత్రం. జాన్వీ కపూర్ ‘గుంజాన్ సక్సెనా.. ద కార్గిల్ గర్ల్' (నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల) ఐదో స్థానంలో నిలిచింది.

ఆరు, ఏడు స్థానాలు కూడా వాళ్లవే
విద్యుత్ జమాల్, శివలేక ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఖుదా హఫీజ్'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. అలాగే, అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గులాబో సితాబో'. భారీ అంచనాల నడుమ అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా ఏడో స్థానంలో ఉంది.
|
తమిళం నుంచి మరో రెండు కూడా
నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మూకుట్టి అమ్మన్'. బాలాజీ, శరవనణ్ సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా.. ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. జ్యోతిక ప్రధాన పాత్రలో జేజే ఫ్రెడ్రిక్ తెరకెక్కించిన చిత్రం ‘పొన్ మంగల్ వందాల్'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు ఈ జాబితాలో పదవ స్థానంలో నిలిచింది.

టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క సినిమా
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘V'. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లు నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. కరోనా నేపథ్యంలో తెలుగు నుంచి ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదల కాగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘V' మాత్రమే ఉత్తమ చిత్రాల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.