Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దాని కోసం ఎంతో ఎదురుచూస్తున్నా.. శివజ్యోతి పోస్ట్‌పై నవ్యస్వామి.. ఇక రాత్రంతా రచ్చే!
బుల్లితెరపై సీరియల్‌తో రవికృష్ణ నవ్యస్వామి ఓ రేంజ్‌లో వైరల్ అయ్యారు. ఈ ఇద్దరికి ఒకే సారి కరోనా రావడం, దారుణమైన పరిస్థితిలోకి వెళ్లడం, ఆమె కథ సీరియల్ యూనిట్ మొత్తం షాక్ అవ్వడం అందరికీ తెలిసిందే. అయితే రవికృష్ణ శివజ్యోతిలు బిగ్ బాస్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసిపోవడం, వారితో పాటు నవ్యస్వామి కూడా జాయిన్ అవ్వడంతో సోషల్ మీడియాలో మొత్తం హాట్ టాపిక్ అయింది.

అందరూ కలిసి..
ఇక శివజ్యోతి రవికృష్ణ నవ్యస్వామి తెరపైనా, తెర వెనుకా రచ్చ చేస్తుంటారు. స్పెషల్ ఈవెంట్లలో అయితే వీరు చేసే పర్ఫామెన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా రవికృష్ణ నవ్యస్వామి మధ్యన ఏదో నడుస్తోందనేలా క్రియేట్ చేసేశారు. ఏకంగా ఓ షోలో అయితే ఈ ఇద్దరికి పెళ్లి చేసేశారు.

పెళ్లిపై రూమర్లు..
శ్రీదేవీ డ్రామా కంపెనీ షో కోసం రవికృష్ణ నవ్యస్వామి పెళ్లి పీటలెక్కారు. అయితే అది కేవలం షో కోసమే అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అయింది. పెళ్లి జరిగింది అంటూ ఇదిగో ఫోటోలు అంటూ నెట్టింట్లో రచ్చ రచ్చగా మారిపోయాయి.

నవ్యస్వామి బర్త్ డే..
నేడు నవ్యస్వామి బర్త్ డే. ఈ క్రమంలో రవికృష్ణ, శివజ్యోతి ఇలా అందరూ మంచి ప్లాన్స్ వేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో నవ్యస్వామికి బర్త్ డే విషెస్ చెబుతూ.. రౌడీ ఫెల్లో అనేశాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.. అంతా మంచే జరగాలి.. సంతోషంగా ఉండు అంటూ రవికృష్ణ పోస్ట్ చేశాడు.

శివజ్యోతి ఇలా..
ఇక శివజ్యోతి తన స్టైల్లో విషెస్ చెప్పేసింది. రవికృష్ణ, నవ్యస్వామి, తన భర్త ఉన్న ఫోటోను షేర్ చేసిన శివజ్యోతి ఫన్నీ కామెంట్ చేసింది. హ్యాపీ బర్త్ డే నవ్య పాప.. జల్దిన రా మనం కేక్ కట్ చేద్దాం అని చెప్పుకొచ్చింది. ఇక దానికి నవ్యస్వామి రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ డార్లింగ్ నేను అయితే వెయిటింగో వెయిటింగ్ అని చెప్పేసింది. ఇక రాత్రి అంతా కూడా బర్త్ డే పార్టీతో రచ్చ చేసేలానే కనిపిస్తున్నారు.