For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KBC 13: అమితాబ్‌ షోలో సెహ్వాగ్, గంగూలీ.. బిగ్‌బీ సీటు కబ్జా.. వీరు దాదాతో సౌరబ్ ఫైటింగ్!

  |

  బుల్లితెరపై కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13 మరోసారి తడాఖాను చూపిస్తున్నది. గతంలో అంటే 80వ దశకంలో ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించిన బిగ్‌బీ ఇప్పుడు బుల్లితెరపైన తన రియాలిటీ షో కోసం అభిమానులను ఎదురు చూసేలా చేస్తున్నాడు. ఆగస్టు 28న ప్రారంభమైన కేబీసీ 13 అత్యంత ఆసక్తిగా ఉంటూ దూసుకుపోతున్నది. అయితే ఈ షోలను అమితాబ్ బచ్చన్ ఇద్దరు క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరబ్ గంగూలీని ఆహ్వానించారు. టాప్ క్రికెటర్ల షో ఎప్పుడు ప్రసారం కాబోతున్నది. బిగ్‌బీతో సెహ్వాగ్, గంగూలీ చేసిన రచ్చ ఏమిటనే విషయంలోకి వెళితే..

  Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

  సెహ్వాగ్, గంగూలీ గెస్టులుగా

  సెహ్వాగ్, గంగూలీ గెస్టులుగా

  కేబీసీ ప్రారంభమై కొద్ది రోజులు కాకముందే కంటెస్టెంట్లు తన ప్రతిభను చాటుకొంటూ కోట్ల రూపాయలు గెలుస్తున్నారు. ఈ సీజన్‌లో తొలిసారి గెస్టులుగా ఇండియన్ గ్రేట్ ఓపెనర్స్ సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌ను బిగ్‌బీ ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతున్నది. తాజా ఎపిసోడ్‌లో మధ్య ప్రసారం అవుతున్న ఈ ప్రోమో వారిద్దరి రాక ఎప్పుడా అనే విధంగా ఆసక్తిని రేపుతున్నది.

  Ananya Nagalla : అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా.. బొద్దుగా vs ముద్దుగా!

  సెహ్వాగ్ నోట పాపులర్ పాట

  సెహ్వాగ్ నోట పాపులర్ పాట

  తాజా ప్రోమోలో మైదానంలో సెహ్వాగ్ ఆడేటప్పుడు పాటలు పాడే అలవాటు గురించి అమితాబ్ ప్రస్తావించారు. క్రికెట్ మైదానంలో పాడినట్టే మా షోలో ఓ పాట పాడంటి అంటే ఎలాంటి మొహమాటం పడకుండా ‘చలా జాతా హుం' అనే పాపులర్ హిందీ పాటను లయబద్దంగా పాడి ఎపిసోడ్‌ను కిరాక్ లేపినట్టు కనిపించింది. అలవోకగా బంతిని బౌండరీకి తరలించినట్టు పాటను కూడా అభిమానుల గుండెల్లోకి పంపించినట్టు సెహ్వాగ్ కనిపించారు.

  కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా చూశారా?

  గంగూలీని ఆటపట్టించిన సెహ్వాగ్

  గంగూలీని ఆటపట్టించిన సెహ్వాగ్

  వీరేంద్ర సెహ్వాగ్‌ను మరో ప్రశ్న అడుగుతూ.. క్రికెట్ మైదానంలో క్యాచ్ మిస్ అయితే ఏ పాట కరెక్ట్‌గా సూట్ అవుతుందని అడిగితే.. సౌరభ్ గంగూలీని టీజ్ చేస్తూ.. అప్పుడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉంటే... అప్నీ తో జైసే తైసే.. కట్ జాయేగి పాట చక్కగా సరిపోతుంది అంటూ సౌరవ్ గంగూలీని చూపిస్తూ నీదేం పోతుంది మాస్టారూ.. (ఆప్కా క్యా హోగా జనాబ్ ఏ అలీ) అంటూ సెహ్వాగ్ ఉడికించాడు. దాంతో సౌరబ్ గంగూలీ, అమితాబ్ నవ్వుల్లో మునిగిపోయారు.

  టీమిండియాకు సౌరబ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు గ్రేగ్ ఛాపెల్ కోచ్‌గా అపాయింట్ అయ్యారు. అది కూడా సౌరబ్ సిఫారసుతో కోచ్‌గా నియమించబడ్డాడు. కానీ వారి మధ్య తర్వాత అంతర్గత విభేదాలు తలెత్తడంతో సౌరబ్ తన కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో విషయాలు అమితాబ్, సెహ్వాగ్, గంగూలీ మధ్య చర్చకు వచ్చినట్టు కనిపించింది.

  Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!

