twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లాస్ ట్యూన్ మాస్ సాంగ్ ఎలా అయ్యిందంటే.. జగదేక వీరుడి పాటల వెనుకున్నకథ చెప్పిన నాని

    |

    తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో రత్నాల్లాంటి ఓ 25 సినిమాలను ఎంచుకుంటే అందులో కచ్చితంగా జగదేకవీరుడు అతిలోక సుందరి కచ్చితంగా ఉంటుంది. ఈ కళాఖండానికి మే 9తో ముప్పై ఏళ్లు పూర్తవుతాయి. ఈ మేరకు ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని మూడు నిజాలను వైజయంతీ సంస్థ నాని వాయిస్ ఓవర్‌లో అందరికీ పరిచయం చేస్తోంది. ఈక్రమంలోనే మొదటి కథను మే 5న విడుదల చేయగా.. రెండో కథను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు.

    మొదటి కథలో..

    మొదటి కథలో..

    అశ్వనీదత్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రైటర్ కో డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తిని, రాఘవేంద్రరావు గారితో తిరుమలకు పంపించారట. ఇద్దరూ తిరుమలపై ఉండగా.. అశ్వనీదత్ గారి మనసు తెలిసిన శ్రీనివాస్ చక్రవర్తి.. భూమ్మీదకు వచ్చిన దేవకన్య ఉంగరం పోతుంది.. అది చిరంజీవికి దొరుకుతుంది. అని జస్ట్ ఊహను మాత్రమే చెప్పారట.అది రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. దత్తు గారి కలకు బాగా దగ్గరగా ఉండటంతో.. ఆయనకూ నచ్చింది. అలా ఈ చరిత్రకు పునాదికి అక్కడ పడిందట.

    పాటల వెనుకున్న కథ..

    పాటల వెనుకున్న కథ..

    మొదటి కథలో సినిమాకు పునాది ఎలా పడిందో వివరించిన నాని.. రెండో కథలో పాటల వెనుకున్న చరిత్రను చెప్పాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అదే విషయాన్ని నాని ప్రస్థావిస్తూ.. ఒక్కో పాటకు ఒక్కో చరిత్ర ఉందని పేర్కొన్నాడు.

     క్లాస్ ట్యూన్.. మాస్ సాంగ్..

    క్లాస్ ట్యూన్.. మాస్ సాంగ్..

    ఇళయరాజా ఈ సినిమా కోసం అన్నీ క్లాస్ ట్యూన్స్, మెలోడీ ట్యూన్స్ కట్టారట. అయితే చిరంజీవి, శ్రీదేవీ ఉన్నప్పుడు ఓ మాస్ సాంగ్ కావాలని కదా అని చెప్పారట.. అయితే ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ మాత్రం అశ్వనీదత్‌కు బాగా నచ్చిందంటా. సరే అయితే చూడండి ఈ క్లాస్ ట్యూన్‌ను మాస్ సాంగ్‌లా ఎలా మారుస్తానో అని వేటూరి అన్నారట. అదే అబ్బనీ తీయనీ దెబ్బ. ఈ పాటను బెంగళూరు, కర్ణాటకలో రెండు రోజుల్లోనూ పూర్తి చేశారట.

    104 డిగ్రీల జ్వరంతో..

    104 డిగ్రీల జ్వరంతో..

    అందాలలో మహోదయం మరో పాటను 11 రోజుల్లో తీశారట. ఇక చివరగా దినక్కుతా అనే పాటను వాహిని స్టూడియోలోనే చిత్రీకరించారట. అదే చివరి రోజు. ఆ షూటింగ్ అయ్యాక శ్రీదేవీ విదేశాలకు వేరే షూటింగ్ నిమిత్తం వెళ్లాల్సి ఉందంటా. అయితే చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ వచ్చి ఫినిష్ చేశారట. సెట్‌లోనే డాక్టర్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడట. చిరు ఆ అంకిత భావమే సినిమా ఇంతటి విజయానికి కారణమని అశ్వనీదత్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

    English summary
    Nani Reveals Story Behind jagadekaveerudu Athiloka Sundari Songs. Sensational songs and the stories behind them Multiple musical notesMusical note 30 Years Of JagadekaVeeruduAthilokaSundari
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X