twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Mahesh Babu: తిరుగులేని సూపర్ స్టార్‌గా.. బాక్సాఫీస్‌ ఆటాడించే పోకిరి!

    |

    ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా తెలుగు చిత్రపరిషమలో అడుగుపెట్టిన మహేష్ బాబు అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అయితే అందుకుంటాడు. ఇక మహేష్ బాబు నేడు 47 వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విషెస్ కూడా అందిస్తున్నారు. ఇక మహేష్ బాబు యాడ్స్ సంపాదన పారితోషికాల విషయానికి వెళ్తే..

     దర్శకుల హీరో

    దర్శకుల హీరో

    సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని తెలుగు చిత్ర పరిశ్రమంలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా స్టార్ దర్శకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ కూడా టాలెంట్ ఉన్న దర్శకులతో సినిమా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చిన్నదర్శకుడైన సరే మంచి కంటెంట్ వస్తే మహేష్ సినిమా చేయడానికి ముందుగానే ఆఫర్ కూడా ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే దర్శకుడు ఏం చెబితే అది చేస్తాడు. అందుకే మహేష్ ను డైరెక్టర్స్ హీఓ అంటుంటారు.

    ఇండస్ట్రీలో రికార్డులు

    ఇండస్ట్రీలో రికార్డులు

    మురారి సినిమాతో ఫామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైన మహేష్ బాబు ఆ తర్వాత ఒక్కడు సినిమాతో మాస్ కు మరింత దగ్గర అయ్యాడు. ఇక పోకిరి, దూకుడు,శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతోకొంత కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ చేసినవే.

     యాడ్స్ తోనే ఇల్లు

    యాడ్స్ తోనే ఇల్లు

    అయితే మహేష్ బాబు ఖలేజా టైంలో మాత్రం కొంత చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో మహేష్ బాబు కథలను సెలెక్ట్ చేసుకోవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. కానీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అతను ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ చేశాడు. ఒక విధంగా మహేష్ ఆ సమయంలో యాడ్స్ చేయడం వల్లే తాను ఒక ఇల్లు కొనుగోలు చేశాను అని తెలియజేయడం విశేషం.

    యాడ్స్ రెమ్యునరేషన్

    యాడ్స్ రెమ్యునరేషన్

    మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ చేయడానికి ప్రస్తుతం 15 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు ఆ రేటు అంతకంటే ఎక్కువ కూడా పెరుగుతుంది అని టాక్. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు ఇమేజ్ నేషనల్ వైడ్ గా పెరిగిపోయింది. ఇక అందుకు తగ్గట్టుగానే మహేష్ కూడా బడా కంపెనీలతో డీల్స్ సెట్ చేసుకుంటున్నాడు.

     త్రివిక్రమ్ ప్రాజెక్ట్

    త్రివిక్రమ్ ప్రాజెక్ట్


    ఇక మహేష్ బాబు తదుపరి సినిమాలకు తన కెరీర్ లోనే అత్యధిక పారితోషకం అందుకోబోతున్నాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. హారిక హాసిని నిర్మించబోతున్న ఆ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 70 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం.

    Recommended Video

    Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
    రాజమౌళి దర్శకత్వంలో

    రాజమౌళి దర్శకత్వంలో

    ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా బడ్జెట్ దాదాపు 300 కోట్లకు పైగానే ఉండవచ్చు అని సమాచారం. ఇక మహేష్ బాబు పారితోషికం కూడా 75 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుందట. మరి ఆ సినిమా సక్సెస్ తరువాత మహేష్ నెంబర్ ఇంకా ఏ స్థాయికి పెరుగుతుందో చూడాలి.

    English summary
    Mahesh babu birthday special upcoming movies and remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X