For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగాస్టార్ గుండు వెనుక రహస్యం ఇదే... కెరీర్‌లో తొలిసారి అలాంటి పాత్రలో చిరు!

  By Manoj Kumar P
  |

  మెగాస్టార్ చిరంజీవి... ఆరవై ఏళ్ల వయసులో కూడా పదహారేళ్ల కుర్రాడిలా ఆడి పాడగల నటుడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా... నేటి తరం వాళ్లకు సరైన పోటీని ఇస్తున్నారాయన. సినిమాలకు వచ్చిన గ్యాప్‌ను మరిపించేందుకు ఆయన వరుస సినిమాలతో సందడి చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సరికొత్త ప్రయోగాలకూ శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గుండుతో దర్శనమించారు. దీంతో ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన గుండు వెనుక రహస్యం తెలిసిపోయింది. ఆ వివరాలు మీకోసం.!

  Megastar Chiranjeevi లేటెస్ట్ లుక్, Ram Charan షాక్ | రజినీ గెటప్ తో పోలిక! || Oneindia Telugu
   కథ అడ్డం తిరిగింది.. చరణ్ రోల్ ఖాయం

  కథ అడ్డం తిరిగింది.. చరణ్ రోల్ ఖాయం

  సైరా తర్వాత ఆచార్య సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరమే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడిపోయింది. దీంతో మెగాస్టార్ ఫ్యూచర్ ప్రాజెక్టులు సైతం మరింత వెనక్కి వెళ్లిపోయాయి. ఇక, ఆచార్యలో రామ్ చరణ్ నటించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ప్రారంభమైతే అతడి పార్ట్‌నే చిత్రీకరిస్తారని సమాచారం.

  చిరంజీవి లైన్ చాలా పెద్దదిగానే ఉందిగా

  చిరంజీవి లైన్ చాలా పెద్దదిగానే ఉందిగా

  ప్రస్తుతం ‘ఆచార్య'లో నటిస్తోన్న చిరంజీవి.. దీని తర్వాత చేయబోయే చిత్రాల విషయంలో పకడ్బందీగా ఉన్నారు. ఇందుకోసం లాక్‌డౌన్ సమయంలోనే కొందరు దర్శకులు చెప్పిన కథలను విన్నారు. అందులో సుజిత్, బాబీ, మెహర్ రమేశ్‌లను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. అయితే, ఈ జాబితా నుంచి ‘సాహో' డైరెక్టర్ నిష్క్రమించినట్లు ప్రచారం జరుగుతోంది.

  రెండు రీమేక్‌లు.. అది మాత్రం కొత్త కథ

  రెండు రీమేక్‌లు.. అది మాత్రం కొత్త కథ

  ‘ఆచార్య' తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాల్లో రెండు రీమేక్‌లు ఉన్నాయి. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్' కాగా, రెండోది తమిళంలో బంపర్ హిట్ అయిన ‘వేదాళం'. ఇక, బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తీసే సినిమా మాత్రం కొత్త కథతో రాబోతుందని తెలుస్తోంది. ‘ఆచార్య' తర్వాత వేదాళం రీమేక్‌ పట్టాలెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

  గుండుతో చిరంజీవి... ఆ మూవీ కోసమే

  గుండుతో చిరంజీవి... ఆ మూవీ కోసమే

  తాజాగా చిరంజీవి గుండుతో కనిపించి షాకిచ్చారు. ఈ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కొద్ది సమయంలోనే బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో చేయబోయే ఓ సినిమా కోసం ట్రయల్ ఫొటో షూట్ చేశారని, అందులో భాగమే ఈ ఫొటో అని కొందరు సినీ ప్రముఖులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం.. ఇది వేదాళం రీమేక్‌ కోసమట.

  కెరీర్‌లో తొలిసారి అలాంటి పాత్రలో చిరు.!

  కెరీర్‌లో తొలిసారి అలాంటి పాత్రలో చిరు.!

  మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... మాతృకలో అజిత్ పొట్టి జుట్టుతో కనిపించాడు. కాబట్టి రీమేక్‌లోనూ చిరు అలాంటి గెటప్‌తో కనిపించాల్సి ఉంటుందట. అయితే, దీనికి భిన్నంగా ఆయన గుండుతో ప్రయోగం చేయబోతున్నారని తెలుస్తోంది. తాజాగా వదిలిన ఫొటో అందులో భాగమేనని సమాచారం.

  English summary
  Vedalam is a 2015 Indian Tamil-language action film written and directed by Siva, and produced by Aishwarya. the film features Ajith Kumar and Lakshmi Menon in the lead roles, with Rahul Dev, Kabir Duhan Singh, Shruti Hassan and Soori in supporting roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X