Don't Miss!
- News
మారుతున్న వైసీపీ అజెండా ! సంక్షేమం నుంచి సామాజిక న్యాయానికి ? కారణాలివే
- Finance
చలామణిలో ఉన్న రూ.2000 నోట్లు 1.6%, రూ.500 నోట్లు 35 శాతం
- Sports
IPL Final 2022: తొలి ఎడిషన్ తర్వాత రాజస్థాన్ మళ్లీ ఇప్పుడే.. ఈసారి ట్రోఫీ గెలవడానికి పుష్కలంగా అవకాశాలు!
- Automobiles
మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అప్పుడు సౌందర్య.. ఇప్పుడు పూజా హెగ్డే.. అన్నయ్య సీన్‌ను రిపీట్ చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు కొద్ది రోజులే మిగిలింది. అయితే సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు. అయితే ప్రెస్ మీట్‌లో చిరంజీవి ఉత్సాహంగా, చలాకీగా, హుషారుగా, చిలిపిగా సినిమా జర్నలిస్టులతో జోకుల వేస్తూ సరదాగా కనిపించారు. అయితే పూజా హెగ్డేతో చిరంజీవి చేసిన చిన్న ఝలక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్'గా మారింది. ఆ సరదా సన్నివేశం వివరాల్లోకి వెళితే..

చిరంజీవి పక్కనే పూజా హెగ్డే
ఆచార్య సినిమా మీడియా ప్రెస్ మీట్ కోసం అందరికంటే ముందే పూజా హెగ్డే వచ్చి కూర్చొని మీడియాతో సరదాగా చిట్ చాట్ చేస్తూ కనిపించింది. ఆ తర్వాత చిరంజీవి, రాంచరణ్, కొరటాల శివ రావడంతో లేచి విష్ చేసి పక్కన కూర్చోబోతే. రాంచరణ్ వచ్చి..ఆమెను చిరంజీవి పక్కనే కూర్చొబెట్టారు. అయితే పూజా హెగ్డేను వేదికపైకి పిలువగానే.. ఆమె లేచి వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే పూజా చీర కొంగు చిరంజీవి కాలు కింద పడటంతో తట్టుకోవడంతో ఆమె ఆగిపోయింది. అది గమనించిన చిరంజీవి ఠక్కున కాలు తీయడంతో పూజా నవ్వుకొంటూ వెళ్లిపోయింది.

చిరంజీవిపై పూజా హెగ్డే ఫిదా
అయితే వేదికపై చిరంజీవితో పూజా హెగ్డే చాలా సరదాగా కనిపిస్తూ మాట్లాడింది. చిరంజీవి, రాంచరణ్ డ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. రాంచరణ్ బాడీతో చేసే డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. కానీ చిరంజీవి బాడీతోపాటు ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్, ఫీలింగ్‌తో చూపించే గ్రేస్ సూపర్‌గా ఉంటుంది. అందరూ ఏదో విధంగా కదిలి డ్యాన్స్ చేస్తే.. చిరంజీవి కేవలం ముఖంతోనే డ్యాన్స్‌తో గ్రేస్ తెస్తారని పూజా హెగ్డే చెప్పింది.

పూజాతో చిరు రొమాంటిక్‌గా
ఇక మీడియాతో ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత.. రాంచరణ్, చిరంజీవి, పూజా హెగ్డే, కొరటాల ఫోటోలకు ఫోజిచ్చారు. అయితే పూజా హెగ్డే, చిరంజీవి ఇద్దరు కలిసి దిగమని ఫోటోగ్రాఫర్లు అడిగితే.. ఆమె కోసం చూడగా.. రాంచరణ్, పూజా ఇద్దరూ వెళ్లిపోతూ కనిపించారు. అయితే చిరంజీవి రొమాంటిక్‌గా గాలిలో చేతులు కదుపుతూ పూజా హెగ్గేను లాగేందుకు ప్రయత్నించారు. అదీ చూసిన రాంచరణ్.. పూజాను చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లాడు.

పూజాకు స్వీట్ హగ్
వేదికపై
తన
వద్దకు
వచ్చిన
పూజా
హెగ్డేను
అప్యాయంగా,
ప్రేమతో
దగ్గరకు
తీసుకొన్నారు.
చిలిపిగా
తన
దగ్గరకు
తీసుకొని
స్వీట్
హగ్
ఇచ్చాడు.
దాంతో
పూజా
హెగ్డే
బుగ్గలు
ఎరుపెక్కాయి.
చిరంజీవి
ఉత్సాహం
చూసి
ఆమె
రెండు
చేతులు
ఎత్తి
మొక్కింది.
ఇలా
చిరంజీవి
రొమాంటిక్
మూమెంట్
చూడగానే
అన్నయ్య
చిత్రంలో
సౌందర్యతో
చేసిన
సీన్
అందరికీ
గుర్తు
వచ్చింది.
|
చిరంజీవి జోవియల్ అంటూ
ఇక
చిరంజీవితో
రొమాంటిక్
మూమెంట్స్‌తో
పూజా
హెగ్డే
కూడా
థ్రిల్
అయ్యారు.
చిరంజీవితో
వేదికపై
దిగిన
ఫోటోలకు
సంబంధించిన
వీడియోను
తన
ట్విట్టర్
ఖాతాలో
షేర్
చేసింది.
స్వీటెస్ట్
అండ్
ఎవర్
జోవియల్
చిరంజీవి
గారు
అంటూ
పూజా
హెగ్డే
ట్వీట్
చేసింది.