Just In
Don't Miss!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోహిణి కాళ్లు పట్టుకున్న అషూ రెడ్డి.. దూలతీరిందా? అంటూ కౌంటర్
బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతుంటారు. బిగ్ బాస్ వల్ల రెండు రకాలు ఇమేజ్‌లు వస్తాయి. అయితే పాజిటివ్ ఇమేజ్ వస్తుంది.. లేదా నెగెటివ్ ఇమేజ్ అయినా వస్తుంది. అయితే బిగ్ బాస్ ద్వారా ఎక్కువగా లాభపడింది, ఎక్కువగా పాపులర్ అయిన సెలెబ్రిటీలంటే అది మూడో సీజన్ కంటెస్టెంట్లే. మూడో సీజన్ పూర్తై ఏడాది కావొస్తున్నా ఇంకా జనాల నోళ్లలో నానుతూనే ఉంటున్నారు.

అందరూ ఫేమస్..
బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లలో దాదాపు అందరూ బాగానే ఫేమస్ అయ్యారు. మరీ ముఖ్యంగా అలీ రెజా, రాహుల్, హిమజ, శివ జ్యోతి, రోహిణి, అషూ రెడ్డి, వితిక ఇలా ప్రతీ ఒక్కరికి ఫుల్ క్రేజ్ వచ్చింది. అలా వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అలానే మెయింటైన్ చేస్తున్నారు.

పార్టీలతో రచ్చ..
మూడో సీజన్ కంటెస్టెంట్లు ఇంతలా పాపులర్ అవ్వడానికి ఓ కారణం ఉంది. ఏ ఈవెంట్ ఉన్నా, స్పెషల్ పార్టీలున్నా కూడా దాదాపు అందరూ కలుసుకుంటారు. అలా బిగ్ బాస్ ఇంట్లో ఏర్పడిన బంధాలను బయట కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఆ కంటెస్టెంట్లు ఇప్పటికీ లైమ్ లైట్‌లోనే ఉంటున్నారు. అందరూ కలిసి పార్టీలు చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు.

లేడీ గ్యాంగ్..
శివ జ్యోతి, హిమజ, అషూ, రోహిణి ఇలా అందరూ కలిసి చేసే సందడి ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. శివ జ్యోతి ఇంటి గృహ ప్రవేశం, రాహుల్ బర్త్ డే, అలీ రెజా స్పెషల్ పార్టీ, ఇలా ప్రతీ ఒక్క ఈవెంట్‌లో లేడీ గ్యాంగ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ముఖ్యంగా రోహిణి, అషూలు చేసే అల్లరి బాగా వైరల్ అవుతుంటుంది.

ఇద్దరికీ అలా..
రోహిణి, అషూలు ఇద్దరూ కూడా బయట ఆఫర్లతో బిజీగా ఉంటున్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్.. బుల్లితెరపై, జబర్దస్త్ లాంటి షోలతో ఇద్దరూ బిజీగా ఉంటారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఓ ఫన్నీ సంఘటనను రోహిణి షేర్ చేసింది.

కాళ్లు పట్టుకుని..
కారులో కూర్చున్న రోహిణి కాలికి ఏదోఅయినట్టుంది.. కిందకు వంగిన అషూ.. రోహిణి కాళ్లను సరి చేస్తోంది.. అయితే ఈ తతంగాన్నంతా రోహిణి తన కెమెరాలో బంధించింది. కాళ్లు పట్టుకున్న వీడియోను షేర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలా వీడియో తీయడంపై అషూ సెటైర్ వేసింది. వికలాంగులకు నేను ఇలానే సేవ చేస్తాను.. దూలతీరిందా అంటూ రోహిణిపై అషూ కస్సుమంది.