Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఉగాదికి అలా రంజాన్‌కు ఇలా.. పూనమ్ కౌర్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్స్
పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాలతో జరిగిన పరిచయం కంటే పవన్ కళ్యాణ్ వ్యవహారంతోనే తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైంది. కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో పూనమ్ కౌర్ వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్, త్రివిక్రమ్ అంటూ ఆ మధ్య కత్తి మహేష్ చేసిన ఆరోపణలు, బయటకు వచ్చిన ఆడియో ఇలా అన్నీ కలిపి పూనమ్ కౌర్‌ను వెలుగులోకి తీసుకొచ్చాయి.

సోషల్ మీడియాలో అలా..
అయితే పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు ఎవ్వరికీ అర్థం కావు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను కించపరిచినట్టు ట్వీట్లు పెడుతుంది.. గురూజి అంటూ టాప్ డైరెక్టర్‌ను టార్గెట్ చేస్తుంటుంది.. మరి కొన్ని సందర్బాల్లో పవన్ కళ్యాణ్‌ను సపోర్ట్ చేస్తుంటుంది. త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్ నాశనం అవుతున్నాడని పూనమ్ కామెంట్లు పెడుతుంటుంది.

తాజాగా ఇలా..
పూనమ్ కౌర్ ఈ మధ్య వకీల్ సాబ్ సినిమా మీద జరిగిన రాజకీయం చుట్టూ ఓ ట్వీట్ వేసింది. కుళ్లు రాజకీయాలు మానాలి.. వకీల్ సాబ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. సినిమాలు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందంటూ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ వేసింది.

ఉగాదికి నో..
అయితే నిన్న ఉగాది సందర్భంగా పూనమ్ కౌర్ ఎలాంటి ట్వీట్ వేయలేదు. కానీ రంజాన్ మాస ప్రారంభం కాబోతోండటంతో ఓ ట్వీట్ వేసి శుభాకాంక్షలు తెలిపింది. దీనిపై నెటిజన్లు భగ్గుమన్నారు. ఉగాదికి మాత్రం ట్వీట్ వేయలేదు.. రంజాన్‌కు మాత్రం వేశావ్ అంటూ వేలెత్తి చూపుతున్నారు.

రైతుల సమస్యలు..
ఉగాది నేను విష్ చేయలేదు.. ఎందుకంటే.. సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్నారు.. మనం ఇక్కడ వారి పండుగను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటాం.. నేను ఎలా విష్ చేస్తాను.. చేసినా అదంతా ఫేక్ అవుతుంది.. మీరు ఎప్పుడైగా ఉగాదికి విష్ చేస్తుంటే.. రైతుల గురించి, వారి బాధల గురించి ఆలోచించారా? అంటూ పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది.

అప్పుడే గుర్తుకు వస్తుందా?
రైతుల బాధలు అంటూ పూనమ్ వేసిన కౌంటర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉగాది సమయంలోనే నీకు రైతులు గుర్తుకు వచ్చారా? రంజాన్‌కు విష్ చేస్తే గుర్తుకు రాలేదా? అంటూ నెటిజన్లు పూనమ్‌ను ఏకిపారేస్తున్నారు.