For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బూతు చిత్రం ముందు తేలిపోయిన పవన్ సినిమా.. గంటలోపే వర్మకు గట్టి దెబ్బ!

  By Manoj
  |

  చాలా కాలంగా వివాదాలతో సహవాసం చేస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు గొప్ప గొప్ప చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరొందిన ఆయన... ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. అంతేకాదు, బాలీవుడ్‌లో సినిమాలను తెరకెక్కించే అవకాశాలనూ దక్కించుకున్నాడు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆర్జీవీ.. ఈ మధ్య సున్నితమైన అంశాలను ఎంచుకుని మరీ వివాదాస్పద చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించిన ఓ బూతు చిత్రం... పవన్ సినిమాను కూడా పక్కకు నెట్టేసింది. ఆ వివరాలు మీకోసం.!

   రూటు మార్చిన ఆర్జీవీ.. అవే అస్త్రాలు

  రూటు మార్చిన ఆర్జీవీ.. అవే అస్త్రాలు

  సుదీర్ఘమైన కెరీర్‌లో సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ అన్ని రకాల జోనర్లను టచ్ చేశాడు రాంగోపాల్ వర్మ. ఈ క్రమంలోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరొందాడు. అలాంటి ఆర్జీవీ... ఉన్నట్లుండి రూటు మార్చేశాడు. ఇందులో భాగంగానే రాజకీయాలతో సంబంధం ఉన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆ తరహా చిత్రాలు ఎన్నో తెరకెక్కించి సంచలనం అయ్యాడు.

  సినిమా కోసం కొత్త ప్లాన్ వేసిన వర్మ

  సినిమా కోసం కొత్త ప్లాన్ వేసిన వర్మ

  రాజకీయ నేపథ్యం ఉన్న కథలతో సినిమాలు తీస్తుండడంతో రాంగోపాల్ వర్మకు చిక్కులు ఎదురవుతున్నాయి. వివాదాస్పద చిత్రాలు కావడంతో ఆయన చేస్తున్న వాటిని ఆపేయమని చాలా మంది కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అదీగాక సెన్సార్ చిక్కులు కూడా వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాడు.

   ఆర్జీవీ బిజినెస్.. అదిరిపోయే లాభాలు

  ఆర్జీవీ బిజినెస్.. అదిరిపోయే లాభాలు

  లాక్‌డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోయినా వర్మ మాత్రం సినిమాలు తెరకెక్కిస్తూనే ఉన్నాడు. అతడికి సొంత ఫ్లాట్‌ఫాం ఉండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన ‘రక్త చరిత్ర', ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వల్ల లాభపడలేకపోయిన వర్మ... ఓటీటీలో వదిలిన ‘క్లైమాక్స్', ‘నగ్నం' వంటి చిత్రాలతో నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు.

  పవన్ పేరు సంచలనం.. రెస్పాన్ ఇదే

  పవన్ పేరు సంచలనం.. రెస్పాన్ ఇదే

  వరుసగా వివాదాస్పద చిత్రాలనే తెరకెక్కిస్తోన్న వర్మ.. ఇటీవల ‘పవర్ స్టార్' అనే రాజకీయ నేపథ్యమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ అయిన తర్వాత దీనికి మిశ్రమ స్పందన రావడంతో భారీ స్పందన మాత్రం దక్కించుకోలేకపోయింది.

  పవర్ స్టార్ కలెక్షన్లపై వింత లెక్కలు

  పవర్ స్టార్ కలెక్షన్లపై వింత లెక్కలు

  భారీ అంచనాల నడుమ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్'లో విడుదలైంది ‘పవర్ స్టార్' మూవీ. టాలీవుడ్ హిస్టరీలోనే ఏ సినిమాకూ తీసుకోని విధంగా... దీని ట్రైలర్‌కు సైతం టికెట్ పెట్టాడు వర్మ. కానీ, అది ముందే లీక్ అవడంతో తర్వాత ఫ్రీగా వదిలాడు. ఇక, సినిమాకు కూడా రూ. 250 టికెట్ పెట్టాడు. దీంతో అతడు రూ. 1 - 1.5 కోట్లు వరకు సంపాదించాడని ప్రచారం సాగుతోంది.

  బూతు చిత్రం ముందు తేలిపోయింది

  బూతు చిత్రం ముందు తేలిపోయింది


  రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘పవర్ స్టార్' మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... ఎన్నో వివాదాల నడుమ రూపొందిన ఈ మూవీకి అనుకున్న దాని కంటే చాలా తక్కువ క్లిక్స్ వచ్చాయట. బూతు కంటెంట్‌తో అదే ఆర్జీవీ రూపొందించిన ‘నగ్నం' సినిమానే దీని కంటే ఎక్కువ మంది చూశారని కూడా వార్తలు వస్తున్నాయి.

  #NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
  అలా బయటకు రావడమే కారణమా.?

  అలా బయటకు రావడమే కారణమా.?

  వాస్తవానికి విడుదలకు ముందు పవర్ స్టార్ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమా కోసం చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు. అయితే, రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ రూపంలో సినిమా బయటకు రావడంతో తర్వాత డబ్బులు పెట్టి చూసేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ కారణంగానే ‘పవర్ స్టార్' వెనకబడి ఉంటుందన్న టాక్ ఉంది.

  English summary
  Ram Gopal Varma is an Indian film director, screenwriter and producer, known for his works in Telugu cinema, Bollywood, and television. Varma directed films across multiple genres, including parallel cinema and docudrama noted for their gritty realism, technical finesse, and craft.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X