Don't Miss!
- Sports
India vs Australia అహ్మదాబాద్ టెస్ట్‌కు భారత ప్రధాని
- News
దానిని మేం కాదనడంలేదుగా: సజ్జల రామకృష్ణారెడ్డి
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Samson and Delilah విశేషంగా ఆకట్టుకొన్న చిల్కూరి సోదరుల బుర్రకథ..!
మూడు దశాబ్దాలకుపైగా జర్నలిజంలో వినూత్నమైన శైలిని ప్రదర్శిస్తున్న చిల్కూరి సుశీల్ రావు తనలోని కళాత్మక కోణాన్ని, ప్రతిభను చాటుకొన్నారు. తన సోదరులు చిల్కూరి వసంత్ రావు, చిల్కూరి శ్యామ్ రావుతో కలిసి క్రిస్మస్ పండుగ సందర్భంగా బొల్లారంకు సమీపంలోని కౌకూర్‌లో శ్యామ్సన్ అండ్ డెలిలా అనే బైబ్లికల్ స్టోరినీ బుర్రకథగా చెప్పి అందర్నీ ఆకట్టుకొన్నారు. ఇలాంటి బైబ్లికల్ స్టోరిని తొలుత 1978లో జానపద కళాకారులు ఈ బుర్రకథను ప్రదర్శించారు. శ్యామ్సన్ అండ్ డెలిలా అనే కథను ఇప్పటి వరకు హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, వైజాగ్, విజయనగరం, కాకినాడతోపాటు 60కి పైగా ప్రాంతాల్లో ప్రదర్శించడం విశేషం.
శ్యామ్సన్ అండ్ డెలిలా కథను బుర్రకథగా చెప్పడం గురించి చిల్కూరి వసంత్ రావు స్పందిస్తూ.. ఇలాంటి కథను గుర్తు తెచ్చుకొని చెప్పడం సామాన్యమైన విషయం కాదు. తొలుత చిల్కూరి బుర్రకథ బృందానికి సురభి థియేటర్ గ్రూప్ అద్బుతమైన ప్రోత్సాహాన్ని అందించింది. ఈ సాంస్కృతిక ప్రదర్శన కోసం దుస్తులు, ఇతర విషయాల్లో సహాకాన్ని అందించారు అని తెలిపారు.

అతిపురాతనమైన జానపద కళారూపంతో బైబిల్‌లోని నెహెమియా కథను కూడా చెప్పడం విశేషం. పర్వదినాల్లో చర్చిల్లో జరిగే జాతర సందర్భంగా ఇలాంటి కళారూపాలను ప్రదర్శించేవారు అని వసంత్ రావు చెప్పారు.

బుర్రకథను ప్రదర్శించిన వసంత్ రావు చిల్కూరి విషయానికి వస్తే.. ప్రస్తుతం యునైటెడ్ థియాలాజికల్ కాలేజీ బెంగళూరులో ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు శ్యామ్ రావు చిల్కూరి హైదరాబాద్‌లో ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. సుశీల్ రావు సినిమా రంగంలో, మీడియాలో ప్రముఖ పాత్రికేయుడిగా గుర్తింపు పొందడం తెలిసిందే. ఈ ముగ్గురు చిల్కూరి సోదరులు రికార్డు చేసిన తెలంగాణ క్రిస్టియన్ జానపద పాటలను కొన్నేళ్లుగా ప్రదర్శనలు ఇస్తూ తమ ప్రతిభను చాటుకొంటున్నారు. 40 ఏళ్లుగా జానపద కళారూపాన్ని ప్రదర్శిస్తూ.. గొప్ప అనుభూతులను నెమరు వేసుకొంటున్నారు. చిల్కూరి సోదరుల ప్రతిభను, కళాతృష్ణపై అభిమానులు, క్రిస్టియన్ సోదరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అన్నివర్గాల మధ్య సమైక్యతను చాటేందుకు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు.