For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  BookMyShow Top Actors 2021: టాప్ 10లో ముగ్గురు టాలీవుడ్ స్టార్స్.. ఈ లిస్టులో అక్కినేని హీరో కూడా!

  |

  ఒకప్పుడు సినిమాలు చూడడానికి వచ్చిన ప్రేక్షకులతో థియేటర్లు అన్నీ కళకళలాడిపోయేవి. దీంతో భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ గలగలలాడిపోయేవి. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. దీనికి కారణం.. కరోనా మహమ్మారి విజృంభించడమే. ఈ వైరస్ వల్ల 2020, 2021లో వరుసగా లాక్‌డౌన్లు విధించారు. దీంతో నెలల తరబడి సినిమాల షూటింగులు నిలిపోవడంతో పాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో చాలా మంది నిర్మాతలకు నష్టాలు ఎదురవడంతో పాటు ఇండస్ట్రీలను నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా తక్కువ మంది నటీనటులు మాత్రమే తమ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇలా 2021లో బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్న వాళ్ల జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి!

  ఒకే సినిమా నుంచి టాప్ 2లోకి

  ఒకే సినిమా నుంచి టాప్ 2లోకి

  పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో అక్షయ్ కుమార్ ఒకడు. ఈ ఏడాది అతడు పలు చిత్రాలు చేశాడు. అందులో 'సూర్యవంశీ' ఒకటి. ఈ చిత్రానికి గానూ బుక్‌మైషోలో 2021లో ఎక్కువ మంది వెతికిన నటీనటుల జాబితాలో అతడు మొదటి స్థానంలో నిలిచాడు. ఇందులో హీరోయిన్ కత్రినా కైఫ్‌కు రెండో ర్యాంక్ దక్కింది.

  Bigg Boss Telugu OTT: జబర్ధస్త్ నటికి బిగ్ బాస్ ఆఫర్.. అప్పుడు మిస్సైంది.. ఇప్పుడేమో ఇలా!

  మూడో స్థానంలో కోలీవుడ్ స్టార్

  మూడో స్థానంలో కోలీవుడ్ స్టార్

  కోలీవుడ్‌లో టాప్ హీరోగా వెలుగొందుతోన్న ఇళయదళపతి విజయ్ బుక్‌మైషోలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీనటుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతడు ఈ ఏడాది 'మాస్టర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

  నాలుగైదు ర్యాంకుల్లో మనోళ్లు

  నాలుగైదు ర్యాంకుల్లో మనోళ్లు

  బుక్‌మైషోలో 2021లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీనటుల జాబితాలో అల్లు అర్జున్ నాలుగో స్థానంలో నిలిచాడు. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'పుష్ప' సినిమాకు గానూ అతడికి ఈ ర్యాంక్ దక్కింది. అలాగే, ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఐదో స్థానంలో నిలిచాడు. అతడు నటించిన 'వకీల్ సాబ్' మూవీ ఈ ఏడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

  Bigg Boss: వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. రిజెక్ట్ చేసి షాకిచ్చాడుగా!

  ఆరో స్థానంలో ఉప్పెన విలన్

  ఆరో స్థానంలో ఉప్పెన విలన్

  కోలీవుడ్‌లో తనదైన శైలి నటనతో స్టార్‌గా వెలుగొందుతున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోన్న అతడు.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన'లో విలన్‌గా నటించాడు. ఈ చిత్రానికి గానూ విజయ్ సేతుపతి బుక్‌మైషోలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీనటుల లిస్ట్‌లో ఆరో స్థానం దక్కింది.

  ఏడు ఎనిమిదిలో భార్యభర్తలు

  ఏడు ఎనిమిదిలో భార్యభర్తలు

  ఈ మధ్య కాలంలో బయోపిక్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచిన కథ నేపథ్యంతో '83' అనే సినిమా వచ్చింది. ఇందులో కపిల్ పాత్రను రణ్‌వీర్ సింగ్, అతడి భార్యగా దీపిక నటించారు. వీళ్లిద్దరూ బుక్‌మైషోలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన యాక్టర్ల జాబితాలో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.

  హాట్ సెల్ఫీ వీడియో వదిలిన శ్రీరెడ్డి: బట్టలన్నీ తీసి పడేసి.. బాగా పెరిగిపోయాయి అంటూ!

  9వ స్థానంలోనూ మన హీరోనే

  9వ స్థానంలోనూ మన హీరోనే


  కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య. యమ ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ ఏడాది 'లవ్ స్టోరి' అనే సినిమాతో అలరించాడు. శేఖర్ కమ్ముల తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు గానూ బుక్‌మైషోలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీనటుల జాబితాలో చైతూ 9వ స్థానంలో నిలిచాడు.

  సూపర్ స్టార్‌కు పదవ స్థానమే

  సూపర్ స్టార్‌కు పదవ స్థానమే

  దక్షిణాదిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోన్న హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. ఆయన ఈ ఏడాది 'అన్నత్తే' అనే సినిమాను చేశారు. శివ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, రజినీకాంత్‌కు మాత్రం బుక్‌మైషోలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీనటుల జాబితాలో పదవ స్థానం దక్కింది.

  English summary
  BookMyShow Recently Released Most Searched Actors List In 2021. Allu Arjun, Pawan Kalyan and Naga Chaitanya Placed in This List.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X