Radhe Shyam: ఫ్యాన్స్‌కు ప్రభాస్ జన్మాష్టమి కానుక.. ఆరు భాషల్లో పోస్టర్ రిలీజ్ చేసి విషెస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం కోసం అభిమానులు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిన్నర క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నది. అయితే అభిమానుల నిరీక్షణకు తెరవేసేదుకు ఈ చిత్రం సిద్ధమవుతున్నది. ఆగస్టు 30 తేదీ భగవాన్ కృష్ణుడు జన్మదినం కావడంతో ఆ పర్వదిన్నాన్ని పురుస్కరించుకొని ప్రభాస్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకొన్నారు. రెబల్ స్టార్ రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే ఈ ఫోటో వైరల్ అయింది. రాధేశ్యామ్, తాజా ఫోటో గురించిన వివరాల్లోకి వెళితే.

 రాధే శ్యామ్ పోస్టర్‌ రికార్డు

రాధే శ్యామ్ పోస్టర్‌ రికార్డు

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఏ పోస్టర్ రిలీజ్ చేసినా రికార్డు స్థాయి వ్యూస్ సంపాదించుకొన్నది. కొద్ది రోజలు క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ 14 లక్షల వ్యూస్‌ను సోషల్ మీడియా వేదికలపై సొంతం చేసుకొన్నది. ఫస్ట్ లుక్ వచ్చిన వ్యూస్ పరిగణనలోకి తీసుకొంటే ఇప్పటికీ టాలీవుడ్‌లో ఈ చిత్రానిదే రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఆ తర్వాత స్థానంలో పుష్ప దాదాపు అంతే సమానంలో వ్యూస్ దక్కించించుకొన్నది. ఆ తర్వాత సలార్ 12 లక్షలు, సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్‌కు 9 లక్షలు మాత్రమే వచ్చాయి,

యూరప్‌లో భారీగా షూటింగ్

యూరప్‌లో భారీగా షూటింగ్

ఇక రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇటలీలో జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూట్‌ను ఇటలీ, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో చేయాల్సి ఉండగా, లాక్ డౌన్ పరిస్థితులు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో సెట్ వేసి ఈ సినిమా షూటింగును దాదాపు పూర్తి చేశారు.

ఎవరూ ఊహించిన విధంగా రాధే శ్యామ్‌ వీఎఫెఎక్స్

ఎవరూ ఊహించిన విధంగా రాధే శ్యామ్‌ వీఎఫెఎక్స్

అయితే రాధేశ్యామ్ సినిమాతో భారీగా వీఎఫ్‌ఎక్స్ పనులు ముడిపడి ఉంటం కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు రాని విధంగా గ్రాండ్‌గా విజువల్స్ ఉంటాయి. ప్రేక్షకులకు కొన్ని పాటలు సరికొత్త అనుభూతిని మిగుల్చుతాయి. పాటలే కాకుండా సీన్లు కూడా ఎవరూ ఊహించని నూతన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

జన్మాష్టమి పండుగ రోజున ప్రభాస్

జన్మాష్టమి పండుగ రోజున ప్రభాస్

ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణాష్టమి పండుగ నేపత్యంలో ప్రభాస్ తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ నుంచి రాధేశ్యామ్ ఫోటోను షేర్ చేశారు. ప్రభాస్ తన అభిమానులకు, ప్రేక్షకులకు, కృష్ణ భాగవానుడి భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ.. జన్మాష్టమిని రాధేశ్యామ్ పోస్టర్‌తో ఘనంగా, భక్తిశ్రద్దలతో జరుపుకోండి. మీ పండుగ నేపథ్యంలో మరింత సంతోషాన్ని అందించడానికి ఈ ప్రయత్నం చేశాం అని ప్రభాస్ తన సందేశంలో పేర్కొన్నారు.

Recommended Video

Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
ప్రేమకు విక్రమాదిత్య, ప్రేరణ సరికొత్త భాష్యం

ప్రేమకు విక్రమాదిత్య, ప్రేరణ సరికొత్త భాష్యం

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్‌ను యూవీ క్రియేషన్స్ ఆరు భాషల్లో రిలీజ్ చేసింది. జన్మాష్టమిని మేము ఘనంగా జరుపుకొంటున్నాం. ప్రేమకు విక్రమాదిత్య, ప్రేరణ సరికొత్త భాష్యం చెప్పబోతున్నారు. హ్యాపీ జన్మాష్టమి అంటూ పండుగ శుభాకాంక్షలను యూవీ క్రియేషన్ చెప్పింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో రాధేశ్యామ్ జన్మాష్టమి లుక్‌ను రిలీజ్ చేసింది. డైరెక్టర్ రాధాకృష్ణ, హీరోయిన్ పూజా హెగ్డే కూడా పోస్టర్‌ను రిలీజ్ చేసి పండుగ శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రం 2022, జనవరి 14వ తేదీన రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X