  షహెన్‌షా చిత్రంలో ఫేమస్ డైలాగ్‌తో సెహ్వాగ్

  షహెన్‌షా చిత్రంలో ఫేమస్ డైలాగ్‌తో సెహ్వాగ్

  ఇక పాకిస్థాన్‌ లేదా ఆస్ట్రేలియాపై గెలిస్తే.. ఎలాంటి డైలాగ్ కొట్టేవాడివి అంటూ వీరేంద్ర సెహ్వాగ్‌ను అమితాబ్ అడిగితే.. నాకు మీరు (అమితాబ్) నటించిన షహెన్‌ షా సినిమాలోని పాపులర్ డైలాగ్ అంటే అదే ఇష్టం. ఆ డైలాగ్ చాలా పొడువుగా ఉంటుంది. అనగానే.. అమితాబ్ వెంటనే అందుకొంటూ.. నీతో రిలేషన్ విషయానికి వస్తే.. నేను నీకు తండ్రిని అవుతాను (రిస్తే మే తో హమ్ తుమ్హారే బాప్ లగ్తే హై) అనే డైలాగ్‌ను స్వయంగా వినిపించారు. ఇలా ఎన్నో విషయాల మధ్య తదుపరి ఎపిసోడ్ రంజుగా సాగినట్టు కనిపించింది.

  గంగూలీ అందరి సీట్లు కబ్జా చేస్తాడంటూ సెహ్వాగ్ టీజింగ్

  గంగూలీ అందరి సీట్లు కబ్జా చేస్తాడంటూ సెహ్వాగ్ టీజింగ్

  ఇంకా అమితాబ్‌ సీట్లో సౌరబ్ గంగూలీ కబ్జా చేసి కూర్చొని.. జీవితంలో ఎలాంటి కష్టాన్ని మించిన పని కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది.. ఇప్పుడు ఈ హోస్ట్ సీటులో కూర్చోవడం కూడా అలాంటిదే అని సౌరబ్ అంటే.. వెంటనే వీరేంద్ర సెహ్వాగ్‌ మధ్యలో దూరి.. గంగూలీ ఎక్కడికి వెళ్లినా సీటును కబ్జా చేస్తాడు. ఇండియన్ టీమ్‌లో వచ్చి కెప్టెన్ సీటును కబ్జా చేశాడు. బెంగాల్ క్రికెట్ బోర్డులో ప్రసిడెంట్ అయ్యాడు. ఇపుడు బీసీసీఐలో అధ్యక్షుడు అయ్యాడు సెహ్వాగ్.. కరెక్ట్‌గా చెబుతున్నావు అంటూ సౌరభ్ తల ఆడిస్తూ.. సార్.. ఇతడి మాటలు నమ్మకండి అంటూ సౌరబ్ ఫిర్యాదు చేశాడు.

  నన్ను బాగా వాడేస్తాడు అంటూ

  ఇక అంతేకాకుండా.. గంగూలీకి ఎప్పుడు కష్టకాలం వచ్చిన నేను రెడీగా ఉంటాను. నన్నే బాగా వాడుకొంటాడు. ఫైనల్‌ ఓవర్‌లో రన్స్ కొట్టాలంటే నేను కావాలంటాడు. బౌలర్ లేకపోతే నాతో బౌలింగ్ చేయిస్తాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడల్లా నన్నే వాడుకొంటాడు అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దాంతో అమితాబ్ అవునా అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే.. దాంతో గంగూలీ నవ్వుల్లో మునిగిపోయాడు.

  కేబీసీ సీట్లో మీరే గొప్పగా ఉంటారంటూ..

  కేబీసీ సీట్లో మీరే గొప్పగా ఉంటారంటూ..

  చివర్లో ఈ సీటు మీదే.. ఈ చైర్‌లో అందరికంటే మీరే గొప్పగా ఉంటారు అని సౌరభ్ అంటే.. ఎవరేమీ చెప్పిన మీరు మాత్రం ఈ విషయంలో చాలా కరెక్ట్‌గా చెప్పారు అంటూ తన సీట్లోకి మారుపోయారు. దాంతో అమితాబ్ వారిద్దరి పక్కనే కూర్చొబెట్టి ప్రశ్న అడిగితే.. సెహ్వాగ్ సమాధానం చెప్పగా.. అది నేను ఒప్పుకొను అంటూ బెట్ చేశాడు. అమితాబ్ హోస్ట్‌గా సౌరబ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ హోస్టుగా సెప్టెంబర్ 3వ తేదీన 9 గంటలకు ప్రసారం కానున్నది. సినిమా, టెలివిజన్ అప్‌టేడ్స్ కోసం తెలుగు ఫిల్మీబీట్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Bollywood super star Amitabh Bachchan's KBC 13 started on August 23rd. Sourav Ganguly and Sehwag were guest for the show. Sourav Ganguly went teasing Virender Sehwag on the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X