twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామాయణం మాస్ కథనా?.. రాముడు, వాల్మీకిపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

    |

    నాగబాబు ఈ మధ్య కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. లాక్డౌన్‌లో నాగబాబు మాట్లాడిన మాటలు చేసిన ట్వీట్లు ఎంతగా వివాదాన్ని రాజేశాయో అందరికీ తెలిసిందే. గాంధీజీ, గాడ్సే, కరెన్సీ నోట్లపై బొమ్మలు, హిందూ దేవుళ్లు ఇలా ఎన్నో టాపిక్‌లపై నాగబాబు ట్వీట్లు చేశాడు. వీడియోలు చేశాడు. అవి చినికి చినికి పెద్ద తుపానులా మారి జనసేన పార్టీని చుట్టిముట్టింది. అలా నాగబాబు మధ్యలో కాస్త తగ్గాడు. మళ్లీ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. అది పెద్ద వివాదానికి దారి తీసేలానే ఉంది.

    వాల్మీకిపై రచ్చ..

    వాల్మీకిపై రచ్చ..


    వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా విషయంలో ఎంత రభస జరిగిందో అందరికీ తెలిసిందే. మొదటగా వాల్మీకి అనే టైటిల్‌లో ఆ సినిమా బయటకు వచ్చింది. కానీ చివరి క్షణం టైటిల్ మార్చేశారు. వాల్మీకి పేరును అపహస్యం చేస్తున్నారు మా మనోభావాలు దెబ్బతింటున్నాయని కొందరు హడావిడి చేశారు.

    అలాంటి వారికి కౌంటర్..

    అలాంటి వారికి కౌంటర్..

    వాల్మీకి పేరును సినిమా టైటిల్‌గా పెట్టుకుంటే కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కదా అంటూ నాగబాబు వారికి చురకలంటించాడు. అలా మనోభావాలు దెబ్బతిన్నాయని హడావిడి చేసిని వారికి ఈ నాడు వాల్మీకి జయంతి అన్న సంగతి గుర్తుందా? అని సెటైర్లు వేస్తూ సెన్సేషనల్ పోస్ట్ చేశాడు.

    మాస్ కథలు రాస్తాడట..

    మాస్ కథలు రాస్తాడట..


    ‘ఆరోజు "వాల్మీకి" అని టైటిల్ పెడితే గొడవ చేసిశారు కదా. వాళ్ళకి మరి ఈరోజు వాల్మీకి జయంతి అని గుర్తు ఉండేవుంటుంది. Anyways హ్యాపీ బర్త్డే "వాల్మీకి" గారు. నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు . రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదములు' అని నాగబాబు పోస్ట్ చేశాడు.

    రామాయణం మాస్ కథనా?..

    రామాయణం మాస్ కథనా?..


    నాగబాబు చేసిన పోస్ట్‌లో అంతర్లీనంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు అంటూ వాల్మీకిపై ప్రశంసలు కురిపించడం అంటే.. రామాయణం మాస్ కథ అని చెప్పకనే చెప్పేశాడు. పోనీ అది వదిలేద్దామనుకుంటే.. రామాయణం కథ కాదు నిజంగా జరిగిందని ఓ వైపు నమ్ముతుంటే నాగబాబు ఇలా.. రాముని జీవితాన్ని బాగా రాశారంటూ వాల్మీకి ప్రశంసించాడు. ఏది ఏమైనా నాగబాబు మాత్రం మరో వివాదానికి తెరలేపినట్టే కనిపిస్తోంది.

    English summary
    Nagababu Satirical Comments On Valmiki And Lord Rama,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X