For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Father's Day: తండ్రి కొడుకు కలిసి నటించిన సినిమాలివే.. ఆ రికార్డు మాత్రం మహేశ్, నాగార్జునదే

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పాత తరం నుంచి నేటి వరకూ ఎంతో మంది స్టార్లు తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. అందులో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతూ వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. తద్వారా తమ తండ్రుల పేర్లను కూడా నిలబెడుతున్నారు. ఇప్పటికీ కొంత మంది స్టార్లు తమ కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో తమ వారసులతో కలిసి సినిమాల్లో నటిస్తున్నారు కూడా. ఇలా ఇప్పటి వరకూ తండ్రి, కొడుకులు కలిసి నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే. దీన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, తమ వారసులతో కలిసి నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం పదండి!

  బాలయ్యను తీసుకొచ్చిన ఎన్టీఆర్

  బాలయ్యను తీసుకొచ్చిన ఎన్టీఆర్

  నందమూరి బాలకృష్ణ 14వ ఏటనే 'తాతమ్మకల' అనే సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యారు. దీన్ని తెరకెక్కించింది, ఇందులో హీరోగా నటించింది ఆయన తండ్రి ఎన్టీఆరే. దీని తర్వాత 'అన్నాదమ్ముల అనుబంధం', 'వేములవాడు భీమకవి', 'దాన వీర సుర కర్ణ', 'అక్బర్ సలీం అనార్కలీ', 'వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' వంటి చిత్రాల్లో కలిసి చేశారు.

  హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులు

  నాగార్జునతో ఏఎన్నార్ సినిమాలు

  నాగార్జునతో ఏఎన్నార్ సినిమాలు

  అక్కినేని నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని నాగేశ్వర్రావు నటించిన రెండు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. హీరోగా మారిన తర్వాత 'కలెక్టర్ గారి అబ్బాయి', 'అగ్నిపుత్రుడు', 'రావుగారిల్లు', 'ఇద్దరూ ఇద్దరే', 'మనం' వంటి చిత్రాల్లో వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్ అవడంతో వీళ్ల కాంబోకు పేరొచ్చింది.

  మహేశ్‌ను పరిచయం చేసిన కృష్ణ

  మహేశ్‌ను పరిచయం చేసిన కృష్ణ

  సూపర్ స్టార్ కృష్ణ.. మహేశ్ బాబును 'నీడ' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేశారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి 'పోరాటం', 'శంఖారావం', 'బజారు రౌడీ', 'గూడఛారి 117', 'కొడుకు దిద్దిన కాపురం', 'అన్నా తమ్ముడు', 'బాలచంద్రులు' అనే మూవీలు చేశారు. ఇక, 'ముగ్గురు కొడుకులు' మూవీలో కృష్ణ మరో కొడుకు రమేశ్ కూడా నటించాడు.

  మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోత

  కొడుకులిద్దరితోనూ మోహన్ బాబు

  కొడుకులిద్దరితోనూ మోహన్ బాబు

  డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తన ఇద్దరు కొడుకులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. అందులో మంచు మనోజ్ 'మేజర్ చంద్రకాంత్' సహా పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే, విష్ణు హీరోగా అయిన తర్వాత మోహన్ బాబుతో కలిసి 'రౌడీ' అనే సినిమాలో నటించాడు. అలాగే, మనోజ్ 'పాండవులూ పాండవులూ తుమ్మెద' అనే చిత్రంలో కలిసి నటించారు.

  రామ్ చరణ్‌.. చిరంజీవి చిత్రాలు

  రామ్ చరణ్‌.. చిరంజీవి చిత్రాలు

  మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుమారుడిని సినిమాల్లోకి పరిచయం చేశారు. అతడు నటించిన 'మగధీర'లో ఓ పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత 'బ్రూస్‌లీ'లోనూ స్పెషల్ రోల్ చేశారు. ఇక, చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150'లో రామ్ చరణ్ ఓ పాటలో డ్యాన్స్ చేశాడు. అలాగే, ఇటీవలే వీళ్లు 'ఆచార్య'లో కలిసి నటించిన విషయం తెలిసిందే.

  హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్

  పెదనాన్నతో ప్రభాస్ సినిమాలు

  పెదనాన్నతో ప్రభాస్ సినిమాలు


  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు కృష్ణంరాజు పెదనాన్న అవుతారన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ గతంలో 'బిల్లా', 'రెబెల్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. అయితే, ఈ రెండూ దురదృష్టవశాత్తూ పరాజయం పాలయ్యాయి. ఇక, ఇటీవలే 'రాధే శ్యామ్'లోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇవి మాత్రమే కాదు.. ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లోనూ ఆయన నటించనున్నారు.

  మహేశ్, నాగార్జున క్రేజీ రికార్డులు

  మహేశ్, నాగార్జున క్రేజీ రికార్డులు


  తమ తండ్రితో కలిసి నటించిన హీరోలు కొడుకులతోనూ కలిసి నటించిన సందర్భాలు టాలీవుడ్‌లో చాలా తక్కువే అని చెప్పాలి. అయితే, తన కొడుకు అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్', నాగ చైతన్య 'బంగార్రాజు'లో నాగార్జున నటించాడు. అలాగే, మహేశ్ బాబు తన కొడుకు గౌతమ్‌ను '1 నేనొక్కడినే' సినిమాతో పరిచయం చేశాడు. ఇలా ఈ స్టార్లు రికార్డును క్రియేట్ చేశారు.

  English summary
  Today World Father's Day. On The Occasion of This Special Day.. Let we Know about Tollywood Heroes Done Movies With Their Fathers and Sons.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X