Just In
- 1 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 1 hr ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అప్పుడు ‘పెళ్లి సందడి’.. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’.. 24 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బన్నీ
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టైలిష్ హీరోల్లో అల్లు అర్జున్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం అతడు ఎన్నో రకాల స్టైల్స్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడమే. సినిమా సినిమాకూ తనలోని సరికొత్త యాంగిల్‌ను చూపించడంతో అతడికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అదే సమయంలో పలు హిట్లు కూడా అతడి ఖాతాలోకి వచ్చి చేరాయి. దీంతో బన్నీ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇలాంటి సమయంలో 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఔరా అనిపించాడు. అదే సమయంలో పలు రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. తాజాగా ఈ సినిమా 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ కూడా సొంతం
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వీళ్లిద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. అలాగే, ఈ సినిమాతో కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు బన్నీ. ‘బాహుబలి' తర్వాత భారీ విజయాన్ని అందుకున్న చిత్రంగా ఇది నిలిచింది.

ప్రీమియర్ల నుంచే ఊచకోత మొదలైపోయింది
‘అల.. వైకుంఠపురములో' ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అప్పటి నుంచి ఈ మూవీ రూ. 150 కోట్ల పైచిలుకు షేర్ సాధించడంతో పాటు ఓవర్సీస్‌లోనూ 3.5 మిలియన్ మార్కును చేరుకుంది. మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' నుంచి పోటీ ఉన్నా.. ఈ సినిమా సక్సెస్ అవడం విశేషం.

ఎవరినీ వదలని బన్నీ.. గొప్ప పని చేశాడు
బడా సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ ‘అల.. వైకుంఠపురములో' భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. దీంతో అతడు తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులతో పాటు తమ సినిమా విజయానికి తోడ్పడిన డిస్ట్రిబ్యూటర్లు, సినీ ప్రముఖులు, ఫిల్మ్ జర్నలిస్టులకు పార్టీ ఇచ్చాడు. అదే సమయంలో సినీ జర్నలిస్టుల అసోషియేషన్‌కు విరాళం కూడా అందించాడు.

24 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బన్నీ
విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో' తాజాగా ఓ మైలురాయిని అందుకుంది. 24 ఏళ్ల క్రితం విడుదలైన ‘పెళ్లి సందడి' సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా 35ఎమ్ఎమ్ థియేటర్‌లో 232 రోజులకు రూ. 98 లక్షలు వసూలు చేసింది. ఇప్పుడా రికార్డును బన్నీ సినిమా 29 రోజుల్లోనే దాటేసింది. దీంతో ‘అల' అద్భుతమైన ఘనత సాధించినట్లైంది.

అండర్ గ్రౌండ్‌లోకి అల్లు అర్జున్
‘అల.. వైకుంఠపురములో' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే అతడు సుకుమార్ తెరకెక్కించనున్న సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో బన్నీ.. చిత్తూరుకు చెందిన లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడట. ఈ క్రమంలోనే గుబురు గెడ్డంతో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అందుకోసం కొద్ది రోజులు ఎవరికీ కనిపించడట ఈ మెగా హీరో.