Happy Birthday Naga Chaitanya: సామ్‌తో లవ్ అక్కడే మొదలు.. చైతూ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?

'జోష్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. మొదటి సినిమాలోనే మెప్పించి పలు అవార్డులు సైతం అందుకున్నాడు. బడా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా.. స్వశక్తితో పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే సమంతతో ప్రేమాయణం సాగిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. నేడు (నవంబర్ 23) నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం.!

Recommended Video

Naga Shaurya Second Banner, Ira Cinemas
 సినిమాల్లోకి ఎంట్రీ అలా జరిగింది

సినిమాల్లోకి ఎంట్రీ అలా జరిగింది

చైన్నైలో పుట్టి పెరిగిన నాగ చైతన్య గ్రాడ్యువేషన్‌ను మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. ఆ సమయంలోనే తండ్రి నాగార్జునతో తన కెరీర్ గురించి మాట్లాడాడు. ఆ సందర్భంలో తనకు హీరో అవ్వాలనుందని మనసులోని మాటను బయట పెట్టాడు. అందుకు అనుగుణంగానే చాలా కాలం పాటు నటన, డైలాగ్స్, ఫైట్స్ తదితర విభాగాల్లో శిక్షణ ఇప్పించి సినిమాల్లోకి తీసుకొచ్చారు.

జోష్ నుంచి వెంకీ మామ వరకు

జోష్ నుంచి వెంకీ మామ వరకు

2009లో వచ్చిన ‘జోష్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఆ తర్వాత సుదీర్ఘమైన కెరీర్‌లో 17 సినిమాల్లో నటించాడు. వీటిలో ‘ఏమాయ చేశావే', ‘100% లవ్', ‘మనం', ‘ప్రేమమ్', ‘రారండోయ్ వేడుక చూద్దాం', ‘మజిలీ', ‘వెంకీమామ' వంటి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మిగతావి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అలాగే కొన్నింటిలో అతిథి పాత్రల్లో కనిపించాడు.

సూపర్ హిట్ మిస్.... ఇష్టాలివే

సూపర్ హిట్ మిస్.... ఇష్టాలివే

వాస్తవానికి నాగ చైతన్య ‘కొత్త బంగారు లోకం'తో హీరోగా పరిచయం అవ్వాలి. కానీ, మొదటి సినిమాను లవ్ స్టోరీతో కాకుండా సందేశాత్మకంగా చేయాలని నాగార్జున భావించారు. దీంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇదిలాఉండగా, చైతన్యకు రేస్‌లు అంటే చాలా ఇష్టం. అలాగే, సంగీతం అంటే పిచ్చి. ఖాళీ సమయంలో రైడింగ్‌తోనే, మ్యూజిక్‌తోనే, వ్యాయామంతోనే గడుపుతుంటాడు.

సామ్‌తో లవ్ అక్కడే మొదలు

సామ్‌తో లవ్ అక్కడే మొదలు

సమంత.. నాగ చైతన్య కలిసి ‘ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫొటోను తొలిసారి చూశాడట. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. కానీ, ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక, తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న సమయంలోనే దీన్ని రివీల్ చేశారు.

మూడు ముళ్ల బంధంతో ఒక్కటి

మూడు ముళ్ల బంధంతో ఒక్కటి

సమంతతో పెళ్లికి నాగ చైతన్య తండ్రి నాగార్జున వెంటనే ఓకే చెప్పేశారు. దీంతో 2017 అక్టోబర్‌లో వీళ్లిద్దరూ పెద్దల సాక్షిగా హిందూ క్రిస్టియన్ పద్దతుల్లో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ హాలిడే ట్రిప్‌లను ఎంజాయ్ చేస్తుండడంతో పాటు కెరీర్‌ను కూడా సాఫీగా నడిపించుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

బర్త్‌డే కోసం అక్కడికి వెళ్లారు

బర్త్‌డే కోసం అక్కడికి వెళ్లారు

నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపే సమంత, చైతన్య.. ఖాళీ సమయంలో మాత్రం ఏదో ఒక దేశం చెక్కేస్తుంటారు. ఈ క్రమంలోనే పుట్టినరోజు వేడుకల కోసం ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, సోషల్ మీడియాలో యువ సామ్రాట్‌కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X