For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవిలా మారిపోయిన నిహారిక భర్త: ఆ సినిమాను రీక్రియేట్ చేస్తూ.. పోస్టర్లు వదిలిన మెగా డాటర్

  |

  సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వారసులుగా అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ, మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది నిహారిక కొణిదెల. మెగా డాటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంది. ఇక, ఈ మధ్యనే చైతన్యను వివాహం చేసుకున్న ఆమె.. అతడితో లైఫ్‌ను సాఫీగా సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన భర్తను చిరంజీవిలా మార్చేసింది నిహారిక. ఇంకెందుకు ఆలస్యం? ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

   యాంకరింగ్ నుంచి వెబ్ సిరీస్‌లు

  యాంకరింగ్ నుంచి వెబ్ సిరీస్‌లు

  పేరుకు మెగా డాటరే అయినా ముందుగా బుల్లితెరపై యాంకర్‌గా అడుగు పెట్టింది నిహారిక. ‘ఢీ' అనే డ్యాన్స్ షోకు పని చేసిన ఆమె ఆరంభంలోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించింది. ఇక, ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు నటించింది.

   కలిసి రాని సినిమాలు.. దూరంగా

  కలిసి రాని సినిమాలు.. దూరంగా

  చాలా కాలం పాటు షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటిన నిహారిక.. నాగశౌర్య నటించిన ‘ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే, ఇది నిరాశనే మిగిల్చింది. ఇక, ఆ తర్వాత ఈ మెగా డాటర్ ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. ఫలితంగా ఈమె సినిమాలు తగ్గించింది.

  శృతి మించిన టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్: ఎద అందాలు చూపిస్తూ రచ్చ.. ప్యాంటును కూడా తీసేసి మరీ!

   చైతన్యను పెళ్లాడిన మెగా డాటర్

  చైతన్యను పెళ్లాడిన మెగా డాటర్

  నిహారికకు గత ఏడాది చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు.. అందుకు అనుగుణంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అప్పట్లో ఈ వేడుక నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయింది.

  వివాహం తర్వాత కెరీర్‌ ఆపకుండా

  వివాహం తర్వాత కెరీర్‌ ఆపకుండా

  పెళ్లైన తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను ఆపకూడదని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని అంటున్నారు. అలాగే, తన సొంత బ్యానర్‌పై మరో వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కించింది. దీనికి మాత్రం ఆమె కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే కెరీర్‌కు సంబంధించిన విశేషాలను కూడా వెల్లడిస్తోంది. తద్వారా సినిమాల్లో పెద్దగా నటించకున్నా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఫలితంగా తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

  ప్రియాంక చోప్రా పర్సనల్ సీక్రెట్స్ లీక్: ఆ ఒక్క మెసేజ్‌తో డేటింగ్.. పెళ్లికి ముందే చాలాసార్లు అలా!

  2020 Recap : Celebrities Who Married In Corona Crisis | Filmibeat Telugu
   చిరంజీవిలా చైతూ.. శ్రీదేవిలా నీహా

  చిరంజీవిలా చైతూ.. శ్రీదేవిలా నీహా

  తాజాగా నిహారిక సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. పాత సినిమా పోస్టర్లను రీక్రియేట్ చేసిన పిక్స్ అవి. ఇందులో ‘బావగారూ బాగున్నారా' సినిమాలో చిరంజీవి ఫోజుతో చైతన్య కనిపించాడు. అలాగే, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి'లో శ్రీదేవి గెటప్‌తో నిహారిక దర్శనమిచ్చింది. వీళ్లతో పాటు కీరవాణి కొడుకు కాల భైరవ ‘క్షణ క్షణం'లో వెంకీలా కనిపించడం విశేషం.

  English summary
  Mega Daughter Nikarika Konidela Very Active in Social Media. Now She Niharika Konidela, Chaitanya Jonnalagedda and Gang recreate Movie Posters and Shared in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X