పవన్ కోసం పునర్నవి అందాల ఆరబోత: ఇంతకు ముందెన్నడూ చూడని స్పైసీ లుక్‌లో బిగ్ బాస్ భామ
బిగ్ బాస్ షో ద్వారా ఆదరణ లేని ఎంతో మంది ఆర్టిస్టులు భారీ స్థాయిలో క్రేజ్‌ను అందుకున్నారు. షో జరిగినంత కాలమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా రచ్చ రచ్చ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పునర్నవి భూపాలం ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించినా.. ఈ అమ్మడు రెండేళ్ల క్రితం జరిగిన బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా గుర్తింపును అందుకుంది. కానీ షో తర్వాత స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం అందాల ఆరబోతకు రెడీ అయింది. ఆ వివరాలు మీకోసం!

కెరీర్ అలా మొదలైంది.. దక్కని గుర్తింపు
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఉయ్యాల జంపాల' అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రను పోషించి టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది హాట్ బ్యూటీ పునర్నవి భూపాలం. ఆ తర్వాత శర్వానంద్ 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు.

బిగ్ బాస్‌లోకి ప్రవేశం.. మార్క్ చూపించి
గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది పునర్నవి. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే తన మార్క్ చూపిస్తూ ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది. ముక్కుసూటితనంతో పలు గొడవల్లో భాగమైనప్పటికీ.. ఆమె నిజాయితీకి మంచి పేరు వచ్చింది. అయినా ఈ షోలో చివరి వరకూ కొనసాగని ఆమె మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

అతడితో ప్రేమాయణం... కలిసి హల్‌చల్
బిగ్ బాస్ హౌస్‌లో తనదైన శైలితో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్న పునర్నవి.. సింగర్ రాహుల్ సిప్లీగంజ్ విషయంలో విమర్శలను ఎదుర్కొంది. హౌస్‌లో అతడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు నడిస్తూ తరచూ వార్తల్లో నిలిచింది. షోలోనే కాదు.. బయట కూడా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేశారు. దీంతో వీళ్లకు పెళ్లి కూడా జరగబోతుందని జోరుగా ప్రచారం జరిగింది.

ఎంగేజ్‌మెంట్ ఫోటోను షేర్ చేసిన భామ
కొద్ది రోజుల క్రితం ఓ సినీ నటుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ పునర్నవి సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఇది వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఈ పిక్ 'కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి షాకిచ్చింది. ఆహా వీడియో రూపొందించిన ఈ సిరీస్ రఘునందన్ హీరోగా నటించాడు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

బిగ్ బాస్‌పై పునర్నవి సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది హీరోయిన్ పునర్నవి భూపాలం. అయితే, షో వల్ల వచ్చిన క్రేజ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆమె సక్సెస్ కాలేదు. ఓ వైపు పలువురు కంటెస్టెంట్లు వరుస ఆఫర్లు దక్కించుకుంటుంటే ఈమె మాత్రం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ వల్ల తనకు లాభం జరగలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
Recommended Video

పవన్ కోసం పునర్నవి అందాల ఆరబోత
పవన్ కల్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పునర్నవి ఓ కీలక పాత్రను పోషిస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. కొద్ది సేపే ఉండే ఈ రోల్ కోసం అమ్మడు అందాలు ఆరబోసేందుకు రెడీ అయింది. ఇందుకోసం ఇంతకు ముందెన్నడూ కనిపించని స్పైసీ లుక్‌తో దర్శనమిస్తుందని టాక్.


Click it and Unblock the Notifications











