For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ 3 చిత్రాలకు 950 కోట్లు... భారీ బడ్జెట్... బాక్సాఫీన్ ను షేక్ చేసేనా!!

  |

  మన డార్లింగ్ హీరో ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్లకు సైతం ముచ్చెమటలు పట్టించేస్తున్నాడు. కేవలం ఏడాది గడువులోనే చకచకా మూడు చిత్రాలకు సంతకాలు చేసేశాడు. ఆఁ... ఇందులో ఏముందిలే అని తేలిగ్గా తీసుకోకండి. అబ్బాయి ఓకే చేసిన సినిమాలు సాదాసీదావి కాదు మరి. ప్రభాస్ స్టార్ డమ్ ను నమ్ముకుని నిర్మాతలు ఈ మూడింటిపై కోట్లు గుమ్మరించేస్తున్నారు అంటే అవి ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

   అటు ఇటుగా వెయ్యికోట్లే...!

  అటు ఇటుగా వెయ్యికోట్లే...!

  నిజమే మరి, బాహుబలి సూపర్ సక్సెస్ తరువాత భారత సినిమాకు కొత్త సూపర్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ పై పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారనే చెప్పాలి. బాహుబలి తరువాత వచ్చిన సాహో.. నెగిటివ్ రివ్యూస్ పొందినప్పటికీ, సినిమా కలెక్షన్స్ మాత్రం అదరిపోయనే చెప్పాలి. ఈ క్రేజ్ ఏ స్టేజ్ కు చేరుకుందంటే... ప్రభాస్ ఈ ఏడాది ఒప్పుకున్న 3 చిత్రాలూ.. అక్షరాలా 950 కోట్ల రూపాయిలతో తెరకెక్కబోతున్నాయట.

   రాథేశ్యామ్ - బడ్జెట్ 300 వందల కోట్లు

  రాథేశ్యామ్ - బడ్జెట్ 300 వందల కోట్లు

  ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా అది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. 1970 బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ పీరియడ్ డ్రామా, ఐరోపాలో తరకెక్కబోతోంది. రాథా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే, సచిన్ కేడేకర్, మరళి శర్మ, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, సాషా చెత్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

  ప్రభాస్ 21- 400 కోట్లు

  ప్రభాస్ 21- 400 కోట్లు

  సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా టైమ్ ట్రావెలింగ్ పై రూపొందుతోందన్న సంగతి తెలిసిందే. వైజయంతి ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుండగా, బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోనే ప్రభాస్ కు జోడీగా నటిస్తుండటం మరో విశేషమనే చెప్పాలి. నాగ్ అశ్విన్ కథకు ఇంప్రెస్ అయిన నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాపై వందల కోట్ల రూపాయిలు పెట్టుబడి పట్టాల్సి వస్తుందని, అయితే అంతటి భారీ ప్రాజెక్ట్ ను కేవలం ప్రభాస్ మాత్రమే ముందుకు నడిపించగలడని స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  Creative Criminals Movie Opening | ప్రభాస్ నిమ్మల దర్శకత్వం లో..!!
  ఆది పురుష్ - 250 కోట్లు

  ఆది పురుష్ - 250 కోట్లు

  ఇక కొద్ది రోజుల క్రితం తానాజీ దర్శకుడు ఓమ్ రౌత్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన వైనం ఏ విధంగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. రామాయణ ఇతిహాసమే ఇతివృత్తంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా 3D రూపంలో అలరించబోతుండటం మరో విశేషం. ఇక ఆదిపురుష్ లోని లీడ్ రోల్ చేయడం గర్వంగా ఉందంటూ డార్లింగ్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. మొత్తానికి అంతా కలిపి ప్రభాస్ పై 950కోట్లు బిజినెస్ నడుస్తోందనే చెప్పాలి. మరి ఈ భారీ పెట్టుబడిని డార్లింగ్ రెండింతల రాబడి తీసుకువస్తాడేమో చూడాలి.

  English summary
  Prabhas next 3 films cost a bomb as the darling hero's up coming films are touted to be made up with a whooping sum of Rs. 950 crores. All eyes on Prabhas lavish projects
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X