సితారను చూసి గర్వపడుతున్నా.. ప్రేమను కురిపించిన మహేష్

మహేష్ బాబు కుటుంబానికి ఎంత విలువిస్తాడో ఎంత ప్రేమిస్తాడో అందరికీ తెలిసిందే. నిత్యం వెకేషన్లంటూ ఫ్యామిలీని ప్రపంచ దేశాలన్నీ తిప్పుతాడు. పిల్లలతో ఉండటమంటే మహేష్ బాబుకు మరీ ఇష్టం. వారితో కలిసి మహేష్ చిన్న పిల్లవాడిలా మారిపోతాడు. ఇంట్లో మహేష్ ఎంత ఫన్నీగా ఉంటాడు అల్లరి చేస్తాడన్న సంగతి నమ్రత సోషల్ మీడియాలో చెబుతూ వచ్చేది. ఈ లాక్ డౌన్‌లో మహేష్ చేసిన అల్లరిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉండేది.

తన పిల్లలిద్దరిలో మహేష్ మాత్రం సితార వైపే ఉండేవాడు. గౌతమ్‌ను డిస్టర్బ్ చేస్తూ ఆట పట్టిస్తూ తండ్రీకూతుళ్లు రచ్చ రచ్చ చేసేవారు. సీతూపాపను నవ్వించేందుకు మహేష్ రకరకాల విన్యాసాలు చేసేవాడు. పిల్లలతో వెరైటీ గేమ్స్ ఆడేవాడు. ఇలా లాక్ డౌన్ అంతా తన పిల్లలతో కలిసి ఎంచక్క ఎంజాయ్ చేశాడు. తాజాగా మహేష్ బాబు ఓ పోస్ట్ చేశాడు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు.

 Mahesh Babu Showers Love On Sitara On International Girl Child Day

'ఓ కూతురు పుట్టడం కంటే గొప్ప బహుమతి ప్రపంచంలో మరొకటి ఉండదు. నా చిట్టి పాపని చూసి ఎంతో గర్విస్తుంటాను. నా పాప తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటుంది. తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటుంది. మీ కలలను ఎన్నడూ తిరస్కరించం.. మీ మాట వింటాను..స్ట్రాంగ్‌గా ఉండు.. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని కోసం పోరాడు. మీ కోసం ఈ ప్రపంచంలో సమానత్వాన్ని క్రియేట్ చేస్తా'మంటూ సితారపై, బయట ఉన్న పిల్లలందరిపై మహేష్ ప్రేమను కురిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X