Just In
Don't Miss!
- News
షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్
- Sports
గబ్బా టెస్ట్ విజయం అత్యంత సంతోషాన్నిచ్చింది: మోడీ
- Automobiles
ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టిగువాన్ ఎస్‌యూవీలు మళ్ళీ వస్తున్నాయ్..
- Lifestyle
మీరు త్వరలో గర్భం ప్లాన్ చేస్తున్నారా? మీరు COVID-19 టీకా షాట్ పొందాలా వద్దా అని తెలుసుకోండి
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్.. దూరంగా ఉన్న పలువురు సినీ తారలు.. అగ్ర హీరోలే లేకపోతే ఎలా?
భాగ్య నగరంలో జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం నుంచే మొదలయ్యింది. నిన్నటివరకు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు మాటలు సినిమాల హీరోలను తలపించాయి. ఇక సినిమా తారలు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది. అతి ముఖ్యమైన ఈ ఎన్నికల్లో సినీ తారలు పూర్తి స్థాయిలో పాల్గొంటారా లేదా అనేది అనుమనంగానే ఉంది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల కొంతమంది సినీ తారలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు.

ఉదయమే స్టార్ట్ చేసిన మెగాస్టార్
సాధారణంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక బాధ్యతాయుతంగా ఉండే సెలబ్రెటీలపై ఆ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఉదయమే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి ఓటు వేశారు. ఇక రాజేంద్రప్రసాద్ వంటి స్టార్స్ కూడా సమీప పోలింగ్ బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు ఎలాంటి పనులు ఉన్నా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాడనికి రెడీ అవుతున్నారు.

RRR హీరోలు కూడా..
అయితే మరికొందరు అగ్ర తారలే ఈ సారి ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ప్రతిసారి ఒక సాధారణ వ్యక్తిలా వచ్చి ఓటు వేసే ఎన్టీఆర్ కూడా ఈ సారి ఓటు వేయడం లేదు. RRR షూటింగ్ కోసమని ఎన్టీఆర్ పూణేకు వెళ్లాల్సి వచ్చింది. ఇక మరో రాంచరణ్ కూడా మిస్సవుతున్నాడు. హీరోలిద్దరితో పాటు దర్శకుడు రాజమౌళి అలాగే హైదరాబాద్ లో ఉంటున్న మరికొందరు RRR టీమ్ సభ్యులు గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు.

దూరమైన అల్లు అర్జున్
దేశంలో ప్రధాన నగరాల్లో ఒక్కటైన హైదరాబాద్ ఎన్నికలపై ఈ సారి దేశమంతా దృష్టి పెట్టింది. నగర భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలే కీలకం కానున్నాయి. ప్రచారం అమిత్ షా వచ్చారు అంటే ఎంత రసవత్తరంగా మరిందో చెప్పవచ్చు. అయితే పుష్ప సినిమా షూటింగ్ లో భాగంగా ఆంద్రప్రదేశ్ లో ఉన్న అల్లు అర్జున్ కూడా ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాడు.

వాళ్లే లేకపోతే ఎలా..
హైదరాబాద్ లో అందుబాటులో లేని హీరోలు ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. ఇటీవల నితిన్ కూడా రంగ్ దే సినిమా కోసం దుబాయ్ కు వెళ్లాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికలు సినిమా పరిశ్రమకు చాలా కీలకమైన సమయంలో ఈ విధంగా చాలా మంది హీరోలు ఓటు హక్కు వింయోగించుకోలేని పరిస్థితి ఏర్పడడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.