For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డైరెక్టర్ సుకుమార్ గొప్ప మనసు: సొంత ఊరి కోసం చాలా మంచి పని.. జనసేన ఎమ్మెల్యేతో కలిసి ఇలా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ దర్శకుల్లో లెక్కల మాస్టారు సుకుమార్ ఒకరు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ఆయన.. సుదీర్ఘ కాలం పాటు పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. ఈ క్రమంలోనే 2004లో 'ఆర్య' సినిమాతో దర్శకుడిగా మారారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ తన సొంత ఊరి కోసం ఓ గొప్ప పని చేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   గొప్ప చిత్రాలు... డుయల్ రోల్స్

  గొప్ప చిత్రాలు... డుయల్ రోల్స్

  ఫస్ట్ మూవీ ‘ఆర్య'తో భారీ హిట్‌ను అందుకున్న సుకుమార్.. ఆ తర్వాత సుదీర్ఘమైన కెరీర్‌లో ‘100% లవ్', ‘నాన్నకు ప్రేమతో', ‘రంగస్థలం' వంటి సూపర్ డూపర్ సక్సెస్‌లను అందుకున్నారు. అదే సమయంలో నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గానూ మారి పలు చిత్రాలకు పని చేశారు. వాటిలో ‘కుమారి 21F' ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. ఇలా ఎన్నో రకాలుగా చిత్ర సీమకు సేవలు అందిస్తున్నారు.

  మహేశ్ - రాజమౌళి మూవీపై సంచలన వార్త: బడా ప్రాజెక్టులో మరో స్టార్ హీరో.. దాని తర్వాత ప్రకటన

  అల్లు అర్జున్‌తో ‘పుష్ప' సినిమా

  అల్లు అర్జున్‌తో ‘పుష్ప' సినిమా


  సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప' అనే సినిమాను చేస్తున్నారు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది.

  సొంత ఊరి కోసం గొప్ప కార్యం

  సొంత ఊరి కోసం గొప్ప కార్యం

  టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా వెలుగొందుతోన్న సుకుమార్ సొంత ఊరైన మలికిపురం మండలం మట్టపర్రు అండగా ఉంటున్నారు. ఆ గ్రామానికి ఎప్పటి నుంచో కనీస సౌకర్యాలను కల్పిస్తోన్న ఆయన.. ఆపదల సమయంలో అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆ ఊరిలో తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు పేరు మీద ఓ స్కూల్‌ను నిర్మించారు.

  స్కూల్‌కు ఈరోజే ముహూర్తం

  స్కూల్‌కు ఈరోజే ముహూర్తం


  రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామ వాస్తవ్యులు అయిన సుకుమార్.. ఇటీవల గ్రామంలో ఓ పాఠశాలను నిర్మించారు. దీనికి సుమారు రూ. 18 లక్షల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఆయనే స్వయంగా భరించారు. ఇక, ఈ స్కూల్ బిల్డింగ్‌ను ఆగస్టు 1 అంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నారు.

  జనసేన ఎమ్మెల్యే.. మంత్రులు

  జనసేన ఎమ్మెల్యే.. మంత్రులు

  సుకుమార్ నిర్మించిన పాఠశాల భవనాన్ని రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున గెలుపొందిన రాపాక వరప్రసాదరావు ప్రారంభించబోతున్నారు. అలాగే, దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణలతో పాటు అమలాపురం ఎంపీ అనురాధ విచ్చేస్తున్నారు.

  ఘాటు ఫొటోలతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్: అబ్బా అనిపించేలా ఫోజులు.. మామూలుగా లేవుగా!

  Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
  సుకుమార్‌పై ప్రశంసల వర్షం

  సుకుమార్‌పై ప్రశంసల వర్షం

  సొంత ఊరికి సేవ చేయాలన్న భావనతో భారీ ఖర్చుతో పాఠశాలను నిర్మించిన దర్శకుడు సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈరోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనను ప్రభుత్వం తరపున సన్మానించనున్నారని తెలుస్తోంది. అలాగే, సోషల్ మీడియా వేదికగా సుకుమార్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని మిగిలిన వాళ్లకు చెబుతున్నారు.

  English summary
  Indian film director, producer, and screenwriter Sukumar Bandreddi Being Star in Tollywood. Recently He Built a School in his Village. Today Afternoon This School will be Open.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X