దేవదాస్ రిలీజ్‌కు ముందే రికార్డు.. నాని, నాగార్జున కెరీర్‌లోనే..
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన దేవదాస్ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్లు చేసిన మ్యాజిక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. శమంతకమణి ఫేమ్ శ్రీరాం ఆదిత్య రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో అందాల భామలు రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే నాని, నాగార్జున ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నారు. అదేమిటంటే..
దేవదాస్ చిత్రం అమెరికాలో నాని, నాగార్జునకు అతిపెద్ద రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీమియర్లు 180 లొకేషన్లలో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని ఫైహై సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. ఇది ఇద్దరి హీరోల కేరీర్‌లోనే అత్యధికం.

సినీ మార్క్ మూవీ క్లబ్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నది. ఈ క్లబ్‌లో నమోదు చేసుకొన్న వారికి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా ఇస్తున్నది. ఇతర టికెట్లపై సుమారు ఐదు డాలర్ల డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తున్నది.


Click it and Unblock the Notifications











