»   » అంబానీ కూతురు నిశ్చితార్థం: ఇటలీలో బాలీవుడ్ తారలు, ప్రియాంక-నిక్... జాహ్నవి లుక్ కేక!

అంబానీ కూతురు నిశ్చితార్థం: ఇటలీలో బాలీవుడ్ తారలు, ప్రియాంక-నిక్... జాహ్నవి లుక్ కేక!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Priyanka Chopra & Nick Jonas Were Spotted At Isha Ambani’s Engagement

  ఇండియాలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ నిశ్చితార్థం అజయ్ పిరమాల్‌ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో వైభవంగా జరిగింది. ఇందుకు ఇటలీలోని లేక్ కోమో వేదికైంది. మూడు రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుండి ముఖ్యమైన వ్యక్తులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.

  ఇషా, ఆనంద్ చదువుకునే రోజుల నుండే స్నేహితులు. వారి కుటుంబాల మధ్య కూడా 4 దశాబ్దాల పరిచయం ఉంది. ఇషా తండ్రి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా, ఆనంద్ తండ్రి అజయ్ పిరమాల్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. ఇషా-ఆనంద్ వివాహం ఈ ఏడాది నవంబర్లో జరుగబోతోంది. గత మే నెలలో మహాభలేశ్వరంలోని గుడిలో ఇషాకు ఆనంద్ ప్రపోజ్ చేశాడట.

   ప్రియాంక-నిక్

  ప్రియాంక-నిక్

  ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్...... ఇటలీలోని ఇషా-ఆనంద్ ఎంగేజ్మెంట్ వేడుకకు జంటగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు ధరించారు.

  ప్రియాంక చోప్రా

  ప్రియాంక చోప్రా


  ప్రియాంక చోప్రా ఎంబెల్లిష్డ్ పాస్టల్ సారీ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సారీలో ప్రియాంక డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

  బ్లాక్ షెర్వానీలో నిక్

  బ్లాక్ షెర్వానీలో నిక్


  త్వరలో ప్రియాంకను పెళ్లాడబోతున్న అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాష్.... ప్రత్యేకంగా డిజైన్ చేసిన షేర్వానీలో హ్యాండ్సమ్ లుక్‌లో దర్శనమిచ్చాడు.

  అనిల్ కపూర్

  అనిల్ కపూర్

  ఇషా, ఆనంద్ నిశ్చితార్థ వేడుకలో బాలీవుడ్ సినీయర్ నటుడు అనిల్ కపూర్. బ్లాక్ కలర్ సూట్లో అనిల్ కపూర్ స్టైలిష్ లుక్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.

  భర్తతో కలిసి సోనమ్ కపూర్

  భర్తతో కలిసి సోనమ్ కపూర్

  సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా దంపతులకు కూడా ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు ఆహ్వానం అందింది. ఇటలీలోని వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోనమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

  జాహ్నవి లుక్ అదుర్స్

  జాహ్నవి లుక్ అదుర్స్

  బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ గౌనులో అందాల దేవతలా మెరిసిపోయింది. జాహ్నవి ఈ గౌనుకు మరింత అందాన్ని తెచ్చిదంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.

  English summary
  We had reported you that today (September 21, 2018), Nita and Mukesh Ambani's lovely daughter, Isha Ambani will be getting engaged to Anand Piramal in Italy at Lake Como. Isha Ambani and Anand Piramal, were friends for a long time before the Piramal heir proposed to her at a temple in Mahabaleshwar. Many Bollywood celebrities including Khushi Kapoor, Manish Malhotra and Sandeep Khosla have already arrived at the venue and we're here with stunning pictures of Priyanka Chopra and Nick Jonas. Yes. The duo is there too!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more